Bharani and Thanuja: ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంటే వయస్సు రీత్యా దృష్టిలో పెట్టుకొని అమ్మా, అక్క, అన్న, తమ్ముడు అని పిలవడం మనమంతా చూసాము. కానీ ఎక్కడైనా నాన్న అని పిలవడం చూసారా?, అది కూడా ఒక అమ్మాయి, అబ్బాయిని పిలవడం ఇంతకు ముందు ఎక్కడైనా చూశామా?, లేదు కదా?, కేవలం ఈ బిగ్ బాస్ సీజన్(Bigg Boss 9 Telugu) లోనే ఇలాంటి విచిత్రమైన బంధాన్ని చూసాము. తనూజ, భరణి ని నాన్న అని సీజన్ లో పిలిచినంతగా, నిజ జీవితంలో ఆమె నాన్న ని కూడా పిలిచి ఉండదేమో, భరణి గారి పిల్లలు భరణి గారిని కూడా అన్ని సార్లు నాన్న అని పిలిచి ఉండరేమో అంటూ సోషల్ మీడియా లో రివ్యూయర్స్ సైతం సెటైర్ల వర్షం కురిపించారు. కానీ వీళ్ళ మధ్య నిజంగానే అలాంటి ఆప్యాయత మొదట్లో కనిపించడం తో ఆడియన్స్ కూడా వీళ్ళ బంధాన్ని స్వాగతించారు.
అయితే ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే వీళ్లిద్దరి మధ్య వయస్సు తేడా చాలా తక్కువ అని సోషల్ మీడియా లో ప్రచారం సాగుతోంది. అప్పట్లో యాంకర్ ప్రదీప్ హోస్ట్ గా వ్యవహరించిన ‘కొంచెం టచ్ లో ఉంటే చెప్తా’ కార్యక్రమానికి తనూజ, పవన్ సాయి(ముద్ద మందారం హీరో) ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఇక్కడ ప్రదీప్ అడిగిన కొన్ని ప్రశ్నల్లో ఒకటి తనూజ వయస్సు ఎంత ఎంత అని. అందుకు పవన్ సాయి ఆమె ‘1983 వ సంవత్సరం లో పుట్టింది’ అంటూ చెప్పుకొచ్చాడు. అంటే ఆమె వయస్సు దాదాపుగా 40 సంవత్సరాలు వరకు ఉంటుంది. భరణి వయస్సు దాదాపుగా 43 ఏళ్ళు ఉంటుంది. ఇద్దరి మధ్య కేవలం మూడేళ్ళ తేడా ఉండడం, అయినప్పటికీ వీళ్ళు తండ్రి కూతుళ్లు అని పిలుచుకోవడం వంటివి చూస్తుంటే వీళ్లది నిజమైన రిలేషన్ నా?, లేదంటే కంటెంట్ కోసం చేశారా అనేది తెలియాల్సి ఉంది.
అయితే పవన్ సాయి ఆరోజు ఊరికే సరదాగా ఆట పట్టించేందుకు తనూజ వయస్సు ని మార్చి చెప్పాడని, ఆమె 1992 వ సంవత్సరం లో పుట్టిందని మరికొంతమంది అంటున్నారు. ఇందులో ఏది నిజం, ఏది అబద్దం అనేది ఎవరికీ తెలియదు, స్వయంగా తనూజ చెప్తే తప్ప. ఇకపోతే భరణి రీ ఎంట్రీ తర్వాత ఈమె ఆయన్ని నాన్న అని పిలవడం పూర్తిగా మానేసింది. రీ ఎంట్రీ ఇచ్చిన మొదటి వారం లో నాన్న అని పిలుస్తూ తిరిగేది కానీ, ఎప్పుడైతే భరణి కెప్టెన్సీ కంటెండర్ షిప్ లో తనూజ కి సపోర్ట్ చేయలేదో, అప్పటి నుండి ఆమె నాన్న అని పిలవడం పూర్తిగా మానేసింది. ఆరోజు నుండి ఇప్పటి వరకు ఆయనతో మాట్లాడట్లేదు. గత వారం భరణి పై నామినేషన్స్ వేయడం, అంతే కాకుండా ఆయన ఎలిమినేషన్ జోన్ లోకి వచ్చి, నాకోసం సేవింగ్ పవర్ ఉపయోగిస్తావా అని అడిగినప్పుడు అలోచించి చెప్తా అనడం వంటివి చూసి ఆడియన్స్ షాక్ కి గురయ్యారు. అంటే ఇన్ని రోజులు వీళ్ళ రిలేషన్ ని నమ్మిన వాళ్ళు బకరాలు అయినట్టా అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.