https://oktelugu.com/

Game Changer Movie: ‘గేమ్ చేంజర్’ 4 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..బ్రేక్ ఈవెన్ అందుకోవాలంటే ఇంకా ఎన్ని వందల కోట్లు రావాలో తెలుసా?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'గేమ్ చేంజర్' చిత్రం ఇటీవలే విడుదలై నెగటివ్ టాక్ ని తెచ్చుకొని అభిమానులను తీవ్రమైన నిరాశకు గురి చేసిన సంగతి తెలిసిందే. కంటెంట్ పరంగా సినిమా నిరాశకి గురి చేసి ఉండొచ్చు కానీ, ఓవరాల్ వసూళ్ల పరంగా మాత్రం పర్వాలేదు అనే రేంజ్ లో ఉంది.

Written By:
  • Vicky
  • , Updated On : January 14, 2025 / 05:57 PM IST
    Follow us on

    Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘గేమ్ చేంజర్’ చిత్రం ఇటీవలే విడుదలై నెగటివ్ టాక్ ని తెచ్చుకొని అభిమానులను తీవ్రమైన నిరాశకు గురి చేసిన సంగతి తెలిసిందే. కంటెంట్ పరంగా సినిమా నిరాశకి గురి చేసి ఉండొచ్చు కానీ, ఓవరాల్ వసూళ్ల పరంగా మాత్రం పర్వాలేదు అనే రేంజ్ లో ఉంది. సంక్రాంతి సెలవులు పూర్తి అయ్యే వరకు ఒక మోస్తారు థియేట్రికల్ రన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే నిన్న భోగి పండుగ రోజున మాత్రం సినిమా వసూళ్ళలో ఎలాంటి జంప్ లేదు కానీ, నేడు మాత్రం అన్ని ప్రాంతాల్లోనూ హౌస్ ఫుల్స్ నమోదు చేసుకుంటూ బయ్యర్స్ కి కాస్త ఊపిరి ఆడనిచ్చేలా చేసింది. నైజాం లోని మాస్ ప్రాంతాల్లో ఈ చిత్రానికి మొదటి రోజు కంటే నేడు ఎక్కువ వసూళ్లు రావడం ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం. ఓవరాల్ గా నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఎంత వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాము.

    నైజాం ప్రాంతంలో ఈ చిత్రానికి దాదాపుగా 43 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. నాలుగు రోజులకు గాను 16 కోట్ల 53 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఫుల్ రన్ లో 25 నుండి 30 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని అక్కడి ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. అదే విధంగా సీడెడ్ లో ఈ చిత్రానికి నాలుగు రోజులకు గాను 9 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఫుల్ రన్ లో ఇక్కడ 15 కోట్ల రూపాయిల వరకు రావొచ్చని అంచనా. అదే విధంగా ఉత్తరాంధ్ర ప్రాంతం లో నాలుగు రోజులకు 8 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకి, గుంటూరు జిల్లాలో 6 కోట్ల రూపాయిలు, కృష్ణ జిల్లాలో 4 కోట్ల 20 లక్షల రూపాయిలు, నెల్లూరు జిల్లాలో 3 కోట్ల 15 లక్షలు రాబట్టింది.

    అదే విధంగా ఉభయగోదావరి జిల్లాలు కలిపి 10 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 56 కోట్ల 88 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు, 80 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఇక మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే కర్ణాటక లో 4 కోట్ల 35 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు, తమిళనాడు 3 కోట్ల 15 లక్షలు, కేరళలో పాతిక లక్షలు, నార్త్ ఇండియా లో 15 కోట్లు రూపాయిలు, ఓవర్సీస్ లో 13 కోట్ల రూపాయిలు, ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా 92 కోట్ల 63 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు, 162 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. డిజాస్టర్ టాక్ తోనే ఈ చిత్రం వంద కోట్ల షేర్ మార్కుని అందుకోబోతుంది.