Bigg Boss Telugu 8: నిఖిల్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టకముందే ఆడియన్స్ కి బాగా సుపరిచితం అనే విషయం మన అందరికీ తెలిసిందే. టీవీ సీరియల్స్ ద్వారా ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయిన నిఖిల్, స్టార్ మా ఛానల్ లో నిర్వహించే ఈవెంట్స్ ద్వారా కూడా మంచి పాపులారిటీ ని సంపాదించుకున్నాడు. మరోపక్క యూట్యూబ్ , ఇంస్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా నిఖిల్ యూత్ ఆడియన్స్ తో కూడా మంచి కనెక్ష పెంచుకున్నాడు. నిఖిల్ వ్యక్తిగత వ్యవహారాలు కూడా అందరికీ తెలుసు. ఆయన ప్రముఖ టీవీ సీరియల్ హీరోయిన్ కావ్య తో చాలా కాలం నుండి డేటింగ్ ప్రేమాయణం నడుపుతూ, డేటింగ్ చేస్తున్నాడు. కానీ వీళ్లిద్దరి మధ్య ఏర్పడిన కొన్ని విబేధాల కారణంగా విడిపోవాల్సి వచ్చింది. వీళ్ళు విడిపోయిన విషయం కూడా ప్రేక్షకులకు బాగా తెలుసు. బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టే ముందు కూడా నిఖిల్ తాను సింగిల్ అని చెప్పి వెళ్తాడు.
ప్రస్తుతానికి అతని స్టేటస్ సింగిల్ అని చెప్పాడు కాబట్టే, సీత ఇతన్ని మొదట్లో ఇష్టపడింది. ఆ తర్వాత తన గేమ్ ఎక్కడో గాడి తప్పుతుంది అనే విషయాన్ని గమనించి ఆమె నిఖిల్ తో దూరంగా ఉండడం ప్రారంభించింది. ఆమె తర్వాత సోనియా నిఖిల్ తో చాలా క్లోజ్ గా ఉండడం మొదలు పెట్టింది, నిఖిల్ ని కంట్రోల్ చేస్తుంది అని అందరూ అనుకున్నారు కానీ, సోనియా అతన్ని కేవలం తన సోదరుడిగా మాత్రమే చూసిందని ఆమె బయటకి వచ్చిన తర్వాత చెప్పుకుంది. కానీ యష్మీ మాత్రం నిఖిల్ తో పూర్తిగా ప్రేమలో మునిగిపోయింది. నిఖిల్ నాకు ఆసక్తి లేదు అని చెప్తూనే, యష్మీ కి డివైడ్ సిగ్నల్స్ ఇచ్చేవాడు. దీంతో యష్మీ నిఖిల్ ని ఒక రేంజ్ లో ఇష్టపడింది. దీంతో ఆమె గేమ్ పూర్తిగా గాడి తప్పింది, తన కోసం కాకుండా నిఖిల్ కోసం ఆడే పరిస్థితులు వచ్చాయి.
చివరికి ఆమె తండ్రి కూడా కేవలం నీకోసం మాత్రమే గేమ్ ఆడు, అప్పుడే ఫైనల్స్ వరకు వస్తావు, టైటిల్ గెలుస్తావు అని చెప్తాడు. ఇది మనసులో పెట్టుకొని యష్మీ చివరి వారంలో తనకోసం మాత్రమే ఆడింది. కానీ అప్పటికే ఆమెకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది, ఓట్లు పడలేదు, ఎలిమినేట్ అయ్యింది. ఇదంతా పక్కన పెడితే నిఖిల్ రెండు వారాల క్రితం శుక్రవారం ఎపిసోడ్ లో కావ్య ఇంకా తన మనసులో ఉందని, బయటకి వెళ్లిన తర్వాత ఆమె కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడి అయినా ఆమెతో ప్యాచప్ చేసుకుంటానని చెప్తాడు. ఈ విషయం యష్మీ కి కూడా అప్పుడే తెలుస్తుంది. ఇదేదో నిఖిల్ ముందే ఆమెకు క్లారిటీ గా చెప్పి ఉంటే ఈరోజు ఆమె ఎలిమినేట్ అయ్యే పరిస్థితి వచ్చేది కాదు. నిన్న పునర్నవి కూడా ఈ విషయం లో నిఖిల్ నుండి క్లారిటీ కోరుతుంది. అప్పుడు ఆయన మాట్లాడుతూ కాస్త ఎమోషనల్ అవుతాడు కానీ, యష్మీ విషయంలో మాత్రం ఆయన తప్పు చేసాడు అనే అభిప్రాయం మాత్రం ఈ మాటలను చూసిన తర్వాత కూడా ఆడియన్స్ అభిప్రాయం మారదు.