https://oktelugu.com/

Bigg Boss Telugu OTT Contestants: బిగ్ బాస్ ఓటీటీ కంటెస్టెంట్లు ఎవరు ? వాళ్ళు ఎలా ఎంట్రీ ఇచ్చారు ?

Bigg Boss Telugu OTT Contestants: బిగ్‌ బాస్ కొత్త ఫార్మాట్ గ్రాండ్‌ గా లాంచ్ అయ్యాడు. నాన్ స్టాప్ ఓటీటీ షోగా ఈ సారి బిగ్‌బాస్ అభిమానులను భారీ అంచనాలతో అలరించబోతున్నాడు. ప్రారంభ వేడుకలో హోస్ట్ గా నాగార్జున ఎంట్రీ ఇచ్చి కంటెస్టెంట్లను పరిచయం చేశారు. దాదాపు 18 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. ఆ కంటెస్టెంట్లు ఎవరో చూద్దాం. ఫస్ట్ కంటెస్టెంట్ : అశు రెడ్డి బిగ్‌ బాస్ తెలుగు నాన్ స్టాప్ షోలోకి తొలి […]

Written By:
  • Shiva
  • , Updated On : February 27, 2022 / 10:01 AM IST
    Follow us on

    Bigg Boss Telugu OTT Contestants: బిగ్‌ బాస్ కొత్త ఫార్మాట్ గ్రాండ్‌ గా లాంచ్ అయ్యాడు. నాన్ స్టాప్ ఓటీటీ షోగా ఈ సారి బిగ్‌బాస్ అభిమానులను భారీ అంచనాలతో అలరించబోతున్నాడు. ప్రారంభ వేడుకలో హోస్ట్ గా నాగార్జున ఎంట్రీ ఇచ్చి కంటెస్టెంట్లను పరిచయం చేశారు. దాదాపు 18 మంది కంటెస్టెంట్లు పాల్గొన్నారు. ఆ కంటెస్టెంట్లు ఎవరో చూద్దాం.

    ఫస్ట్ కంటెస్టెంట్ : అశు రెడ్డి

    బిగ్‌ బాస్ తెలుగు నాన్ స్టాప్ షోలోకి తొలి కంటెస్టెంట్‌ గా అడుగు పెట్టింది అశురెడ్డి. ఆమె గ్రాండ్‌ గా వేదికపైకి ఎంట్రీ ఇచ్చి.. నాగార్జున బుగ్గ పై ముద్దు పెట్టి షాక్ ఇచ్చింది. ఆ తర్వాత పిచ్చెక్కిస్తా అంటూ ఇంటిలోకి అడుగుపెట్టింది.

    Ashu Reddy

    సెకండ్ కంటెస్టెంట్ : మహేష్ విట్టా

    కమెడియన్, యాక్టర్ మహేష్ విట్టా వేదికపైకి అడుగుపెట్టి.. బిగ్‌బాస్ అనేది పెదనాన్న ఇల్లు అంటూ కామెంట్ చేశాడు. ఈ సారి నేను కప్ పట్టుకొని బయటకు వస్తాను అంటూ లోపలకి వెళ్ళాడు మహేష్ విట్టా.

    Mahesh Vitta

    మూడో కంటెస్టెంట్ : ముమైత్ ఖాన్

    బిగ్‌ బాస్ తెలుగు సీజన్ 1లో పాల్గొన్న ముమైత్ ఖాన్ తాజాగా మళ్లీ అడుగుపెట్టింది. ఈ సారి గెలిచేందుకు ప్రయత్నిస్తాను అంటూ ముమైత్ ఇంట్లోకి వెళ్ళింది.

    Mumaith Khan

    నాలుగో కంటెస్టెంట్‌ : అజయ్ కుమార్ కథ్వురార్

    బిగ్‌ బాస్‌ లోకి ఛాలెంజర్స్ టీమ్‌ నుంచి అజయ్ కుమార్ కథుర్వార్ ఎంట్రీ ఇచ్చి.. తాను రెండు మూడు సినిమాల్లో నటించాను అంటూ తన గురించి నాలుగు ముక్కలు చెప్పాడు. ఇక సినిమాను స్వయంగా రాసుకొని డైరెక్ట్ చేస్తున్నాను అంటూ మరో బిల్డప్ మాట పలికాడు. మరి హౌస్ లో ఇక ఎన్ని చెబుతాడో చూడాలి.

    Ajay

    ఐదో కంటెస్టెంట్‌ : స్రవంతి చొక్కారపు..

    ఐదో కంటెస్టెంట్‌గా యాంకర్ స్రవంతి చొక్కారపు వేదికపైకి అడుగుపెట్టి.. తనకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది అని తాను సోషల్ మీడియా ఇన్‌ఫ్యూయెన్సర్ అంటూ తెలిపింది. సోషల్ మీడియాలో మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏమిటి ? అని నాగ్ అడిగితే.. ‘నా స్మైల్ గురించి చాలా మంది చెబుతారు’ అంటూ చిన్న స్మైల్ ఇచ్చింది.

    Anchor Sravanthi

    Also Read: సీపీఐ నారాయణను చెప్పుతో కొడుతానన్న తమన్నా.. హాట్ కామెంట్స్ వైరల్

    ఇక ఆరో కంటెస్టెంట్‌ : ఆర్జే చైతూ..

    బిగ్‌ బాస్ తెలుగు నాన్‌ స్టాప్‌లోకి ఆరో కంటెస్టెంట్‌ గా రేడియో జాకీ ఆర్జే చైతూ అడుగు పెట్టి బాగానే హడావుడి చేశాడు. బిగ్ బాస్ హౌస్ లో వెయిట్ తగ్గేందుకు తాను ప్రయత్నిస్తాను అంటూ ఇతగాడు చెప్పుకొచ్చాడు. ఇక చైతుకు పిజా తినిపించి మరి నాగార్జున అతన్ని లోపలికి పంపించాడు.

    RJ Chaitu

    Also Read: పవన్‌ పై కక్ష సాధిస్తుంటే.. ఏ హీరో నోరు మెదపడం లేదు – నాగబాబు

    ఏడో కంటెస్టెంట్‌ : అరియానా గ్లోరి

    బిగ్‌ బాస్ నాన్ స్టాప్‌లోకి కూడా అరియానా గ్లోరి అడుగుపెట్టి.. నా పేరులోని గ్లోరి నా జీవితంలోకి వచ్చింది అంటూ తెగ సంబరపడిపోయింది. ఇక బిగ్‌ బాస్ నన్ను వదలడం లేదు అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇక ఈ షోలో కూడా తాను బోల్డ్ అండ్ డేరింగ్‌గా ఉంటాను అంటూ చెప్పుకొచ్చింది.

    Ariyana Glory

    ఎనిమిదో కంటెస్టెంట్‌ : నటరాజ్ మాస్టర్ :

    నటరాజ్ మాస్టర్ కూడా మరోసారి బిగ్‌బాస్ నాన్ స్టాప్‌లోకి ఎనిమిదో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టి.. గతంలో నా భార్య కోసం బిగ్‌ బాస్‌ కు వచ్చాను. ఇప్పుడు నా పాప కోసం వచ్చాను అంటూ మాస్టర్ రొటీన్ ముచ్చట్లు చెప్పాడు.

    Nataraj Master

    తొమ్మిదో కంటెస్టెంట్‌ : శ్రీ రాపాక

    రాంగోపాల్ వర్మ పరిచయం చేసిన ఈ శృంగార తార తొమ్మిదో కంటెస్టెంట్‌ గా హౌస్ లోకి అడుగుపెట్టింది. ఇక శ్రీ రాపాక తాను ఫ్యాషన్ డిజైనర్‌ ను అని, అయితే అనుకోకుండా నటిని అయ్యాను అని, తాను గోదావరి జిల్లాకు చెందిన అమ్మాయిని అని, ఈ విధంగా బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టాను అంటూ శ్రీ రాపాక తన గురించి వివరంగా వివరించింది. ఇక రేసు గుర్రం అనే హ్యాష్ ట్యాగ్‌ ను బోర్డుపై పెట్టి హౌస్ లోకి వెళ్ళింది.

    Sree Rapaka

    పదో కంటెస్టెంట్‌ : అనిల్ రాథోడ్

    బిగ్‌బాస్ ఓటీటీ షో నాన్ స్టాప్‌ లోకి మోడల్ అనిల్ రాథోడ్ కూడా అడుగుపెట్టి.. తన ఇంటిలో అందరూ పోలీస్ ఆఫీసర్లు అని, అయితే తాను మోడలింగ్‌ పై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను అంటూ అనిల్ చెప్పుకొచ్చాడు. పైగా తాను నేషనల్ స్థాయిలో మోడలింగ్‌లో రాణించాలని ఆశ పడుతున్నట్లు అనిల్ చెప్పాడు.

    Anil Rathod

    11వ కంటెస్టెంట్‌ : మిత్రా శర్మ

    ముంబై నుంచి వచ్చిన నటి మిత్రా శర్మ కూడా బిగ్‌బాస్ తెలుగు నాన్‌స్టాప్‌లోకి 11వ కంటెస్టెంట్‌గా అడుగు పెట్టి.. తన లైఫ్ గురించి, తన తల్లిదండ్రుల బ్రేకప్ గురించి చెబుతూ మొత్తానికి ఎమోషనల్ అయింది. ఇక తన కోసం తండ్రి రెండో పెళ్లి చేసుకొన్నాడని ఆమె చెప్పుకొచ్చింది. అయితే, తన తండ్రి మరణించడంతో ముంబైని వదిలి ఏడేళ్ల క్రితం హైదరాబాద్‌ వచ్చి నటన పై ఫోకస్ పెట్టాను అంటూ ఆమె చెప్పింది.

    Mitra Sharma

    12వ కంటెస్టెంట్‌ : తేజస్విని మదివాడ

    12వ కంటెస్టెంట్‌ గా తేజస్వి మదివాడ బిగ్‌ బాస్ నాన్ స్టాప్ షోలోకి గ్రాండ్ గా అడుగుపెట్టి.. ఎల్లో బికినీ స్ట్రాప్‌ లో గ్లామరస్‌గా కనిపిస్తూ తెగ ఫోజులు ఇచ్చింది. ఇంతకీ, బిగ్‌బాస్‌ లోకి ఎందుకు వచ్చావంటే.. ఆడియెన్స్‌ ను ఎంటర్‌టైన్‌ చెయ్యడానికి అంటూ సెలవిచ్చింది. ఇక ఈ నటి మ్యాడ్‌నెస్ అనే హ్యాష్ ట్యాగ్‌తో ఇంటిలోకి అడుగుపెట్టింది.

    Tejaswi Madivada

    13వ కంటెస్టెంట్‌ : 7 ఆర్ట్స్ సరయు

    బిగ్‌ బాస్ తెలుగు 5 సీజన్‌లో తొలివారంలోనే ఎలిమినేట్ అయిన సరయు.. మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు బిగ్‌బాస్ నాన్ స్టాప్‌ లోకి కూడా అడుగుపెట్టింది. ఆమెను చూసిన నాగ్ మాట్లాడుతూ.. బిగ్‌ బాస్ 5లో ఇలా వచ్చి అలా పోయావు.. ఈ సారి ఏమిటి ? అని అడిగాడు. జీవితం ప్రతీఒక్కరికి రెండో అవకాశం ఇస్తుంది అని, అయితే దానిని బాగా యూజ్ చేసుకొంటే గట్టిగా కొట్టొచ్చు అంటూ సరయు తన కొట్టుడు గురించి తడుముకోకుండా తెలియజేసింది.

    14వ కంటెస్టెంట్‌ : యాంకర్ శివ

    బిగ్‌ బాస్ నాన్ స్టాప్‌లోకి యాంకర్ శివ కూడా వచ్చేశాడు. అనేక అవమానాలు, కష్టాల తర్వాత యాంకర్‌ గా మారిపోయినట్టు ఇతగాడు వివరించాడు. ఎప్పుడు వివాదాస్పద ప్రశ్నలతో వార్తల్లో నిలిచే ఇతగాడిని బిగ్‌ బాస్ పలకరించాడు. అయితే ఇతను మాత్రం తన చెల్లెల్లి పెళ్లి చేయడానికి బిగ్‌ బాస్‌ లోకి అడుగుపెట్టాను అంటూ కాస్త ఎమోషనల్ టచ్ ఇచ్చాడు.

    15వ కంటెస్టెంట్‌ ; బిందు మాధవి

    తమిళ బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్‌ అయిన బిందు మాధవిను తెలుగు బిగ్‌బాస్‌లోకి తీసుకొచ్చారు. ఆవకాయ బిర్యానితో తెలుగు ప్రేక్షకులకు బిందు మాధవి బాగా తెలుసు. మదనపల్లి గ్రామానికి చెందిన తాను తెలుగు ప్రేక్షకులకు దగ్గర కావడానికి బిగ్ బాస్ లోకి వెళ్తున్నాను అంటూ బిందు మాధవి చెప్పుకొచ్చింది. మస్తీ అనే హ్యాష్ ట్యాగ్‌తో ఇంటిలో మస్తీ చేస్తాను అంటూ ఎంట్రీ ఇచ్చింది.

    16వ కంటెస్టెంట్‌ : హమీదా ఖాతూన్

    బిగ్‌ బాస్ 5 సీజన్‌లో సింగర్ శ్రీరామచంద్రతో రొమాన్స్ చేసిన హీరోయిన్ హమీదా ఖాతూన్.. అప్పుడు పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. అయితే బిగ్‌ బాస్ తర్వాత తన లైఫ్ చాలా మారిపోయింది అని.. ఇప్పుడు మళ్లీ తాను ఏమిటో చూపిస్తాను అంటుంది. ఇక పనిలో పనిగా సింగర్ శ్రీరామచంద్ర తనకు ఫ్రెండ్ మాత్రమే అని.. ఇక తగ్గేదేలే అనే హ్యాష్ ట్యాగ్‌ తో ఇంటిలోకి వెళ్ళింది.

    17వ కంటెస్టెంట్‌ : అఖిల్ సార్థక్ :

    బిగ్‌ బాస్ తెలుగు సీజన్ 4‌లో రన్నరప్ గా నిలిచిన యాక్టర్ అఖిల్ సార్థక్ బిగ్‌ బాస్ నాన్‌స్టాప్‌ లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సారి ట్రోఫి గెలుచుకొని వస్తాను అంటూ ఇంట్లోకి వెళ్ళాడు. ఇంటిలోకి అడుగుపెట్టగానే.. బిందుమాధవితో కలిసి స్టెప్పులు వేసి మరి అలరించాడు.

    Tags