Trivikram Srinivas Vs Vijay Bhaskar: ఒక సినిమా తెరకెక్కాలి అంటే ముందుగా ఆ సినిమాకి కథ రాసే కథ రచయిత కావాలి అలాగే స్టోరీని స్క్రీన్ మీద సినిమాగా మలిచి దాన్ని జనాలకు నచ్చినట్టుగా చూపించే దర్శకుడు కావాలి. ఇక ఈ రోజుల్లో కథ రచయితలే దర్శకులుగా మారుతున్నారు.
కానీ ఇంతకుముందు కథ ఒకరు రాస్తే, డైరెక్షన్ మరొకరు చేసేవారు. అయితే రచయితలు దర్శకులు ఒక టీమ్ గా ఏర్పాడు చాలా మంచి సినిమాలు తీసిన వాళ్లు ఉన్నారు అందులో మొదటగా బాపు రమణలు ఉంటే వాళ్ల తర్వాత స్థానం లో త్రివిక్రమ్ విజయభాస్కర్ ఉంటారు. ఇక వీళ్ల గురించి మనం ఎంత ఎక్కువ చెప్పుకున్న తక్కువే అవుతుంది. ఎందుకంటే స్టార్ హీరోలకు సైతం సూపర్ డూపర్ సక్సెస్ లను అందించారు.
ఒకానొక టైంలో ఇండస్ట్రీలో మాస్ అండ్ ఫ్యాక్షన్ సినిమాలు ఎక్కువగా నడుస్తున్నప్పుడు వీళ్ళు కామెంది ఎంటర్ టైనర్స్ ను తెరకెక్కించి సూపర్ సక్సెస్ లు అందుకున్నారు. ఇక ఇదిలా ఉంటే అందులో త్రివిక్రమ్ దర్శకుడిగా మారిన తర్వాత విజయభాస్కర్ గారికి ఒక కథ కూడా ఇవ్వలేదు. ఆ తర్వాత విజయ భాస్కర్ కూడా కొన్ని సినిమాలతో సక్సెస్ అందుకున్నప్పటికీ ఫైనల్ గా మాత్రం తను స్టార్ డైరెక్టర్ గా నిలబడలేకపోయాడు. అయితే త్రివిక్రమ్ తలుచుకుంటే అటు సినిమాలు చేసుకుంటూ ఇటు కథ కూడా ఇచ్చే అంత కెపాసిటీ ఉంది. అయినప్పటికీ తను కథ ఇవ్వకపోవడానికి కూడా ముఖ్య కారణం ఏంటి అంటే జై చిరంజీవ సినిమా సమయంలో వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే వీళ్ళ కాంబో లో వచ్చిన అన్ని సినిమాలు సూపర్ సక్సెస్ సాధిస్తే జై చిరంజీవ సినిమా మాత్రం పెద్దగా ఆడలేదు.
దాంతో వీళ్లిద్దరి మధ్య చిన్న గా మనస్పర్థలు వచ్చినట్టు గా వార్తలు కూడా వచ్చాయి. ఇక మొత్తానికి అయితే వీళ్ళిద్దరి మధ్య చిరంజీవి సినిమా గొడవ పెట్టించిందని న్యూస్ బయట బాగా స్ప్రెడ్ అయింది. ఇక ఇప్పుడు వీళ్లిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందంటూ వార్తలు వస్తున్నాయి. ఇక వీళ్ళ కాంబో లో సినిమా రావడం అనేది నిజమో, అబద్దమో తెలియదు కానీ వీళ్ళిద్దరూ కలిసిపోయి మళ్లీ సినిమాలు చేస్తే మాత్రం ఆ సినిమాలు చూడడానికి ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారనే చెప్పాలి…