https://oktelugu.com/

NTR vs Yash : విజయ్ vs మహేష్ బాబు గొడవ ముగిసింది… ఇప్పుడు ఎన్టీయార్ vs యశ్ వీళ్ళ లో బెస్ట్ యాక్టర్ ఎవరు..?

సినిమా ఇండస్ట్రీ లో నటుల మధ్య పోటీ ఉండాలి. కానీ అది సినిమా వరకే ఉండాలి. పర్సనల్ లైఫ్ లో మాత్రం చాలా మంచి ఫ్రెండ్స్ గా ఉండాలి...ఇక మన హీరోలు ఎలా ఉన్నా కూడా వాళ్ల ఫ్యాన్స్ మాత్రం ఎప్పుడూ గొడవలు పడుతూనే ఉంటారు

Written By:
  • Gopi
  • , Updated On : July 22, 2024 / 06:45 PM IST
    Follow us on

    NTR vs Yash :  ఒక సినిమా సక్సెస్ సాధించాలంటే ఆ సినిమాకు సంబంధించిన కథ బాగుండాలి. దర్శకుడు ఆ సినిమాని తెరకెక్కించే విధానం అద్భుతంగా ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే సినిమాలు సూపర్ సక్సెస్ గా నిలుస్తాయి. ఇక ఆ సినిమాలో నటించే నటీనటులు కూడా వాళ్ళ హావా భావాలతో వాళ్ళు చేస్తున్న సీన్ కి ఒక అందాన్ని తీసుకురావాలి. ఇక ఇలా చేసినప్పుడు సగటు ప్రేక్షకుడు ఆ సినిమాకి కనెక్ట్ అయి ఆ మూవీ ని ఒకటికి పది సార్లు చూడడానికి ఆసక్తి చూపిస్తాడు. ఒకవేళ వీటిలో ఏ విషయం లో మిస్టేక్ జరిగిన కూడా ప్రేక్షకుడికి ఆ సినిమా నచ్చదు. దానివల్ల సినిమా డిజాస్టర్ గా మారే అవకాశాలైతే ఉన్నాయి. మరి మొత్తానికైతే ఇలాంటి కేటగిరీలో నుంచే ఇప్పుడు చాలామంది సినిమా మేకర్స్ వరుస సినిమాలను చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక హీరోలు కూడా వాళ్ళ పరిధిని దాటి సినిమాలు చేస్తూ పాన్ ఇండియా వైడ్ గా సక్సెస్ లను అందుకుంటున్నారు. ఇక ఇదిలా ఉంటే తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన విజయ్…అలాగే  తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న మహేష్ బాబు ఫ్యాన్స్ మధ్య చాలా రోజుల నుంచి ఫ్యాన్ వార్స్ అయితే జరుగుతున్నాయి. మరి వీరిలో ఎవరు బెస్ట్ యాక్టర్ అనే దానిమీద పలు రకాల చర్చలైతే చేస్తున్నారు. ఇక మొత్తానికైతే వీళ్ళు ఎవరికి వారు ఇండివిజువల్ గా చాలా మంచి నటులు అయినప్పటికీ ఇద్దరిని కనక పోల్చి చూసినట్లైతే ఎవరి సినిమాల్లో వాళ్ళు నటులుగా రాణిస్తున్నారు. కాబట్టి ప్రత్యేకించి పోల్చి చూడాల్సిన అవసరం లేదంటూ కొంతమంది సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.
    ఫ్యాన్స్ మా హీరో గొప్ప మా అంటే మా హీరో గొప్ప అంటూ ఉంటారు. అంతే తప్ప హీరోల మధ్య ఎలాంటి బేషజాలైతే ఉండవు. కాబట్టి వీరిద్దరిని పోల్చి చూడాల్సిన అవసరం లేదని సినీ మేధావులు కూడా వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే ఇటు కన్నడ స్టార్ హీరో అయిన యశ్.. తెలుగు లో స్టార్ హీరో అయిన ఎన్టీయార్ ను  పోల్చుతూ ఈ ఇద్దరి లో ఎవరు బెస్ట్ యాక్టర్ అంటూ సోషల్ మీడియాలో ఒక వార్తనైతే చక్కర్లు కొట్టిస్తున్నారు. నిజానికైతే యశ్ ‘ కేజిఎఫ్ ‘ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకున్నాడు.
    ఇక ఎన్టీఆర్ ఎప్పటినుంచో ఇండస్ట్రీలో ఉంటూనే వైవిద్య భరితమైన కథాంశాలను ఎంచుకొని సక్సెస్ ఫుల్ హీరోగా ముందుకు సాగుతున్నాడు. ఇక వీళ్ళిద్దరిని కనక పోల్చి చూసినట్లయితే వీళ్ళిద్దరిలో ఎవరికి వారు మంచి నటులు అయినప్పటికీ ఎన్టీయార్ తో పోలిస్తే యశ్ కొన్ని హావా భావాలను మాత్రం పలికించలేడు. యశ్ యాక్షన్ మాస్ సినిమాలకు మాత్రమే పనికొస్తాడు. తప్ప క్లాస్ సినిమాలు అలాగే కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలకు అతను అసలు పనికి రాడు.
    కానీ ఎన్టీఆర్ మాత్రం ఎలాంటి పాత్రలోనైనా నటించి  మెప్పించగలిగే కెపాసిటీ ఉన్న నటుడు కాబట్టి కొన్ని విషయాల్లో ఎన్టీఆర్ యశ్  కంటే కొంచెం బెటర్ అని చెప్పొచ్చు…ఇక ఈ విషయం మీద కన్నడ అభిమానులు కూడా యశ్ చాలా మంచి నటుడు అంటూ సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్లయితే చేస్తున్నాడు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం హిందీ రామాయణం లో యశ్ విలన్ గా చేస్తుంటే, ఎన్టీయార్ మాత్రం దేవర, వార్ 2 సినిమాల్లో బిజీగా ఉన్నాడు.