Prithviraj Sukumaran: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది దర్శకులు గొప్ప విజయాలను సాధించారు. కానీ రాజమౌళి సాధించిన విజయం ముందు అవన్నీ దిగదుడుపే… ఎందుకంటే తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడు కూడా తనే కావడం విశేషం… ప్రస్తుతం ఆయన మహేష్ బాబుతో చేస్తున్న పాన్ వరల్డ్ సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉన్నాయి. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఈ సినిమా మరొక ఎత్తుగా మారబోతోంది. ఇక నవంబర్ నెల నుంచి అప్డేట్స్ ఇస్తానని చెప్పిన రాజమౌళి నవంబర్ నెల వచ్చేసింది కాబట్టి మహేష్ బాబు ట్విట్టర్లో రాజమౌళి మీద విపరీతమైన సెటైర్లయితే వేశాడు. ఇక ఈ ట్విట్టర్ వేదికగా ‘ఎస్ఎస్ఎంబి 29’ సినిమాలో నటిస్తున్న వాళ్ళందరూ పాల్గొనడం విశేషం… ఇక ట్విట్టర్ వేదికగా పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్నైతే చెప్పాడు. తను ఏ షూట్ కి వెళ్తున్నాడు, ఎక్కడికి వస్తున్నాడో ఇంట్లో కూడా చెప్పకపోవడంతో ప్రతిసారి తను హైదరాబాద్ వెళుతున్నానని చెప్పడంతో తన ఇంట్లో వాళ్లకు డౌట్ వచ్చిందని చెప్పాడు.
ఎందుకంటే పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో నడుస్తున్నట్టుగా అఫిషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. కాబట్టి తన ఇంట్లో కూడా ఆ విషయాన్ని చెప్పలేదట… ఇక ఇంకొన్ని రోజులు ఇలానే చేస్తే తన వైఫ్ తనని ఇంట్లో నుంచి షూటింగ్ కూడా వెళ్ళనివ్వదని తన ఆవేదనను వ్యక్తం చేసే ప్రయత్నం చేశాడు.
నవంబర్ నెల నుంచి అప్డేట్స్ పరంపర కొనసాగుతుందని చెప్పిన రాజమౌళి తొందర్లోనే ఈ సినిమాకి సంబంధించిన ఒక అప్డేట్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడట. పృథ్వీరాజ్ సుకుమారన్ మహేష్ బాబు లకు సంబంధించిన ఒక పోస్టర్ ను రిలీజ్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే డిసెంబర్ నెలలో ఈ మూవీ గ్లింప్స్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
మొత్తానికైతే రాజమౌళి ఈ సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకుని బరిలోకి దిగుతున్నాడు. కాబట్టి ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో మనం ఊహించుకోవచ్చు…ఇక 2027 వ సంవత్సరం చివర్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలైతే ఉన్నాయి…