https://oktelugu.com/

Bigg Boss 5 Telugu: డేంజర్ జోన్లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరంటే…

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ అంటేనే ఒక పజిల్ లాంటి గేమ్. ఎన్నో ఎత్తుగడలు వేస్తేనే నెగ్గుతారు. మరి ఇలాంటి గేమ్ లో అవసరమయిన చోట బుద్ది బలం తో పాటు బాహుబలం కూడా ప్రదర్శించాలి. అప్పుడే విజయ తీరాలకు చేరుకోవడానికి మార్గం సుగమం అవుతుంది. ఈ క్రమంలో బిగ్ బాస్ హౌస్ పదకొండో వారానికి సంబంధించిన ఎలిమినేషన్ దుమారమే రేపుతోంది. ఎందుకంటే ఇప్పటికే బిగ్ బాస్ నుండి పది మంది కంటెస్టెంట్లు (సరయు, […]

Written By:
  • NVN Ravali
  • , Updated On : November 18, 2021 / 11:56 PM IST
    Follow us on

    Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ అంటేనే ఒక పజిల్ లాంటి గేమ్. ఎన్నో ఎత్తుగడలు వేస్తేనే నెగ్గుతారు. మరి ఇలాంటి గేమ్ లో అవసరమయిన చోట బుద్ది బలం తో పాటు బాహుబలం కూడా ప్రదర్శించాలి. అప్పుడే విజయ తీరాలకు చేరుకోవడానికి మార్గం సుగమం అవుతుంది.

    ఈ క్రమంలో బిగ్ బాస్ హౌస్ పదకొండో వారానికి సంబంధించిన ఎలిమినేషన్ దుమారమే రేపుతోంది. ఎందుకంటే ఇప్పటికే బిగ్ బాస్ నుండి పది మంది కంటెస్టెంట్లు (సరయు, ఉమాదేవి, లహరి షారి, నటరాజ్ మాస్టర్, హమీదా, శ్వేతా వర్మ, ప్రియా, లోబో, విశ్వ, జెస్సీ ) ఎలిమినేట్ అయ్యారు. మరి పదకొండో వారానికి సంబంధించిన ఎలిమినేషన్ ప్రక్రియ సోషల్ మీడియాలో పెద్ద రచ్చే లేపుతుంది. ఎందుకంటే కెప్టెన్ రవి మినహాయించి మిగతా హౌస్ మేట్స్ అందరూ షన్ను, సన్నీ, మానస్, కాజల్, సిరి, ప్రియాంకా సింగ్, శ్రీరామచంద్ర, అని మాస్టర్ నామినేట్ అయ్యారు.

    మరి ఈ వారం ఎవరు నామినేట్ అవుతారనే విషయం చాలా ఆసక్తికి గురిచేస్తుంది. ఎందుకంటే కాజల్, ప్రియాంక సింగ్, అని మాస్టర్ ముగ్గురికి ఎలిమినేషన్ ప్రమాదం పొంచి ఉన్నది. ఈ ముగ్గురిలో ఏ ఒక్కరు అయినా నామినేషన్ లోకి వస్తారా.. అని ప్రేక్షకులు కోటి కళ్ళతో ఎదురు చూసారు. కానీ, ఇప్పుడు ఆ ముగ్గురు కంటెస్టెంట్స్ నామినేషన్లోనే ఉన్నారు. ఇంక ఉందిఎవరిని ఉంచుతారు.. ఎవరిని ఎలిమినేట్ చేస్తారు అన్న విషయం ప్రేక్షకుల మీదే ఆధారపడి. ఎక్కువగా ప్రియాంక సింగ్, కాజల్, అని మాస్టర్ కే ఎక్కువ ఎలిమినేషన్ ప్రమాదం పొంచి ఉన్నది. మరి ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయం తెలుసుకోవాలంటే ఆదివారం వరకు ఎదురు చూడాల్సిందే.

    Tags