Rajamouli – Shankar: తమిళ్ డైరెక్టర్లలో టాప్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శంకర్ గత కొద్దీ సంవత్సరాలు గా అసలు హిట్ అనేది కొట్టలేక పోతున్నాడు. నిజానికి ఈయన తీసే సినిమాలు అన్ని కూడా ఒక సోషల్ మెసెజ్ తో కూడుకున్న సినిమాలు కావడం తో ఈయన సినిమాలకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది.ఈయన లాస్ట్ సినిమా అయినా రోబో 2 .0 సినిమాతో ప్లాప్ ని మూటగట్టుకున్నాడు ఈ సినిమాలో గ్రాఫిక్స్ టాప్ లెవల్లో ఉన్న కూడా స్టోరీ అంత బాగాలేకపోవడం తో ఈ సినిమాని ప్రేక్షకులను ఆదరించలేకపోయారు అనే చెప్పాలి.అయితే ఇంతకు ముందు ఆయన చేసిన సినిమాలు తమిళ్ తోపాటు గా తెలుగులో కూడా చాలా వరకు సూపర్ సక్సెస్ అయ్యాయనే చెప్పాలి.
ఆయన మొదటి సినిమా అయిన జెంటిల్ మ్యాన్ నుంచి రోబో వరకు వరుసగా ఆయన తీసిన సినిమాలు తెలుగులో సూపర్ సక్సెస్ సాదించాయనే చెప్పాలి.ఇక ప్రస్తుతం రాజమౌళి బాహుబలి లాంటి ఒక సినిమా తో పాన్ ఇండియా రేంజ్ లో సూపర్ సక్సెస్ కొట్టాడు. ఇక అలాగే మొన్న వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాతో మొత్తం ఇంటర్నేషనల్ వైజ్ గా సూపర్ సక్సెస్ అందుకున్నాడు. అయితే ఇప్పుడు శంకర్ చేస్తున్న గేమ్ చెంజర్,అలాగే ఇండియన్ 2 సినిమాలతో రాజమౌళి బాహుబలి తో సాధించిన 2000 కోట్లు కలక్షన్స్ ని బ్రేక్ చేస్తాడా అనేది ఇప్పుడు చర్చనీయాంశం గా మారింది. నిజానికిఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుంది అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి కొందరు ఇండియా లో రాజామౌళి టాప్ డైరెక్టర్ అంటున్నారు మరికొందరు మాత్రం శంకర్ టాప్ డైరెక్టర్ అంటున్నారు శంకర్ ఈ సినిమా తో సక్సెస్ కొడితే మాత్రం ఇద్దరి మధ్య మంచి పోటీ ఉంటుంది…అయితే రాజమౌళి ఎక్కువగా ఎమోషన్స్ తో ఉన్న స్టోరీ ని సినిమాగా చేస్తే శంకర్ మాత్రం గ్రాఫిక్స్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ సినిమాలు తీస్తాడు.
అందుకే ఈసారి ఎలాగైనా సూపర్ హిట్ కొట్టి తాను కూడా ఇండస్ట్రీ లో టాప్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకోవాలని చూస్తున్నాడు శంకర్ మరి ఇద్దరిలో ఇండియా నెంబర్ వన్ డైరెక్టర్ గా ఎవరు ఉంటారు అనేది చూడాలి అంటే ఇంకా కొన్ని రోజులు వేయిట్ చేయక తప్పదు…ఇక రాజమౌళి కూడా ఇప్పుడు పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు మహేష్ బాబు హీరో గా అడ్వెంచర్ జానర్ కి సంభందించిన సినిమా ఒకటి చేస్తున్నాడు.నిజానికి ఈయన చేసిన సినిమాలకి వరల్డ్ వైడ్ గామంచి ఫ్యాన్స్ ఉన్నారు అనే విషయం ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రూవ్ చేసాడు రాజమౌళి ఇక ఇప్పటివరకు అయితే రాజమౌళినే ఇండియాలో నెంబర్ వన్ డైరెక్టర్ గా ఉన్నాడు.ఇక శంకర్ ఇండియన్ 2 , అలాగే గేమ్ చెంజర్ తో ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తాడో చూడాలి…
ఇక ఈ సినిమాలతో ఇండియా లో నెంబర్ వన్ డైరెక్టర్ ఎవరు అనేదానికి ఒక సమాధానం అయితే దొరుకుతుంది.ఇక ఈలిస్ట్ లో బాలీవుడ్ కి చెందిన డైరెక్టర్లు లేకపోవడం నిజంగా వాళ్ల దురదృష్టం అనే చెప్పాలి…ఇక వీళ్ళిద్దరిలోనే టాప్ డైరెక్టర్ ఎవరు అనేది తేలుతుందా లేకపోతే ఇంకా వేరే డైరెక్టర్లు ఎవరైనా వీళ్ళని బీట్ చేసి నెంబర్ వన్ కి వెళ్తారా అనేది చూడాలి అంటే ఇంకా వాళ్ల సినిమాలు రిలీజ్ అయేదాకా వెయిట్ చేయక తప్పదు …