Bigg Boss 6 Telugu Winner: ఈ సీజన్ విన్నర్ ఎవరో కంటెస్టెంట్స్ స్వయంగా తేల్చేశారు. మెజారిటీ ఇంటి సభ్యులు ఒక కంటెస్టెంట్ కి అధికంగా ఓట్లు వేసి, టైటిల్ అతడిదే అన్నట్లు పరోక్షంగా హింట్ ఇచ్చారు. శనివారం హోస్ట్ నాగార్జున ప్రతి కంటెస్టెంట్ ని కన్ఫెషన్ రూమ్ కి పిలిచి ఇంట్లో ఉండటానికి అర్హులు ఎవరు అనర్హులు ఎవరని అడిగి తెలుసుకున్నాడు. కంటెస్టెంట్స్ అందరూ వరుసగా ఒక అన్ డిజర్వింగ్, ఒక డిజర్వివింగ్ కంటెస్టెంట్ నేమ్ చెప్పారు. ఇక మెజారిటీ సభ్యులు శ్రీహాన్ తోపు అన్నారు. ఆట పరంగా,మాట పరంగా, ఎంటర్టైనింగ్, టాస్క్స్ ఇలా ప్రతి అంశంలో శ్రీహాన్ చాలా మెరుగ్గా ఉన్నాడని ఓట్లు వేశారు.

14 మంది కంటెస్టెంట్స్ లో అత్యధికంగా 7గురు సభ్యులు శ్రీహాన్ డిజర్వింగ్ అని మద్దతు తెలిపారు. శ్రీహాన్ కి ఉన్న అనుకూలతలు, ఇంటి సభ్యులు అతని గురించి ఇస్తున్న ఫీడ్ బ్యాక్ చూస్తుంటే అతడు టాప్ ఫైవ్ లో కచ్చితంగా ఉంటాడు అనిపిస్తుంది. అలాగే అతడు బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ గా కూడా అవతరించే అవకాశం లేకపోలేదు. ఇంటి సభ్యులలో శ్రీహాన్ కి ఈ రేంజ్ పాపులారిటీ ఉందని, అతని గేమ్ వాళ్ళను అంతగా ఇంప్రెస్ చేస్తుందని ఊహించలేదు.
ఇక మోస్ట్ అన్ డిజర్వింగ్ కంటెస్టెంట్ గా మెరీనాకు ఓట్లు వేశారు. మెజారిటీ కంటెస్టెంట్స్ ఆమె హౌస్లో యాక్టివ్ గా ఉండటం లేదన్నారు. ముఖ్యంగా ఫిజికల్ టాస్క్ లో పెర్ఫార్మన్స్ దారుణం అన్నారు. ఆమె వంట చేయడం, కిచెన్ చూసుకోవడం చేస్తున్నారని బిగ్ బాస్ గేమ్స్, టాస్క్స్ లో ఇన్వాల్వ్ మెంట్ లేదని చెప్పుకొచ్చారు. ఆమెకు అత్యధికంగా 5 ఓట్లు పడ్డాయి. దీంతో అతి త్వరలో మెరీనా ఎలిమినేట్ కావడం ఖాయం అంటున్నారు.

శ్రీహాన్ తర్వాత రెండు డిజర్వింగ్ ఓట్లు సంపాదించిన గీతూ, రేవంత్, సూర్య టాప్ కంటెస్టెంట్స్ గా పేరు తెచ్చుకున్నారు. మెరీనా, రాజ్, వాసంతి, అర్జున్ మోస్ట్ అన్ డిజర్వింగ్ కంటెస్టెంట్స్ గా ఇంటి సభ్యులు నిర్ణయించారు. ఆదిరెడ్డి, బాల ఆదిత్య, కీర్తి, ఫైమా, శ్రీసత్య, ఇనయా ఏ లిస్ట్ లోకి రాలేదు. ఇక అర్జున్ ని గేమ్ లో పప్పు అని అవమానపరిచిన రేవంత్ కి నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఇతరులను హర్ట్ చేసేలా మాట్లాడవద్దు, ఫైనల్ వార్నింగ్ ని గట్టిగా చెప్పాడు. ఇక 13 మంది కంటెస్టెంట్స్ నామినేషన్స్ లో ఉండగా ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ కొనసాగుతోంది.