Tollywood: సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ కొట్టడం అంటే అంత ఆషామాషీ విషయం కాదు. సక్సెస్ రావడానికి హీరోగాని, దర్శకుడు గానీ ఎంత కష్టపడతారు అనే విషయం సినిమా చూసి జనాలకి ఎక్కువగా తెలియదు. కానీ ఇండస్ట్రీ లో పనిచేసిన ప్రతి ఒక్కరికి డైరెక్టర్ గాని, హీరో గాని, ప్రతి టెక్నీషియన్ పడే బాధ ఏంటో తెలుస్తుంది.
వాళ్ళకి నిద్ర ఉండదు, సమయానికి తిండి ఉండదు, అయిన కూడా వాళ్ళకి సినిమా మీద ఫ్యాషన్ ఉంది కాబట్టే సినిమాలు చేస్తూ ఉంటారు. ఇక ఇలాంటి వాళ్లంతా ఒక సినిమా కోసం ప్రాణం పెట్టి చేస్తూ ఉంటారు కాబట్టే ఆ సినిమాలు సక్సెస్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఒక హీరో స్టార్ గా నిలబడ్డాడు అంటే దాని వెనక చాలామంది కృషి ఉంటుంది. ముఖ్యంగా దర్శకుడు ఎలా యాక్టింగ్ చేయాలో నటుడికి నేర్పించి మరీ అతని చేత యాక్టింగ్ చేయించి అతన్ని స్టార్ చేస్తూ ఉంటాడు. అందువల్లే దర్శకుడు గొప్పవాడు అంటూ చాలామంది చెప్తూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఒకప్పుడు దాసరి నారాయణరావు ఒక మంచి మాట చెప్పారు.
ఒక హీరో తలుచుకుంటే ఒక గొప్ప దర్శకుడిని తయారు చేయలేడు. కానీ దర్శకుడు తలుచుకుంటే ఒక గొప్ప హీరోని మాత్రం తయారు చేస్తాడు అంటూ ఆయన చేసిన కామెంట్లు అప్పట్లో ఇండస్ట్రీలో పెను సంచలనాన్ని రేపాయి. ఇక అప్పటివరకు స్టార్ హీరోలుగా ఉన్న మన హీరోలందరూ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ మీద కొంత అసంతృప్తిని అయితే వ్యక్తం చేశారు. దాంతో స్టార్ హీరోలందరికీ సవాల్ చేసిన దాసరి నారాయణరావు అదే టైంలో విజయశాంతిని హీరోయిన్ గా పెట్టి ఒసేయ్ రాములమ్మ అనే సినిమా చేశాడు. ఈ సినిమాతో స్టార్ హీరోల సినిమాలు ఎంత కలెక్షన్లు అయితే సంపాదిస్తాయో అంతకంటే ఎక్కువ కలెక్షన్లు సంపాదించి ఇండస్ట్రీలో ఒక సరి కొత్త రికార్డును సృష్టించాడు.
యాక్టర్స్ కూడా చాలా కష్టపడుతున్నప్పటికీ దర్శకుడు లేకపోతే ఆర్టిస్ట్ నిలబడలేడు అనేది అందరూ చెప్పే మాట… నిజానికి దర్శకుడు గానీ రచయిత గానీ లేకపోతే సినిమా తెరపైకి రాదు అలాంటప్పుడు నటుడు ఎంత యాక్టింగ్ చేసిన కూడా ఆయన యాక్టింగ్ ఎలివేట్ అవ్వదు కాబట్టి దర్శకుడు గొప్పవాడు… అలాగే రైటర్ గానీ దర్శకుడు గానీ రాసి తీసే కథని తెరపైన ప్రేక్షకులకు నచ్చే విధంగా నటించి మెప్పించే నటుడు కూడా చాలా కీలకం…దర్శకుడు నటుడు ఇద్దరూ కలిసి ఒక్క తాటిపై నడిచినప్పుడే సినిమాని అద్భుతంగా వస్తుంది. ఫైనల్ గా దర్శకుడు హీరో రచయిత హీరో అందరు సక్సెస్ అవుతారు ఫైనల్ గా సినిమా కూడా సక్సెస్ అవుతుంది అని దాసరి గారు ఎప్పుడో చెప్పారు…