Bigg Boss Telugu 8: బిగ్ బాస్ సీజన్ 8 క్లైమాక్స్ కి చేరుకుంది. మరో రెండు వారాల్లో ఈ సీజన్ ముగియబోతుంది. గత వారం హౌస్ నుండి యష్మీ ఎలిమినేట్ అవ్వగా, ఇప్పుడు హౌస్ లో గౌతమ్, ప్రేరణ, అవినాష్, విష్ణుప్రియ, టేస్టీ తేజ, రోహిణి, నిఖిల్, పృథ్వీ, నబీల్ మిగిలారు. వీరిలో ఇద్దరు ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి డబుల్ ఎలిమినేషన్ ద్వారా ఎలిమినేట్ అయ్యి బయటకి రాబోతున్నారు. సోషల్ మీడియా లో జరుగుతున్నా అనధికారిక పొలింగ్స్ ప్రకారం చూస్తే గౌతమ్, నిఖిల్ మధ్య ఓటింగ్ కనీవినీ ఎరుగని రేంజ్ లో జరుగుతుంది. వీళ్ళిద్దరిలో ఎవరు కచ్చితంగా టైటిల్ కొట్టబోతున్నారు అనేది చివరి వారం వరకు సస్పెన్స్. ఇలాంటి పరిస్థితి ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్ చరిత్రలో ఎప్పుడూ రాలేదు. విన్నర్ ఎవరో ఆరు వారాల తర్వాత ఆడియన్స్ కి స్పష్టంగా తెలిసిపోయేది. వైల్డ్ కార్డ్స్ రాకముందు నిఖిల్ క్లియర్ విన్నర్ గా అనిపించేవాడు.
అధికారిక ఓటింగ్స్ లో అతన్ని మించిన వాళ్ళు లేరు అనే విధంగా ఉండేది. కానీ ఎప్పుడైతే వైల్డ్ కార్డు కంటెస్టెంట్ గా గౌతమ్ హౌస్ లోపలకు వచ్చాడో సీన్ మొత్తం మారిపోయింది. నిఖిల్ ఓటింగ్ ని ఈ సీజన్ కంటెస్టెంట్స్ అందుకోవడం అసాధ్యం అని సోషల్ మీడియా లో చాలా మంది అనుకున్నారు. కానీ అతని ఓటింగ్ ని భారీ మార్జిన్ తో గౌతమ్ అధిగమిస్తాడని మాత్రం ఎవ్వరూ అనుకోలేదు. వీళ్లిద్దరి సంగతి కాసేపు పక్కన పెడితే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ద్వారా ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది ఆసక్తికరమైన అంశంగా నిలవబోతుంది. అందరూ పృథ్వీ, అవినాష్, టేస్టీ తేజ లలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారని అనుకున్నారు. కానీ అధికారిక ఓటింగ్స్ ప్రకారం ఈ ముగ్గురు సేఫ్ జోన్ లోనే ఉన్నారట. ప్రేరణ మూడవ స్థానంలో ఉండగా, నాల్గవ స్థానంలో పృథ్వీ, 5 వ స్థానం లో అవినాష్, ఆరవ స్థానంలో టేస్టీ తేజా ఉన్నారట.
ఇక చివరి రెండు స్థానాల్లో నబీల్, విష్ణు ప్రియ ఉన్నారట. నబీల్ డేంజర్ జోన్ లోకి రావడం ఏమిటి అని ఆశ్చర్యపోతున్నారు కదూ..కానీ ఆశ్చర్యపోండి, ఎందుకంటే అదే నిజం కాబట్టి. వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ ఇచ్చాక నబీల్ లో అంతకు ముందు ఉన్నటువంటి ఫైర్, ఆట అసలు కనిపించడం లేదు. ప్రేరణ తో కూర్చొని అవతల కంటెస్టెంట్స్ మీద ఏడవడం తప్ప, ఆయన ఈమధ్య కాలంలో చేసిందేమి లేదు. ఈ వారం కూడా ‘టికెట్ టు ఫినాలే’ టాస్కులలో బాగా ఆడలేదు. దీంతో నబీల్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేంత కంటెంట్ ఇప్పటి వరకు ఇవ్వకపోవడం తో అతని గ్రాఫ్ పాతాళలోకం లోకి పడిపోయింది. గత వారం కూడా ఈయన డేంజర్ జోన్ లో ఉన్నాడట. బాటమ్ 2 లో ఉన్నటువంటి పృథ్వీ, యష్మీల కంటే ఒక అడుగు ముందు ఉన్నాడు అంతే. ఈ వారం నబీల్, విష్ణు ప్రియ ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ఏమి జరగబోతుందో చూడాలి.