https://oktelugu.com/

Dasari Narayana Rao: దాసరి గారి శిష్యుల్లో ఆయనకు బాగా నచ్చిన వ్యక్తి ఎవరంటే..?

ఆయన దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన చాలామంది డైరెక్టర్లుగా మారారు. అందులో కోడి రామకృష్ణ ఒకరు...ఈయన కూడా వందకు పైగా సినిమాలను డైరెక్ట్ చేసి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు.

Written By:
  • Gopi
  • , Updated On : February 27, 2024 / 12:55 PM IST
    Follow us on

    Dasari Narayana Rao: సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవ్వరికీ సాధ్యం కానీ రీతిలో 150 సినిమాలకు దర్శకత్వం వహించిన ఒకే ఒక డైరెక్టర్ దాసరి నారాయణరావు… కంటెంట్ బేస్డ్ సినిమాలు చేయడంలో ఈయనను మించిన దర్శకుడు మరొకరు లేరు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. సీనియర్ ఎన్టీఆర్ (Sr NTR) దగ్గర నుంచి కొత్తగా వచ్చిన హీరోల దాకా అందరితో పనిచేసిన దర్శకుడిగా తనకు మంచి గుర్తింపు ఉంది. అలాగే ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో పనిలేదు మంచి కథ ఉంటే సరిపోతుంది. అని మొదటిసారి ఒక హీరోయిన్ అయిన విజయశాంతిని లీడ్ రోల్ లో పెట్టి ఆయన చేసిన ‘ఒసేయ్ రాములమ్మ‘ సినిమా ఇండస్ట్రీలో బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది…

    ఇక ఇదిలా ఉంటే ఆయన దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన చాలామంది డైరెక్టర్లుగా మారారు. అందులో కోడి రామకృష్ణ (Kodi Ramakrishna) ఒకరు…ఈయన కూడా వందకు పైగా సినిమాలను డైరెక్ట్ చేసి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ముఖ్యంగా అమ్మోరు సినిమాతో గ్రాఫిక్స్ ను తెలుగు తెరకు పరిచయం చేసిన మొట్టమొదటి దర్శకుడుగా ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. ఇక తన దగ్గర పని చేసిన శిష్యులందరిలో దాసరి నారాయణరావు కి కోడి రామకృష్ణ అంటే చాలా ఇష్టమట. సినిమాల పరంగా అయిన, వ్యక్తిత్వం పరంగా అయిన కూడా కోడి రామకృష్ణ గొప్ప మనిషి అని దాసరి గారు చాలా సందర్భాల్లో చెప్పారు. అలాగే తన తర్వాత ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లడంలో కోడి రామకృష్ణ కూడా తన సినిమాలతో చాలా కీలక పాత్ర వహించేవాడని చెప్పేవాడు…

    అందుకే కోడి రామకృష్ణ అంటే దాసరి గారికి అమితమైన ఇష్టమట. మొత్తానికైతే తన దగ్గర శిష్యరికం చేసిన కోడి రామకృష్ణ కూడా వందకు పైగా సినిమాలను డైరెక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇక కోడి రామకృష్ణ గారికి కూడా ఇష్టమైన డైరెక్టర్ ఎవరు అంటే దాసరి గారి పేరు చెప్తాడు. ఇలా ఈ గురు శిష్యుల మధ్య మంచి అనుబంధం ఉండేది. ప్రస్తుతం ఇద్దరు కూడా మన మధ్య లేకపోయినప్పటికీ మంచి సినిమాల గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారి వీళ్ళిద్దరి పేర్లు మాత్రం తప్పకుండా వినిపిస్తాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…