Salaar: ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో సలార్ సినిమా ఫీవర్ నడుస్తుంది. ఈ సినిమా మొన్న రిలీజ్ అయి వసూళ్ల వర్షం కురిపిస్తుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా మీద ప్రతి ఒక్క అభిమాని కూడా తమదైన రీతిలో వాళ్ళ అభిమానాన్ని చాటుకుంటున్నారు.ఇక సోషల్ మీడియా వేదికగా అయితే ప్రతి ఒక్కరు ఈ సినిమా మీద పాజిటివ్ గా స్పందిస్తూ తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఇదిలా ప్రభాస్ ఉంటే చాలా రోజుల తర్వాత ఒక బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు ఇక దాంతో ఇప్పుడు ప్రభాస్ అభిమానులు విపరీతమైన ఆనందంతో ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాకి మొదట హీరోయిన్ గా శృతిహాసన్ కాకుండా వేరే హీరోయిన్ ని తీసుకోవాలని అనుకున్నారట కానీ కొన్ని కారణాలవల్ల ఆమె ఈ సినిమాలో చేయలేకపోయింది. ఆమె ఎవరు అంటే త్రిబుల్ ఆర్ సినిమాతో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని ఏర్పాటు చేసుకున్న అలియా భట్ ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తే బాగుంటుందని ప్రశాంత్ నీల్ అనుకొని తనకి కథ కూడా చెప్పారట కానీ తనకున్న బిజీ వల్ల తను ఈ క్యారెక్టర్ ని చేయలేకపోయింది.
దాన్ని శృతిహాసన్ అందుకొని తనదైన రీతిలో నటించి మెప్పించింది. ఈ సినిమాలో శృతిహాసన్ క్యారెక్టర్ మొదట అందరూ చిన్న క్యారెక్టర్ అనుకున్నారు కానీ సినిమా స్టార్ట్ అవ్వడమే తను మీద నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి తనది కూడా ఈ సినిమాలో కీలకమైన పాత్ర అనే చెప్పాలి. కేవలం గ్లామర్ కు మాత్రమే పరిమితం అవ్వకుండా ఆమె చాలా మంచి అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా మీద పలువురు సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక చిరంజీవి లాంటి స్టార్ హీరో ప్రభాస్ ని ప్రశాంత్ నీల్ ని పొగుడుతూ ట్విట్టర్ లో ట్వీట్ చేయడం అనేది హాట్ టాపిక్ గా మారింది…
ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ గా అలియా భట్ ఒక మంచి ఛాన్స్ కోల్పోయిదంటు అభిమానులు వాళ్ల అభిప్రాయాన్ని తెలియజేస్తున్నాయి ఆ అదృష్టం శృతిహాసన్ కి దక్కింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఇక ఇప్పుడు ఇండియా మొత్తంలో సలార్ ఈ ఇయర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచే అవకాశాలు కూడా చాలానే ఉన్నాయి…