Mani Sharma: మణిశర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈయన మ్యూజిక్ కు అభిమానులు ఉంటారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్వర బ్రహ్మగా పేరు సంపాదించారు. ప్రేమించుకుందాం రా, చూడాలని ఉంది, సమరసింహా రెడ్డి వంటి సినిమాలకు అద్భుతమైన మ్యూజిక్ అందించి మెలోడీ బ్రహ్మగా కూడా పేరు సంపాదించారు. మ్యూజిక్ తో మెస్మరైజ్ చేస్తూ తన సత్తా చాటాడు మణిశర్మ. రీసెంట్ గా ఇస్మార్ట్ శంకర్ సినిమాలో అదిరిపోయే సంగీతం అందించి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అద్భుతమైన సంగీతం అందించగలనని నిరూపించుకున్నారు.
2004లో డబుల్ ఇస్మార్ట్, కన్నప్ప సినిమాలకు సంగీతం అందిస్తున్నారు. అయితే తమన్, దేవి శ్రీ ప్రసాద్ కు వచ్చినన్ని సినిమా ఆఫర్లు మాత్రం మణిశర్మకు రావడం లేదు. అందుకే ఛాన్స్ ల కోసం ఈయన చాలా మంది స్టార్లను అడిగారని టాక్. అయితే తమన్, దేవి శ్రీ ల కంటే మణిశర్మ ప్రతిభావంతుడు అని అంటుంటారు ఆయన అభిమానులు. ఈయన వద్దనే శిష్యరికం చేసి నేడు ఆయనకే ఛాన్సులు రాకుండా ఇండస్ట్రీని ఏలేస్తున్నారని కూడా విమర్శిస్తుంటారు కొందరు. ఇదిలా ఉంటే తమన్ ఇతర మ్యూజిక్ డైరెక్టర్ల ట్యూన్స్ కాపీ కొట్టి మరీ హిట్స్ కొడుతారని విమర్శిస్తుంటారు కొందరు.
తమన్ గురించి ఎన్ని విమర్శలు వస్తున్నా ఆయనకే ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారని.. వీరికి బదులు మణిశర్మను సెలెక్ట్ చేసుకుంటే మరింత హిట్ అయ్యే అవకాశం ఉంటుందని సలహాలు కూడా ఇస్తుంటారు మణి అభిమానులు. చిరంజీవి ఆచార్య సినిమాకు మణిశర్మ సంగీతాన్నే ఎంచుకున్నారు. కానీ మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ వంటి స్టార్లు ఇప్పటికీ మణిశర్మకు ఛాన్స్ ఇవ్వడం లేదు. ఒకప్పుడు వీరందరికి మ్యూజికల్ హిట్స్ ఇచ్చింది మణిశర్మనే. కానీ ఇప్పుడు ఆయనకే ఛాన్స్ ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.
మణిశర్మకు టాలీవుడ్ లో తప్ప ఇతర ఇండస్ట్రీలతో పెద్దగా పరిచయాలు లేవు. ఇతర భాషా సినిమాలకు మ్యూజిక్ అందించలేదు. అందువల్ల కేవలం టాలీవుడ్ పైన మాత్రమే ఆధారపడాల్సి వస్తోంది. ఒక్క స్టార్ హీరో ఈ మ్యూజిక్ డైరెక్టర్ కు ఛాన్స్ అందిస్తే తన టాలెంట్ నిరూపించుకుంటారు. అంతేకాదు సూపర్ హిట్ ను సంపాదించి పాన్ ఇండియా లెవల్ లో పేరు సంపాదించే సత్తా కూడా కలదు. మరి ఇప్పుడైనా ఎవరైనా అవకాశం ఇస్తారో లేదో చూడాలి.