Venkatesh : తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరోలుగా గుర్తింపు పొందుతున్న విక్టరీ వెంకటేష్.. ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఇక అందులో భాగంగానే ఇప్పటికే అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఒక సినిమా చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశాడు. ఇక దానికి తోడుగా కొంతమంది కొత్త డైరెక్టర్ల కథలను కూడా వింటూ వాళ్ళతో సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇక ఇలాంటి నేపథ్యంలోనే వెంకటేష్ హీరోగా ఒక 20 సంవత్సరాల క్రితం వచ్చిన ఒక సూపర్ హిట్ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ ని తీయాలని తమిళ దర్శకుడు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. ఆయన ఎవరు అంటే గౌతమ్ వాసుదేవ్ మీనన్…ఈయన వెంకటేష్ ని హీరోగా పెట్టి ఇంతకు ముందు ‘ఘర్షణ ‘అనే సినిమా చేశాడు. ఇది తమిళ్ సినిమా రీమేక్ అయినప్పటికీ తెలుగులో మంచి విజయాన్ని అందుకుంది.
ముఖ్యంగా వెంకటేష్ పోషించిన డిజీపి రామచంద్ర క్యారెక్టర్ అయితే చాలా హైలైట్ గా నిలిచిందనే చెప్పాలి. వెంకటేష్ కెరియర్ లో గుర్తుండిపోయే పాత్రల్లో ఈ పాత్ర ఒకటి అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అయితే ఈ దర్శకుడు ఇప్పుడు కొన్ని సినిమాల్లో నటిస్తూ నటుడిగా బిజీ అవుతున్నాడు. అయినప్పటికీ తను మాత్రం డైరెక్షన్ ను వదలకుండా మరి కొన్ని సినిమాల లైన్ లో పెట్టే పనిలో ఉన్నాడు. ఇక అందులో భాగంగానే వెంకటేష్ ను హీరోగా పెట్టి ఘర్షణ 2 సినిమాని తెరకెక్కించాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ సినిమా ఇప్పుడు స్టార్ట్ అవుతుందా లేదా వచ్చే సంవత్సరం మొదలవుతుందా అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.
అయితే స్క్రిప్ట్ కూడా ఆల్మోస్ట్ పూర్తి అయిపోయినట్టుగా వార్తలైతే వస్తున్నాయి. మరి దానికి తగ్గట్టుగానే గౌతమ్ మీనన్ ఈ సినిమాని కూడా సూపర్ డూపర్ సక్సెస్ గా నిలుపుతాడా? లేదా వెంకటేష్ కి ప్లాప్ ఇస్తాడా? అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక ప్రస్తుతానికైతే వెంకటేష్ వరుసగా కామెడీ సినిమాలు చేస్తున్నాడు. మళ్లీ ఘర్షణ 2 అంటే అది ఒక సీరియస్ మూడ్ లో నటించాల్సి ఉంటుంది.
ఇక రీసెంట్ గా సైంధవ్ సినిమాలో సీరియస్ గా నటించిన అది వర్కౌట్ కాలేదు. మరి వెంకటేష్ మళ్లీ ఘర్షణ కి సీక్వెల్ చేయడానికి సిద్ధమయ్యాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది. ఇక మొత్తానికైతే ఈ క్రేజీ కాంబో వర్కౌట్ అయితే మాత్రం మరోసారి డిజిపి రామచంద్ర ని మనం తెరపైన చూసే అవకాశం అయితే ఉంది…