https://oktelugu.com/

Mahesh Babu Daughter Sitara: మహేష్ బాబు కూతురు సీతార కి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా??

Mahesh Babu Daughter Sitara: టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు కి ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..యూత్ మరియు ఫామిలీ ఆడియన్స్ లో మహేష్ బాబు కి ఉన్న బ్రాండ్ ఇమేజి వేరు..మాములు యావరేజి టాక్ ఉన్న సినిమాలకి కూడా వంద కోట్ల రూపాయిల షేర్ ని రప్పించే సత్తా ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక్క మహేష్ బాబు కి మాత్రమే ఉంది..ఇంత స్టార్ స్టేటస్ ఉన్నప్పటికీ కూడా తనతో పోటీ పడే […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 29, 2022 / 10:20 AM IST
    Follow us on

    Mahesh Babu Daughter Sitara: టాలీవుడ్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు కి ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..యూత్ మరియు ఫామిలీ ఆడియన్స్ లో మహేష్ బాబు కి ఉన్న బ్రాండ్ ఇమేజి వేరు..మాములు యావరేజి టాక్ ఉన్న సినిమాలకి కూడా వంద కోట్ల రూపాయిల షేర్ ని రప్పించే సత్తా ప్రస్తుతం టాలీవుడ్ లో ఒక్క మహేష్ బాబు కి మాత్రమే ఉంది..ఇంత స్టార్ స్టేటస్ ఉన్నప్పటికీ కూడా తనతో పోటీ పడే తోటి స్టార్ హీరోల సినిమాలు విడుదలయ్యి మంచి హిట్ టాక్ ని తెచుకున్నప్పుడు వారిని మెచ్చుకోవడం లో ముందు ఉంటాడు మహేష్ బాబు..అంతే కాకుండా ఏ హీరో పుట్టిన రోజు వచ్చినా కూడా తన ట్విట్టర్ ఖాతా నుండి మిస్ కాకుండా శుభాకంక్షాలు తెలియచేసే ఏకైక హీరో మహేష్ బాబు మాత్రమే..అందుకే ఆయనని ప్రతి హీరో ఫ్యాన్ అభిమానిస్తూ ఉంటారు..ఆయనలాగానే ఆయన ఇంట్లో వారు కూడా కేవలం మహేష్ బాబు సినిమాలు మాత్రమే కాకుండా ఇతర హీరోల సినిమాలు కూడా చూస్తూ ఉంటారట.

    Mahesh Babu

    Also Read: AP Employees PF Money: ఆ లెక్క సరిచేసేందుకు ‘జీపీఎఫ్’ నగదు మాయం.. ఉద్యోగుల్లో కలవరం

    ఇక మహేష్ బాబు కుమార్తె సితార ఎంత క్యూట్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..ఈమె యూట్యూబ్ లో ఒక్క ఛానల్ కూడా రన్ చేస్తుంది..చిన్నవయస్సులోనే డాన్స్ మరియు సింగింగ్ లో సూపర్బ్ అనిపించుకున్న సితార..అమెరికన్ ఇంగ్లీష్ మాట్లాడడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది..అంతే కాకుండా ఇటీవల విడుదలైన మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమాలో ‘పెన్నీ పెన్నీ’ లిరికల్ వీడియో సాంగ్ లో కూడా సితార డాన్స్ ఇరగదీసింది..ఇవన్నీ పక్కన పెడితే సితార ప్రతి వారం విడుదలయ్యే టాలీవుడ్ , బాలీవుడ్ , కోలీవుడ్ అని తేడా ప్రతి సినిమాని చూస్తుందట..ఈమెకి టాలీవుడ్ లో మహేష్ బాబు తర్వాత బాగా నచ్చే హీరో విజయ్ దేవరకొండ అట..అంతే కాకుండా అల్లు అర్జున్ సినిమాలు కూడా బాగా చూస్తుందట..ఇక హీరోయిన్స్ లో సమంత అంటే బాగా ఇష్టమట..అంతే కాకున్నా తన బెస్ట్ ఫ్రెండ్స్ లిస్ట్ లో సమంత కచ్చితంగా ఉంటుందట..ఆమె తో కలిసి బయట షాపింగ్ చేసిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయట.

    Sitara

    Also Read: Chiranjeevi- Rao Ramesh: మెగాస్టార్ మాటలకు మెగా ఫ్యాన్స్ హ‌ర్ట్.. చిరు మారు

    Tags