Ranbir Kapoor: రామ్ చరణ్ కథతో వస్తున్న రన్బీర్ కపూర్ డైరెక్టర్ ఎవరంటే..?

గౌతమ్ తిన్ననూరి బాలీవుడ్ లో జెర్సీ సినిమాని రీమేక్ చేశాడు. ఈ సినిమా అక్కడ అనుకున్నంత సక్సెస్ సాధించలేదు. దాంతో ఆయన ఇప్పుడు విజయ్ దేవరకొండ తో ఒక సినిమాని చేస్తున్నాడు .

Written By: Gopi, Updated On : January 10, 2024 9:46 am

Ranbir Kapoor

Follow us on

Ranbir Kapoor: రీసెంట్ గా రన్బీర్ కపూర్ అనిమల్ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకున్నారు. దాంతో రన్బీర్ కపూర్ ప్రస్తుతం తెలుగులో కూడా భారీ మార్కెట్ ని సంపాదించుకున్నాడు. అయితే ఇలాంటి సమయంలో రన్బీర్ కపూర్ కోసం మరికొందరు తెలుగు డైరెక్టర్లు తమదైన రీతిలో కథలను రెడీ చేస్తున్నట్లు గా తెలుస్తుంది. ఇక ఇప్పటికే రన్బీర్ కపూర్ కి తెలుగులో స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన గౌతమ్ తిన్ననూరి కూడా ఒక కథను వినిపించినట్టుగా తెలుస్తుంది.

అయితే ఇప్పటికే గౌతమ్ తిన్ననూరి బాలీవుడ్ లో జెర్సీ సినిమాని రీమేక్ చేశాడు. ఈ సినిమా అక్కడ అనుకున్నంత సక్సెస్ సాధించలేదు. దాంతో ఆయన ఇప్పుడు విజయ్ దేవరకొండ తో ఒక సినిమాని చేస్తున్నాడు అయితే ఈ సినిమా తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో అయిన రన్బీర్ కపూర్ తో సినిమా చేయడానికి అతనికి కథ చెప్పినట్టుగా తెలుస్తుంది. నిజానికి అయితే ఈ కథని గౌతమ్ రామ్ చరణ్ తో చేయాలి. కానీ కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ సెట్ అవ్వలేదు. దాంతో ఇప్పుడు అదే కథని రన్బీర్ కి చెప్పినట్టు గా తెలుస్తుంది…ఇక ఈ కథని రన్బీర్ కపూర్ కూడా ఓకే చేసినట్టుగా సమాచారం అయితే అందుతుంది. నిజానికి సందీప్ రెడ్డి వంగ అనిమల్ సినిమాతో రణ్బీర్ కపూర్ కి ఇచ్చిన సక్సెస్ ఆయనకి చాలా వరకు హెల్ప్ అయిందనే చెప్పాలి. చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న రణ్బీర్ కపూర్ ని ఆదుకున్న ఏకైక డైరెక్టర్ గా సందీప్ రెడ్డి వంగ కాబట్టి రన్బీర్ కపూర్ ఎప్పటికి సందీప్ ని గుర్తుంచుకుంటాడు…

ఇక ఇది ఇలా ఉంటే తెలుగు డైరెక్టర్లందరు కూడా రణ్బీర్ కపూర్ వెంట పడడమే కాకుండా ఇప్పటికే స్క్రిప్ట్ లను కూడా అతనికి నరేట్ చేస్తున్నారు. అయితే అందులో రన్బీర్ కి గౌతమ్ తిన్ననూరి చెప్పిన కథ బాగా నచ్చడంతో ఆయనతో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా స్టార్ట్ అవ్వడానికి ఇంకో సంవత్సరం పట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే గౌతమ్ విజయ్ దేవరకొండతో ఒక సినిమా చేస్తున్నాడు.

కాబట్టి ఈ సినిమా పూర్తయిన తర్వాత అప్పుడు రన్బీర్ కపూర్ తో ఆయన సినిమా చేస్తాడు. కాబట్టి రన్బీర్ కపూర్ తో చేసే సినిమాని మరొక బ్లాక్ బస్టర్ గా మలచడానికి గౌతమ్ కూడా చాలా వరకు ప్రయత్నం అయితే చేస్తున్నట్టు గా తెలుస్తుంది. ఇక దీంతో గౌతమ్ తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అనే చెప్పాలి.