Bigg Boss 7 Telugu బిగ్ బాస్ ఇంటి కొత్త కెప్టెన్ ఎవరు అవుతారు అని తెలుసుకునేందుకు కంటెస్టెంట్స్ కి ‘ఫ్లోట్ ఆర్ సింక్ ‘అంటూ కొత్త టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఇందులో ఎవరి ఫోటో అయితే చివరి వరకు మునిగిపోకుండా ఉంటుందో వారు కెప్టెన్సీ రేసులో కొనసాగుతారు అని చెప్పారు బిగ్ బాస్.ఇక కెప్టెన్ అయ్యేందుకు ఎవరు అనర్హులో డిసైడ్ చేసే అవకాశం కంటెస్టెంట్స్ చేతిలో పెట్టాడు బిగ్ బాస్. ఇందులో భాగంగా ముందుగా శోభా, అశ్విని పేరు చెప్పి ‘నువ్వు కెప్టెన్ అవ్వడానికి ఫిట్ కాదు, నీలో ఆ పవర్ కనిపించడం లేదు అని చెప్పింది.అశ్విని ఫోటో నీళ్లలో పడేసి రేస్ నుంచి తప్పించింది శోభా.
ఆ తర్వాత పూజ ,ప్రశాంత్ ని కెప్టెన్సీ రేస్ నుండి తప్పిస్తూ వేరే వాళ్ళకి కూడా ఛాన్స్ రావాలి కదా అని రీజన్ చెప్పింది. తర్వాత యావర్,ప్రియాంక అనర్హురాలు అని చెప్పాడు. నాకు అమర్ కి గొడవ జరిగినప్పుడు మధ్యలో ఎందుకు వచ్చావు అని నిలదీశాడు. దీంతో ఇద్దరూ కాసేపు వాదించుకున్నారు. ఇక ఆ తర్వాత అమర్ శివాజీ ని అనర్హుడని చెప్పి ఫోటో స్విమ్మింగ్ పూల్ లో వేశాడు.
దీంతో ఈ కెప్టెన్సీ రేస్ నుంచి అశ్విని,పల్లవి ప్రశాంత్,ప్రియాంక,శివాజీ తప్పుకున్నారు. ఇక కెప్టెన్సీ రేస్ లో ఉన్న వారిలో అర్జున్ లేక సందీప్ లలో ఒకరికి బిగ్ బాస్ ఇంటి కొత్త కెప్టెన్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరిలో చూసుకుంటే కెప్టెన్ అయ్యే అవకాశం అర్జున్ కె ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. ఇక నెటిజన్స్ కూడా తదుపరి కెప్టెన్ అర్జున్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
అర్జున్ కి కెప్టెన్ అయ్యేందుకు అన్ని లక్షణాలు ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు ఆడియన్స్. మరి ఆడియన్స్ కోరుకున్నట్లు అర్జున్ కెప్టెన్ అవుతాడో లేక సందీప్ అవుతాడో అనేది ఉత్కంఠగా మారింది. ఇక ఈ రోజు జరిగే ఫైనల్ టాస్క్ లో గెలిచి తదుపరి కెప్టెన్ ఎవరు అవుతారో చూడాలి.