Producer Dil Raju: ప్రముఖ నిర్మాత దిల్ రాజు మొదటి భార్య ‘అనిత’ హఠాత్తుగా మరణించడంతో.. లాక్ డౌన్ సమయంలో ఆయన రెండో పెళ్ళి చేసుకున్న సంగతి తెలిసిందే. తన కూతురు, పెద్దల సలహాతో తమ కుటుంబానికి ముందు నుంచీ పరిచయమున్న వైఘా రెడ్డి (తేజస్విని)ని దిల్ రాజు పెళ్ళి చేసుకున్నారు. తాజాగా ఈ దంపతులు పండంటి మగ బిడ్డకు జన్మని ఇచ్చారు.

దాంతో, దిల్ రాజు దంపతులకు ప్రేక్షకులు, సినీ ప్రముఖులు వరుసగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మాతృత్వంలో నిస్వార్ధ ప్రేమ ఉంటుందని.. ప్రస్తుతం వైఘా ఆ మధుర క్షణాలను ఆస్వాదిస్తోందని దిల్ రాజు చెప్పారు. దిల్ రాజు తన భార్య సుఖ ప్రసవం కోసం ముందు నుంచి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.
Also Read: Mahesh Babu Daughter Sitara: మహేష్ బాబు కూతురు సీతార కి ఇష్టమైన హీరో ఎవరో తెలుసా??
ముఖ్యంగా ప్రెగ్నెన్సీ వేళ ఎలాంటి ఎక్సర్ సైజ్ లు చేయాలో వాటిని తూచా తప్పకుండా వైఘా రెడ్డి చేత ఆయన చేయించారు. అందుకే, వైఘా రెడ్డికి సుఖ ప్రసవం జరిగింది. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుంది. మొత్తానికి మళ్లీ తండ్రి అయ్యి.. దిల్ రాజు మళ్ళీ వార్తల్లో నిలిచాడు. అసలు దిల్ రాజు సినీ ప్రయాణమే.. సినిమాటిక్ గా సాగింది.

సామాన్య డిస్ట్రిబ్యూటర్ గా మొదలైన దిల్ రాజు, నెంబర్ వన్ నిర్మాతగా టర్న్ అయి, ప్రస్తుతం థియేటర్లను కంట్రోల్ లో పెట్టుకుని ఇండస్ట్రీని ప్రభావితం చేసే స్థాయికి ఎదిగాడు. పైగా, భవిష్యత్తులో పోటీ వచ్చే స్కోప్ ఉన్న యువి, గీతా లాంటి సంస్థలను కూడా తనతోనే కలుపుకుని, మొత్తానికి పెద్ద సినిమాల రిలీజ్ డేట్స్ ను కూడా శాసించే స్థాయికి వచ్చాడు.
మరి తండ్రిగా మారిన ఈ స్టార్ నిర్మాతకు మా ఓకేతెలుగు తరపున ప్రత్యేక శుభాకాంక్షలు.
Also Read: Star Heroine: హీరోయిన్ నైట్ బిజినెస్ బంద్.. ఈమెవరో గురు పట్టగలరా ?
