https://oktelugu.com/

Bigg Boss Telugu 8లో లైన్లోకి వచ్చి మరీ రాంగోపాల్ వర్మ పరిచయం చేసిన ఈ సోనియా ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే..?

ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏదో ఒక రకంగా ఫేమస్ అవ్వాలని చూస్తున్నారు. అందుకోసమే యూట్యూబ్ లో చాలా రకాలుగా ప్రయత్నాలైతే చేస్తున్నారు..

Written By:
  • Gopi
  • , Updated On : September 1, 2024 / 11:09 PM IST

    Soniya Akula introduced by Ramgopal Varma

    Follow us on

    Bigg Boss Telugu 8 : తెలుగు సినిమా ఇండస్ట్రీలో తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ను సంపాదించుకోవడానికి చాలా మంది చాలా రకాలుగా ట్రై చేస్తూ ఉంటారు. ఇక అందులో కొంతమందికి మాత్రమే ఇక్కడ మంచి అవకాశాలు వస్తూ ఉంటాయి. మరి కొంతమంది మాత్రం వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడంలో ఫేయిల్ అవుతూ ఉంటారు… ఇక ఇదిలా ఉంటే బుల్లితెర మీద ఒక రేంజ్ లో భారీ టిఆర్పి రేటింగ్ ను సొంతం చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న ప్రోగ్రాంలో బిగ్ బాస్ షో ఒకటి. దీని ద్వారా చాలామంది లైమ్ లైట్లోకి వస్తున్నారు. నిజానికి ఫేడౌట్ అయిపోయిన చాలా మందికి ఈ షో ద్వారా ఒక ప్లాట్ ఫామ్ అయితే దొరుకుతుందనే చెప్పాలి. ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 8 కూడా స్టార్ట్ అయిన నేపథ్యంలో కంటెస్టెంట్లు ఒక్కొక్కరిగా ఎంట్రీ ఇస్తు తమను తాము పరిచయం చేసుకుంటూ బిగ్ బాస్ షో టైటిల్ విన్నర్ గా గెలవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక అందులో భాగంగానే ‘సోనియా ఆకుల’ అనే ఒక తెలుగు నటి కూడా బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ నటి గురించి ప్రత్యేకంగా రాంగోపాల్ వర్మ బైట్ ఇవ్వడం అనేది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.

    ఫ్రెండ్ కి ఈ సోనియా ఆకుల ఎవరు అనే ప్రశ్న ప్రతి ఒక్కరి మైండ్లో మెదులుతుంది. నిజానికి ఈవిడ సినిమాల్లో అవకాశాల కోసం భారీగా ప్రయత్నాలు చేసింది.అయితే అడపాదడపా పాత్రలు మాత్రమే ఆమెకు వచ్చాయి. కానీ గుర్తింపు ఉన్న ఒక్క పాత్ర కూడా రాకపోవడం తీవ్రమైన ఇబ్బందికి గురి చేసిన విషయం అనే చెప్పాలి. 2022 వ సంవత్సరంలో రామ్ గోపాల్ వర్మ కరోనా నేపథ్యంలో తీసిన సినిమాలో ఆమె మెయిన్ లీడ్ లో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది.

    అలాగే జార్జ్ రెడ్డి సినిమాలో కూడా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో నటించి తనను తాను మంచి నటిగా పరిచయం చేసుకుంది. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఆమెకు గుర్తుండిపోయే పాత్రలైతే రావడం లేదు. దాంతో ఇప్పుడు ఆమె కొద్ది రోజుల నుంచి సినిమాలకు దూరంగా ఉంటూ వస్తుంది. అయినప్పటికీ ఒక్కసారిగా బిగ్ బాస్ షోలో అవకాశం రావడంతో ఆమె ఎగిరి గంతేస్తుందనే చెప్పాలి.

    ఇక బిగ్ బాస్ లో విన్నర్ గా నిలిచి మళ్లీ సినిమాల్లో అవకాశాలను దక్కించుకోవాలని సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా గ్రాండ్ గా తీర్చిదిద్దుకోవాలని ఆమె చూస్తున్నట్లు గా తెలుస్తుంది…చూడాలి మరి బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ లను ఆమె సక్సెస్ ఫుల్ గా పూర్తి చేస్తారా లేదా అనేది…