Taapsee Marriage: టాలీవుడ్ ఇండస్ట్రీలో తక్కువ సినిమాలు చేసి తర్వాత రోజుల్లో టాలీవుడ్ పైన నెగటివ్ గా మాట్లాడిన హీరోయిన్ లలో తాప్సీ ఒక్కరు. ఈమె ముందుగా టాలీవుడ్ తోనే మంచి పేరు సంపాదించింది. కానీ ఆ తర్వాత టాలీవుడ్ పైనే విషం కక్కింది అంటూ విమర్శల పాలైంది తాప్సీ. ఇక ఈమె నటించిన సినిమాలు మంచి హిట్ అవడంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. కానీ ప్రస్తుతం ఈమె టాలీవుడ్ కి దూరం అయిందనే చెప్పాలి.
అయితే తాప్సీ త్వరలో పెళ్లి పీటలెక్కనుందట. మరి ఈమెకు కాబోయే భర్త ఎవరు? ఆయన బ్యాగ్రౌండ్ ఏంటి? అంటూ సెర్చ్ చేస్తున్నారు నెటిజన్లు. అయితే ఈమె పెళ్లి ఉదయపూర్ వేదికగా జరగనుందని భోగట్టా. డంకీ సినిమాతో యావరేజ్ హిట్ అందుకున్న తాప్సీ పెళ్లి తర్వాత సినిమాల్లో నటిస్తారో లేదో అని ఆందోళన చెందుతున్నారు ఆమె అభిమానులు. అది తన భర్తపై డిపెండై ఉంటుందని కొందరి టాక్. అయితే ఈయన మథియన్ బో డెన్మార్క్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కాగా 2014 సంవత్సరం నుంచే వీరిద్దరు ప్రేమలో ఉన్నారని టాక్.
రాజ్ షమాని పాడ్ కాస్ట్ సమయంలో తాప్సీ మథియన్ బోతో తన రిలేషన్ షిప్ ను రివీల్ చేశారు. మథియస్ బో 1980 సంవత్సరంలో జన్మించారు. తాప్సీ, మథియన్ బో మధ్య ఏజ్ గ్యాప్ 8 సంవత్సరాలు అని టాక్. 1998 సంవత్సరంలో మథియన్ బో అంతర్జాతీయ బ్యాడ్మింటన్ లో అడుగుపోట్టారు. యూపీపియన్ ఛాంపియన్ షిప్స్ 2006లో పురుషుల డబుల్స్ లో మథియన్ బో రజతం గెలిచారు. 2010 సంవత్సరంలో డెన్మార్క్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్ టైటిళ్లు నెగ్గడం గమనార్హం.
2011 సంవత్సరంలో ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ లో చాంపియన్ గా అవతరించారు. 2012 లండన్ ఒలింపిక్స్ లో ఆయన రజత పతకం గెలిచారు. చైనాలో 2013 వరల్డ్ చాంపియన్ షిప్స్ లో ఆయన సిల్వర్ మెడల్ గెలుచుకున్నారు. 2015 సంవత్సరంలో యూరోపియన్ గేమ్స్ లో ఆయన స్వర్ణ పతకం గెలిచారు. 2012, 2017 సంవత్సరాలలో యూరోపియన్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్స్ లో ఆయన విజేతగా నిలిచారు. ఇక 2020 సంవత్సరంలో మథియన్ బో రిటైర్మెంట్ ప్రకటించారు. ఇప్పుడు బ్యాడ్మింటన్ పై ఆసక్తి ఉన్నవారికి శిక్షణ ఇస్తున్నారు తాప్సీకి కాబోయే భర్త.