https://oktelugu.com/

Manchu Manoj : మంచు మనోజ్ మీద దాడి చేసిన వినయ్ ఎవరు..?మోహన్ బాబు కి తన కొడుకుకంటే ఆయనే ఎక్కువై పోయాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోహన్ బాబు కి చాలా మంచి గుర్తింపు అయితే ఉంది. నటుడి గానే కాకుండా మంచి వ్యక్తిత్వం గల వ్యక్తిగా కూడా ప్రేక్షకుల్లో ఆయనకు చాలా మంచి స్థానం అయితే ఉంది.

Written By:
  • Gopi
  • , Updated On : December 10, 2024 / 10:27 AM IST

    Manchu Manoj

    Follow us on

    Manchu Manoj : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మోహన్ బాబు కి చాలా మంచి గుర్తింపు అయితే ఉంది. నటుడి గానే కాకుండా మంచి వ్యక్తిత్వం గల వ్యక్తిగా కూడా ప్రేక్షకుల్లో ఆయనకు చాలా మంచి స్థానం అయితే ఉంది. మరి దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఆయన్ మీదనే ఉంది. ఇక ఇమ్యాంటి పరిస్థితుల్లో ఆయన చేస్తున్న కొన్ని పనుల వల్ల తన ఇమేజ్ ను కోల్పోవాల్సి వస్తుంది… అందుకే ప్రస్తుతం మంచి ఫ్యామిలీ మీద ప్రేక్షకుల్లో తీవ్రమైన అసంతృప్తి అయితే వ్యక్తం అవుతుంది…

    ఇక రీసెంట్ గా మంచు ఫ్యామిలీకి సంబంధించిన వివాదాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. నిజానికి వీళ్ళ మధ్య ఆస్తికి సంబంధించిన తగాదాలే కారణం అంటూ చాలామంది చాలా రకాల వార్తలను స్ప్రెడ్ చేస్తున్న సందర్భంలో మనోజ్ తన ఆవేదనను వ్యక్తం చేస్తూ ఒక లేఖను రిలీజ్ చేశాడు. అయితే ఈ లేఖలో తన తండ్రి, తన అన్న ఆయన్ని ఎలా ఇబ్బంది పెట్టారో దాని గురించి చాలా పూర్తిగా వివరించే ప్రయత్నం అయితే చేశాడు. ఇక ఇదిలా ఉంటే మోహన్ బాబు లాంటి నటుడు తన కొడుకు అయిన మనోజ్ మీద దాడి చేయించడం చాలావరకు తప్పు అంటూ దీన్ని ఖండిస్తున్న సినీ పెద్దలు సైతం ఆయన మీద కొంతవరకు అసంతృప్తిని అయితే వ్యక్తం చేస్తున్నారు.

    మోహన్ బాబు తన కొడుకు అయిన మనోజ్ మీద వినయ్ అనే తన అనుచరుడితో దాడి చేయించినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. అసలు ఇంతకీ వినయ్ అనే వ్యక్తి ఎవరు? గత రెండు మూడు రోజుల నుంచి ఈయన ప్రస్తావన ఎక్కువగా ఎందుకు వినిపిస్తుంది. మోహన్ బాబుకి తన కన్న కొడుకు కంటే వినయ్ ఎక్కువ అయిపోయాడా? అంటూ పలు ఆసక్తికరమైన ప్రశ్నలైతే తలెత్తుతున్నాయి.

    అయితే ఇంతకీ ఈ వినయ్ ఎవరు అసలు మోహన్ బాబుకి అతనికి సంబంధం ఏంటి? అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకుందాం…ఈ వినయ్ అనే వ్యక్తి మోహన్ బాబు యూనివర్సిటీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ట్రస్టీ ఆన్ బైర్డ్ గా వ్యవహరిస్తున్నాడు…ఇక ఇతని పూర్తి పేరు వినయ్ మహేశ్వరి…ఈయన గతం లో 2019 నుంచి 2022 వరకు ప్రముఖ న్యూస్ ఛానెల్ అయిన సాక్షి ఛానెల్ లో సిఈఓ గా పని చేశాడు…

    ఇక ఆ తర్వాత వివిధ రకాల బిజినెస్ కార్యకలాపాలను చూసుకుంటూ వస్తున్న ఈయన ఇప్పుడు మోహన్ బాబు యూనివర్సిటీ పనులను చూసుకోవడమే కాకుండా విష్ణు స్థాపించిన 24 క్రాఫ్ట్స్ ప్రొడక్షన్ హౌజ్ కి సంబంధించిన మేనేజింగ్ పార్టనర్ గా, మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు…ఇక ఈయన వారం లో రెండు రోజులు తిరుపతి విశ్వవిద్యాలయం లో ఉంటాడు…మిగిలిన రోజుల్లో హైదరాబాద్,డిల్లీ, ముంబై దుబాయ్ లో ఉంటాడు…ఇక ఇప్పుడు ఈయన ఏం చెబితే అది మోహన్ బాబు వింటున్నాడని వీళ్ళ మధ్య గొడవలు రావడానికి ఆయనే ప్రధాన కారణమని కూడా కొన్ని వార్తలైతే వస్తున్నాయి…