Chiranjeevi: తెలుగు ఇండస్ట్రీలో కొన్ని సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతున్న హీరోలు ఎందరో ఉన్నారు. అప్పటి నుంచి కష్టపడి స్టార్ స్టేటస్ ను సంపాదించి వారికంటూ స్పెషల్ గుర్తింపు పొందారు. మరికొందరు కనిపించకుండా ఇతర పనుల్లో బిజీ అయ్యారు. ఇక సీనియర్ హీరోలు ఇప్పటికీ కూడా సినిమాల్లో నటిస్తూ స్టార్లుగా కంటిన్యూ అవుతున్నారు. అందులో చెప్పుకోదగ్గ హీరో చిరంజీవి. తనదైన స్టైల్ లో సినిమాలు తీస్తూ ఎంతోమంది అభిమానులను సంపాదించారు మెగాస్టార్ చిరంజీవి. అయితే ఈయనతో సినిమా చేయాలని డైరెక్టర్లు ఎదురుచూస్తుంటారు. ఎప్పుడు అవకాశం వస్తుందంటూ ఎదురుచూస్తారు కూడా. కానీ ఒక డైరెక్టర్ మాత్రం ఆఫర్ వచ్చినా చేయను అన్నారట? ఇంతకీ ఎవరా డైరెక్టర్ అనుకుంటున్నారా?
చిరంజీవితో ఆఫర్ వద్దన్న డైరెక్టర్ అంటూ ఆ మధ్య ఎక్కువ వార్తలు వచ్చాయి. అయితే సైరా సినిమా ఫ్లాప్ అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా ఫ్లాప్ తర్వాత ఒక కమర్షియల్ హిట్ కావాలనుకొని.. డైరెక్టర్ శంకర్ ను సందర్శించారట చిరంజీవి. కానీ అప్పటికప్పుడు సినిమా చేయడం అంటే కష్టమని.. దానికి సంబంధించిన కథ, కథనం అన్ని చాలా జాగ్రత్తగా చూసుకొని ముందుడుగు వేయాలని లేకపోతే ఆ సినిమా ఫ్లాప్ అవుతుందనే ఉద్దేశ్యంతో హరీష్ శంకర్ నో చెప్పారట. డైరెక్ట గా నో చెప్పకుండా సంవత్సరం సమయం కావాలని అడిగారట.
అప్పటికప్పుడు స్క్రిప్ట్ రెడిగా పెట్టుకున్న బాబీ చిరంజీవికి కథ చెప్పి.. సినిమా ఒకే చేసుకున్నారు. బాబీ చిరు కాంబోలో వచ్చిన వాల్తేరు వీరయ్య ఏ రేంజ్ లో హిట్ అయిందో తెలిసిందే. హరీష్ శంకర్ వదులుకున్న ఆ అవకాశం బాబీని వరించి హిట్ ను పొందేలా చేసింది. అయితే ఈయన మంచి టాలెంట్ ఉన్న డైరెక్టర్ కానీ.. చిరంజీవికి సరిపడే కథ లేదనే నేపథ్యంలో వెనకడుగు వేశారట. మొత్తం మీద ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయినా చిరంజీవితో సినిమా చేయాలంటే ఇప్పటికీ ఎంతో మంది ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం ఎలాంటి కథతో ముందుకు వస్తారో చూడాలి.