Taman , Devisree Prasad : సినిమా ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్ కీలక పాత్ర వహిస్తూ ఉంటాడు. ఒక సినిమా సక్సెస్ లో అయిన, ఫెయిల్యూర్ లో అయిన మ్యూజిక్ కి చాలా ప్రాధాన్యత ఉంటుంది. అందుకే సినిమాలను చేసేటప్పుడు మంచి మ్యూజిక్ డైరెక్టర్ ని తీసుకోవడానికి దర్శక నిర్మాతలు చాలా వరకు ఆసక్తి చూపిస్తూ ముందుకు సాగుతూ ఉంటారు…
దేవి సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ మారి ఆ సినిమాతోనే మంచి గుర్తింపును సంపాదించుకున్న మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్… తనదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక నాగార్జునతో చేసిన మన్మధుడు సినిమాతో మొదటిసారిగా స్టార్ హీరోకి మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించిన ఆయన ఆ సినిమా సక్సెస్ లో కీలక పాత్ర వహించాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు తిరుగులేని మ్యూజిక్ డైరెక్టర్ గా ముందుకు సాగడమే కాకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన శైలిని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక ఇప్పుడు కూడా ఆయన చేస్తున్న ప్రతి సినిమా విషయంలో చాలావరకు ముందుకు సాగుతూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి ని క్రియేట్ చేసుకున్నాడు. ఇక తనదైన రీతిలో సత్తా చాటడమే కాకుండా ఆయన చేసే ప్రతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. ముఖ్యంగా దేవిశ్రీప్రసాద్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరితో పనిచేయడమే కాకుండా ఆయనతో వాళ్లకి ఒక మంచి ర్యాపో కూడా క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఇదిలా ఉంటే కిక్ సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్ గా అవతరించిన తమన్ తనదైన రీతిలో ప్రేక్షకులను మెప్పిస్తూ తన సాంగ్స్ సూపర్ హిట్ చేసుకోవడమే కాకుండా ఆయనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని కూడా క్రియేట్ చేసుకున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న సినిమాలు మంచి విజయాలను కూడా సాధిస్తూ వస్తున్నాయి…
ఇక ఇదిలా ఉంటే వీళ్ళిద్దరిలో ఎవరు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అనే ప్రశ్న తలెత్తిన ప్రతిసారి ఎక్కువ మంది దేవిశ్రీప్రసాద్ కే ఓటు వేస్తూ వస్తున్నారు. కారణం ఏమిటంటే దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించిన సినిమాలోని ఆల్బమ్ మొత్తం సూపర్ సక్సెస్ గా నిలుస్తూ ఉంటాయి.
ఇక ఈమధ్య ఆయన జోరు కొంచెం తగ్గినప్పటికి ఆయన చేసే ప్రతి మ్యూజిక్ కూడా చాలా అల్టిమేట్ గా నిలుస్తూ ఉండడమే దానికి ప్రధాన కారణం అని చెబుతూ ఉంటారు. ఇక తమన్ మ్యూజిక్ విషయానికి వస్తే ఆయన మ్యూజిక్ కూడా చాలా బాగున్నప్పటికి ప్రతిపాట కూడా ఏదో ఒక సాంగ్ నుంచి కాపీ చేశాడు అంటూ చాలావరకు విమర్శలను అయితే ఎదుర్కొంటూ వస్తున్నాడు.
ఇక అల్టిమేట్ గా కాపీ విషయాన్ని పక్కన పెడితే ఆయన ట్యూన్స్ కూడా జనాల్లోకి చాలా ఈజీగా రీచ్ అవుతూ ఉండటం విశేషం… మరి ఈ ఇద్దరిలో ఎవరు బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పడం కొంతవరకు కష్టమే అయినప్పటికి రాబోయే సినిమాలతో ఎవరు ప్రూవ్ చేసుకుంటారు. అలాగే ఎవరిని ఎవరు బీట్ చేస్తూ ముందుకు సాగుతారనే దాని మీదనే ఇప్పుడు సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది…