Raja Saab 3 Days Collections: రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాజా సాబ్’ చిత్రానికి ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ మొదటి మూడు రోజులు ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ స్థాయి వసూళ్లను నమోదు చేసుకుంది. ట్రేడ్ విశ్లేషకులు అందిస్తున్న లెక్కల ప్రకారం ఈ చిత్రానికి మొదటి వీకెండ్ లో 158 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇది ప్రభాస్ గత చిత్రం ‘కల్కి 2898 AD’ మొదటి రోజు వసూళ్ల కంటే తక్కువ. కానీ ఫ్లాప్ టాక్ తో ఈ చిత్రం ఇంత దూరం రావడమే ఎక్కువ , అది కేవలం ప్రభాస్ క్రేజ్ కారణంగానే జరిగిందని అంటున్నారు. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే, ఈ చిత్రానికి వచ్చిన రెండవ రోజు వసూళ్లు, గత ఏడాది భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ రెండవ రోజు వసూళ్ల కంటే ఎక్కువ వచ్చాయి.
ఓవరాల్ గా మొదటి మూడు రోజులు ఈ చిత్రానికి ప్రాంతాల వారీగా వచ్చిన వసూళ్లు, అదే విధంగా రాబోయే రోజుల్లో ఈ సినిమా ఎంత వసూళ్లను రాబడితే బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకుంటుంది అనేది చూద్దాం. నైజాం ప్రాంతం లో ఈ చిత్రానికి జరిగిన ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 48 కోట్ల రూపాయలకు జరిగింది. మొదటి మూడు రోజులకు కలిపి ఈ చిత్రానికి వచ్చిన వసూళ్లు కేవలం 19 కోట్ల రూపాయిలు మాత్రమే. రెండవ రోజు ఈ ప్రాంతం లో మంచి వసూళ్లను రాబట్టింది కానీ, మూడవ రోజు భారీ గా డ్రాప్స్ ని సొంతం చేసుకుంది. ఓవరాల్ గా ఈ చిత్రం క్లోజింగ్ కి మరో 5 కోట్లు మాత్రమే రాబట్టే అవకాశాలు ఉన్నాయి. అంటే బయ్యర్ కి 20 కోట్ల నష్టం రాబోతుంది అన్నమాట. ఇక మిగిలిన ప్రాంతాల విషయానికి వస్తే సీడెడ్ ప్రాంతం నుండి 8 కోట్ల 60 లక్షలు, ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి 8 కోట్ల 16 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది.
అదే విధంగా తూర్పు గోదావరి జిల్లా నుండి 6 కోట్ల 48 లక్షలు, పశ్చిమ గోదావరి నుండి 4 కోట్ల 60 లక్షలు , గుంటూరు జిల్లా నుండి 4 కోట్ల 48 లక్షలు, కృష్ణ జిల్లా నుండి 4 కోట్ల 47 లక్షలు, నెల్లూరు జిల్లా నుండి 2 కోట్ల 70 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఈ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో మొదటి మూడు రోజులకు కలిపి 58 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా కర్ణాటక నుండి 7 కోట్ల 15 లక్షలు, తమిళ నాడు + కేరళ నుండి కోటి 15 లక్షలు, హిందీ + రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 8 కోట్ల 90 లక్షలు, ఓవర్సీస్ నుండి 16 కోట్ల 30 లక్షలు వచ్చాయి. ఓవరాల్ గా 92 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు, 158 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ కి మరో వంద కోట్ల గ్రాస్ రావాలి.