Tollywood Directors: మన ఇండస్ట్రీలో హీరోలు చేసినంత ఫాస్ట్ గా దర్శకులు సినిమాలు చేయలేరు. హీరోలు ఏడాదికి ఒకొక్కరు రెండు మూడు సినిమాలు చేసే వారు కూడా ఉన్నారు. కానీ దర్శకులు అలా కాదు.. ఏడాదికి ఒక్క సినిమా చేయడం కూడా కష్టమే.. సూపర్ హిట్ అందుకున్న దర్శకులు కూడా 2021 ఏడాది మొత్తం కనిపించలేదు. 2021లో సగం కరోనా మింగేస్తే.. మిగతా సగం కూడా దర్శకులు వాడుకోలేక పోయాడు. ఒకరో ఇద్దరు మాత్రమే తమ సినిమాలను విడుదల చేయగలిగారు. ఈ ఏడాది దాదాపు 10 కంటే ఎక్కవ మంది దర్శకులే కనిపించలేదు.. ఒక్క సినిమా కూడా రిలీజ్ చెయ్యలేదు. ఆ దర్శకులు ఎవరో తెలుసుకుందాం..

కొరటాల శివ.. కొరటాల చివరిగా భరత్ అనే నేను 2018లో విడుదల చేసాడు.. మళ్ళీ ఇప్పుడు ఆచార్య సినిమా 2022, ఫిబ్రవరి 4న రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నాడు.
రాజమౌళి.. ఈయన బాహుబలి సినిమాను 2017లో చివరిగా రిలీజ్ చేసాడు. ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ సినిమాతో 2022, జనవరి 7న రిలీజ్ చేయబోతునాన్రు.
అనిల్ రావిపూడి.. సరిలేరు నీకెవ్వరూ సినిమా 2020లో రిలీజ్ చేసాడు.. ఇప్పుడు ఎఫ్ 3 సినిమాను 2022, ఎప్రిల్ 29న రిలీజ్ చేయబోతున్నాడు.
త్రివిక్రమ్ శ్రీనివాస్.. అల వైకుంఠపురములో సినిమా 2020లో రిలీజ్ చేయగా ఇప్పుడు మహేష్ తో సినిమా చేస్తున్నాడు.
పూరీ జగన్నాథ్.. ఈయన ఇస్మార్ట్ శంకర్ 2019 లో రిలీజ్ అవ్వగా మళ్ళీ ఇప్పుడు విజయ్ దేవరకొండతో లైగర్ సినిమా చేస్తున్నాడు.
సురేందర్ రెడ్డి.. ఈయన సైరా సినిమా 2019లో రిలీజ్ అవ్వగా ఇప్పుడు అఖిల్ తో ఏజెంట్ సినిమా చేస్తున్నాడు.
తరుణ్ భాస్కర్.. తరుణ్ ఈ నగరానికి ఏమైంది సినిమానౌ 2018లో రిలీజ్ చేయగా ఇప్పుడు వెంకటేష్ తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.
సందీప్ వంగ.. ఈయన చేసిన కబీర్ సింగ్ 2020లో రిలీజ్ అవ్వగా ఇప్పుడు ప్రభాస్ తో స్పిరిట్ చేస్తున్నాడు.
నాగ్ అశ్విన్.. మహానటి 2018లో రిలీజ్ అవ్వగా ప్రభాస్ తో ప్రాజెక్ట్ కే చేస్తున్నాడు.
Also Read: RRR: దేశంలోనే అతిపెద్ద మూవీ ఆర్ఆర్ఆర్ విడుదలపై ఉత్కంఠ.. ఒమిక్రాన్ పెరిగితే పే ఫర్ వ్యూ ఇన్ ఓటీటీ.?
వంశీ పైడిపల్లి.. ఈయన చేసిన మహర్షి 2019లో రిలీజ్ అవ్వగా ఇప్పుడు తమిళ స్టార్ విజయ్ తో చేస్తున్నాడు.
పరశురామ్.. ఈయన గీత గోవిందం 2018లో రిలీజ్ అవ్వగా, ప్రెసెంట్ సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు.
హరీష్ శంకర్.. ఈయన చేసిన గద్దల కొండా గణేష్ 2019లో రిలీజ్ అవ్వగా ప్రెసెంట్ భవదీయుడు భగత్ సింగ్ చేయబోతున్నాడు.
Also Read: Dil Raju Photoshoot: రెండో భార్యతో దిల్ రాజు ఫొటో షూట్.. వైరల్