Salaar Vs Dunki: డాంకి, సలార్ పోటీ వల్ల ఎవరికి నష్టం జరగబోతుందంటే..?

ప్రభాస్ తో పాటుగా షారుఖ్ ఖాన్ కూడా 21వ తేదీన డాంకి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో రచ్చ చేయడానికి రెడీ అవుతున్నాడు. అయితే ప్రభాస్ , షారుఖ్ ఖాన్ సినిమాల మధ్య పోటీ ఉండడంతో ఈ రెండు సినిమాలు ఒక్కరోజు గ్యాప్ లోనే థియేటర్లోకి వస్తున్నాయి.

Written By: Gopi, Updated On : December 5, 2023 11:23 am

Salaar Vs Dunki

Follow us on

Salaar Vs Dunki: డిసెంబర్ నెల మొత్తం సినిమా ప్రేక్షకులకు పండగ అనే చెప్పాలి. ఇప్పటికే అనిమల్ సినిమా ఒకటోవ తేదీన రిలీజ్ అయి ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్ళను రాబడుతుంది. ఇక ఈ క్రమంలో డిసెంబర్ 7వ తేదీన నాని హీరో గా వస్తున్న హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అలాగే 8వ తేదీన నితిన్ ఎక్స్ ట్రా ఆర్డినరీ మాన్ గా మన ముందుకు రాబోతున్నాడు. ఇక ఈ సినిమాల విషయం పక్కన పెడితే ముఖ్యంగా 22వ తేదీన సలార్ సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా రేంజ్ లో ప్రేక్షకులను పలకరించనున్నాడు.

ఇక ప్రభాస్ తో పాటుగా షారుఖ్ ఖాన్ కూడా 21వ తేదీన డాంకి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో రచ్చ చేయడానికి రెడీ అవుతున్నాడు. అయితే ప్రభాస్ , షారుఖ్ ఖాన్ సినిమాల మధ్య పోటీ ఉండడంతో ఈ రెండు సినిమాలు ఒక్కరోజు గ్యాప్ లోనే థియేటర్లోకి వస్తున్నాయి. ఇక వీటిని చూసిన అభిమానులు ఈ రెండు సినిమాల్లో ఏదో ఒక సినిమా ఒక వన్ వీక్ పోస్ట్ పోన్ చేసుకుంటే బాగుండేది అని వాళ్ల అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ రెండు సినిమాలు పెద్ద సినిమాలు కావడం వల్ల ఈ రెండు సినిమాలకి పాన్ ఇండియా రేంజ్ లో భారీ వసూళ్లు వస్తాయి, కానీ ఇలా ఒకేసారి ఈ సినిమాలు రావడం వల్ల సినిమాలు ఎంత సక్సెస్ అయిన కూడా ఈ రెండు సినిమాలు 50-50 కలెక్షన్స్ ని షేర్ చేసుకుంటాయి. ఇక ఈ రెండు సినిమాల్లో ఏ సినిమాకు అయితే సక్సెస్ టాక్ వస్తుందో ఆ సినిమా భారీ రేంజ్ లో సక్సెస్ అయితే సాధిస్తుంది.

ఇప్పుడు షారుక్, ప్రభాస్ లను పక్కన పెడితే ఇక డైరెక్టర్ల గురించి తెలుసుకున్నట్లయితే సలార్ సినిమా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అలాగే డాంకి సినిమా డైరెక్టర్ అయిన రాజ్ కుమార్ హిరానీ ఇద్దరు డైరెక్టర్లు కూడా తమదైన రీతిలో ఇంతకు ముందు బ్లాక్ బస్టర్లు హిట్స్ కొట్టి ప్రేక్షకులను మెప్పించిన వారు కావడం విశేషం…రాజ్ కుమార్ హిరానీ అయితే ఇప్పటివరకు ఆయన చేసిన అన్ని సినిమాలు వరుసగా బ్లాక్ బస్టర్ సక్సెస్ లను అందుకున్నాయి. ఇప్పుడు డాంకీ సినిమా మీద కూడా మంచి అంచనాలు ఉన్నాయి అయితే సలార్ సినిమాని డాంకీ సినిమా డామినేట్ చేస్తుందా..? లేదా డాంకి సినిమాని సలార్ డామినేట్ చేస్తుందా..? అనేది ఇప్పుడు తెలియాల్సిన విషయం…

ఈ రెండు సినిమాలు ఒకేసారి రావడం వల్ల ఏ సినిమా కి మైనస్ అయ్యే అవకాశం ఉంది అంటే రెండు సినిమాలకి మైనస్ అయ్యే అవకాశం ఉందనే చెప్పాలి.ఇక డిసెంబర్ ఒకటో తేదీన వచ్చిన అనిమల్ సినిమా ఏ పోటీ లేకుండా వచ్చి సక్సెస్ ని అందుకొని వసూళ్ల సునామీని సృష్టించడమే కాకుండా హిట్ మూవీగా నిలిచిపోయింది. అలా సోలోగా వస్తే సినిమాకి కొంచెం డివైడ్ టాక్ వచ్చిన కూడా ఆ సినిమాలనేవి లాంగ్ రన్ లో భారీ సక్సెస్ లు అందుకునే అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా పోటీతో వచ్చినప్పుడు ఒక సినిమా మిక్స్ డ్ టాక్ వచ్చిన వస్తే అవతల సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చిందంటే జనం మొత్తం ఆ సినిమాను చూడడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు.ఇక దానివల్ల మిక్స్ డ్ టాక్ వచ్చిన సినిమా లాంగ్ రన్ లో ప్లాప్ గా మిగిలిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి…మరి డాంకీ, సలార్ రెండు సినిమాల్లో ఏ సినిమా సక్సెస్ సాధిస్తుందో చూడాలి…