https://oktelugu.com/

Bigg Boss Telugu 8 : బోల్డ్ కంటెంట్ వీడియోలతో చెడ్డ పేరు తెచ్చుకున్న ‘బిగ్ బాస్ 8’ కంటెస్టెంట్ కిరాక్ సీత బ్యాక్ గ్రౌండ్ చూస్తే ఆశ్చర్యపోతారు!

అందరి లాగా కాకుండా కాస్త వెరైటీ గా ఉండాలని, ఆడియన్స్ కి నేరుగా కనెక్ట్ అవ్వాలని బోల్డ్ కంటెంట్ ని నమ్ముకుంది. ఈమె వీడియోస్ మొత్తం కుర్రాళ్ళు పిచ్చెక్కిపోయే రేంజ్ లో ఎంతో బోల్డ్ గా ఉంటుంది. ఆమె పలికే మాటలు కూడా బోల్డ్ గా ఉంటాయి. ఆ యాంగిల్ లో ఫేమస్ అవ్వడంతో సినిమాల్లో కూడా ఆమెకి అలాంటి అవకాశాలే ఇచ్చారు.

Written By:
  • Vicky
  • , Updated On : September 1, 2024 / 10:51 PM IST

    Bigg Boss 8' Contestant Kirrak Seetha

    Follow us on

    Bigg Boss Telugu 8 : నేడు బిగ్ బాస్ సీజన్ 8 గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ లో హౌస్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ లో టీవీ సీరియల్స్, సోషల్ మీడియా రెగ్యులర్ గా అనుసరించని వారికి నేడు హౌస్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ చాలామందికి తెలియకపోవచ్చు. కేవలం యాంకర్ విష్ణు ప్రియా, ఆదిత్య ఓం తప్ప బిగ్ బాస్ ఆడియన్స్ కి దాదాపుగా అందరూ కొత్తగానే అనిపించొచ్చు. అయితే హౌస్ లోకి అడుగుపెట్టిన 9 వ కంటెస్టెంట్ కిరాక్ సీత మాత్రం ఆడియన్స్ కి కాస్త సుపరిచితమే అయ్యుండొచ్చు. ఎందుకంటే ఈమె లేటెస్ట్ హిట్ ‘బేబీ’ లో ఒక క్యారక్టర్ చేసింది కాబట్టి. ఈమె వల్లనే హీరో పాపం సినిమాలో ఎటు కాకుండా పోతాడు. ఇదంతా పక్కన పెడితే అసలు ఎవరు ఈ సీత?, ఈమెలో ఉన్న ప్రత్యేకతలు ఏమిటి?, బిగ్ బాస్ టీం ఈమెని ఏరికోరి ఎంచుకోవడానికి కారణాలు ఏమిటి?, అంతలా ఈమె బిగ్ బాస్ టీం ని ఈమె ఎలా ఆకర్షించింది అనేది ఇప్పుడు మనం ఈ స్టోరీ లో చూడబోతున్నాము.

    కిరాక్ సీత కి సుప్రియ అనే మరోపేరు కూడా ఉంది. ఈమె ఆంధ్ర ప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతానికి చెందిన అమ్మాయి. పుట్టి పెరిగింది మొత్తం నంద్యాల లోనే, కానీ ఆమె చిన్నతనం లో ఉండగానే తల్లిదండ్రులు హైదరాబాద్ కి షిఫ్ట్ అయ్యారు. చదువు పూర్తి చేసిన తర్వాత మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి సినిమాల్లోకి వచ్చి పెద్ద హీరోయిన్ అవ్వాలి అనేది ఈమె కల. అందుకోసం ఎంతో కష్టపడింది కూడా, కానీ సినిమా కష్టాలు ఎలా ఉంటాయో అందరికి తెలిసిందే కదా. అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేసింది కానీ, విఫలం అయ్యింది. ఆ క్రమంలోనే ఆమెకి 7 ఆర్ట్స్ యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాలి అనే ఆలోచన వచ్చింది. అందరి లాగా కాకుండా కాస్త వెరైటీ గా ఉండాలని, ఆడియన్స్ కి నేరుగా కనెక్ట్ అవ్వాలని బోల్డ్ కంటెంట్ ని నమ్ముకుంది. ఈమె వీడియోస్ మొత్తం కుర్రాళ్ళు పిచ్చెక్కిపోయే రేంజ్ లో ఎంతో బోల్డ్ గా ఉంటుంది. ఆమె పలికే మాటలు కూడా బోల్డ్ గా ఉంటాయి. ఆ యాంగిల్ లో ఫేమస్ అవ్వడంతో సినిమాల్లో కూడా ఆమెకి అలాంటి అవకాశాలే ఇచ్చారు.

    ‘బేబీ’ చిత్రానికి ముందు పలు సినిమాలు చేసింది కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ బేబీ చిత్రం మాత్రం ఈమె జీవితాన్ని మలుపు తిప్పిందనే అనుకోవాలి. ఈ సినిమా తర్వాత ఆమెకి ఈటీవీ లో ప్రసారమయ్యే ‘ఢీ సెలబ్రిటీ’ డ్యాన్స్ షోలో ఒక కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం దక్కింది. కొంతకాలం తర్వాత ఆ షోని మానేసిన సీత, ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది. సోషల్ మీడియా లో బోల్డ్ కంటెంట్స్ ఎక్కువగా చేయడం వల్ల బోలెడంత నెగటివిటీ ని మూటగట్టుకున్న కిరాక్ సీత, ఈ రియాలిటీ షో ద్వారా జనాలకు ఎంతమేరకు కనెక్ట్ అవుతుందో చూడాలి.