Guntur Kaaram Pre Release Event: మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ డైరెక్షన్ లో వస్తున్న గుంటూరు కారం సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ రెండు రోజుల క్రితమే జరగాల్సింది. కానీ పోలీస్ సిబ్బంది కొరతగా ఉండటంతో దాన్ని పోస్ట్ పోన్ చేశారు. ఇక దాంతో గుంటూరు కారం ప్రి రిలీజ్ ఈవెంట్ ఉండదు అని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా గుంటూరులో గుంటూరు కారం ఈవెంట్ ని ఏర్పాటు చేశారు. ఇక ఈ ఈవెంట్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు మాట్లాడుతూ గుంటూరులో ఈ ఈవెంట్ ని ఏర్పాటు చేయాలని త్రివిక్రమ్ గారే చెప్పారు. ఈవెంట్ ఎక్కడ కండక్ట్ చేద్దాం అని మేమంతా డిస్కషన్ లో ఉన్నప్పుడు త్రివిక్రమ్ మీ ఊర్లో చేద్దాం సార్ అని చెప్పడంతో అందరం గుంటూరుకు వచ్చేసాం అంటూ మహేష్ బాబు తన ఊరు అయిన గుంటూరు గురించి చాలా ఎమోషనల్ గా మాట్లాడాడు.
ఇక అలాగే త్రివిక్రమ్ గురించి మాట్లాడుతూ రెండు సంవత్సరాల నుంచి మోరల్ గా నాకు సపోర్ట్ ఇస్తూ నన్ను బాగా అర్థం చేసుకుంటూ,నేను ముందుకు నడిచేలా చేసిన ఒకే ఒక వ్యక్తి త్రివిక్రమ్. మా ఇద్దరి రిలేషన్ హీరో డైరెక్టర్ మధ్య నుండే రిలేషన్ మాత్రమే కాదు అంతకు మించి ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాంటిది. మన ఫ్యామిలీ మెంబర్ గురించి మనం ఎక్కువగా మాట్లాడం అందుకే నేను త్రివిక్రమ్ గారు గురించి బయట ఎప్పుడూ ఎక్కువగా మాట్లాడను,ఆయన నాకు సంబంధించిన అన్ని విషయాలను చాలా దగ్గర ఉండి చూసుకున్నారు సార్ ‘ఐ లవ్ యు సర్ ‘అంటూ మహేష్ బాబు మాట్లాడడంతో ఈవెంట్ కి వచ్చిన అందరూ కూడా చాలా ఆనందపడ్డారు…
అలాగే వాళ్ల నాన్న సూపర్ స్టార్ కృష్ణ గారిని గుర్తు చేసుకుంటూ మా నాన్న ఎప్పుడు నాతో ఉండేవాడు ప్రతి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా కలక్షన్స్ ని నాకు ఫోన్ చేసి చెప్తూ ఉండేవాడు. ఇప్పుడు ఆయన లేడు గా నాకు అంత కొత్తగా ఉంది. ఇకమీదట నుంచి నా సినిమా కలక్షన్లు మీరు నాకే చెప్పాలి. నా గురించి కూడా మీరే చూసుకోవాలి.ఇక మీదట నాకు అమ్మ నాన్న అంతా మీరే అంటూ మహేష్ బాబు ఎమోషనల్ గా మాట్లాడుతూ కన్నీళ్లు కూడా పెట్టుకున్నాడు… మొత్తానికైతే మహేష్ బాబు కి వాళ్ల నాన్న కృష్ణ గారిని కోల్పోయిన భాద ఇంకా తనని వెంటాడుతునే ఉంది. అందుకే ఆయన వాళ్ల నాన్న టాపిక్ రావడం తో చాలా ఎమోషనల్ అయినట్టు గా తెలుస్తుంది…
