Homeఎంటర్టైన్మెంట్చిరంజీవి అనుచరుడు.. బన్నీనా ? విజయ్ నా ?

చిరంజీవి అనుచరుడు.. బన్నీనా ? విజయ్ నా ?

మలయాళంలో ‘లూసిఫర్’ సూపర్ హిట్ అవ్వడంతో.. ఆ సినిమా మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి దగ్గరకు వచ్చింది. అయితే మొదట ఈ సినిమాకి సుజీత్ దర్సకత్వం అన్నారు.. ఆ తరువాత దర్శకుడు వినాయక్ డైరెక్షన్ లో ఈ సినిమా రాబోతుంది అని ప్రకటన వచ్చింది. ఇక చిరు కోసం ఈ స్క్రిప్ట్ లో వినాయక్ కొన్ని మార్పులు చేశారు. ముఖ్యంగా క్యాస్టింగ్ విషయంలో కూడా భారీగానే ప్లాన్ చేశారట. మెయిన్ గా ఈ సినిమాలో మెగాస్టార్ అనుచరుడి పాత్ర […]


మలయాళంలో ‘లూసిఫర్’ సూపర్ హిట్ అవ్వడంతో.. ఆ సినిమా మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి దగ్గరకు వచ్చింది. అయితే మొదట ఈ సినిమాకి సుజీత్ దర్సకత్వం అన్నారు.. ఆ తరువాత దర్శకుడు వినాయక్ డైరెక్షన్ లో ఈ సినిమా రాబోతుంది అని ప్రకటన వచ్చింది. ఇక చిరు కోసం ఈ స్క్రిప్ట్ లో వినాయక్ కొన్ని మార్పులు చేశారు. ముఖ్యంగా క్యాస్టింగ్ విషయంలో కూడా భారీగానే ప్లాన్ చేశారట. మెయిన్ గా ఈ సినిమాలో మెగాస్టార్ అనుచరుడి పాత్ర కథా పరంగా చాల కీలకంగా ఉంటుంది. ఎందుకంటే సినిమాలో హీరో ఏమి చేయడు, ఏదైనా తన అసిస్టెంట్ చేతే చేయిస్తూ ఉంటాడు. అ రకంగా సెకెండ్ హీరో రేంజ్ క్యారెక్టర్ అది.

Also Read: సినిమాల కోసం మరో గ్లామరస్ యాంకర్.. !

అందుకే మొదట ఆ పాత్రలో అల్లు అర్జున్ నటించబోతున్నాడని సుజీత్ డైరెక్టర్ గా ఉన్న సమయంలోనే మెగాస్టార్ ఫిక్స్ అయ్యారు. బన్నీ కూడా మెగాస్టార్ అనుచరుడి పాత్ర చేయడానికి బాగా ఇంట్రస్ట్ గా కూడా ఉన్నాడని వార్తలు వచ్చాయి. పైగా ఆ పాత్రకు బన్నీ అయితేనే పర్ఫెక్ట్ అని మెగాఫ్యామిలీ సన్నిహితులు కూడా బాహాటంగానే స్పందించారు. అయితే మళ్ళీ ఆ తరువాత ఆ పాత్రలో బన్నీ చెయ్యట్లేదని.. తక్కువ నిడివి గల ఆ పాత్ర బన్నీ రేంజ్ కి సూట్ అవ్వదని చిరు ఫీల్ అయినట్లు వార్తలు వచ్చాయి. దాంతో ఆ అనుచరుడి పాత్రలో సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ కనిపించనున్నారని అప్పట్లో బాగా వినిపించింది.

Also Read: మెగాస్టార్ ‘లూసిఫర్’కి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ !

నిజానికి విజయ్ దేవరకొండ కూడా ఆ పాత్రలో బాగుంటాడు. ఎలాగూ విజయ్ కి యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి, విజయ్ నే బెస్ట్ అప్షన్ అవుతాడని మేకర్స్ అభిప్రాయపడుతునట్లు నమ్మశక్యంగా గత కొంతకాలంగా రూమర్స్ రావడంతో ప్రేక్షకులు కూడా ఇదే నిజం అనుకున్నారు. కానీ మళ్ళీ తాజాగా ఫిల్మ్ సర్కిల్స్ లో మెగాస్టార్ అనుచరుడి పాత్రలో బన్నీ కనిపించబోతున్నాడని టాక్ నడుస్తోంది. మరి ఇంతకీ చిరంజీవి అనుచరుడిగా బన్నీనా విజయ్ నా అనేది త్వరలో తేలనుంది. ఇక ఈ సినిమాలో హీరోకి చెల్లి పాత్ర అయిన మంజు వార్యర్ పాత్ర కూడా చాల కీలకమైనదే. కాగా తెలుగు వర్షన్ లో ఇప్పుడు ఆ పాత్రలో సుహాసిని నటించబోతుంది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper