Mana Shankara Vara Prasad Garu: మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) హీరో గా నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టిస్తున్న రికార్డ్స్ ని చూసి సోషల్ మీడియా లో మెగా అభిమానులు ఎంతగానో మురిసిపోతున్నారు. డైరెక్టర్ అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవి లోని వింటేజ్ యాంగిల్స్ ని బయటకు తీసాడు, కలెక్షన్స్ కూడా మెగాస్టార్ చిరంజీవి వింటేజ్ స్టామినా రేంజ్ లోనే ఉన్నాయని అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రం లో చిరంజీవి తల్లి పాత్ర, మరియు నయనతార మధ్య జరిగిన ఒక సంభాషణ సన్నివేశాన్ని చూసి విడాకులు తీసుకోవాలన్న ఒక టాలీవుడ్ జంట మళ్లీ కలిసిపోయారట. నిన్న సంక్రాంతి సందర్భంగా చిరంజీవి, వెంకటేష్ , అనిల్ రావిపూడి కలిసి ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూ లో మెగాస్టార్ చెప్పిన మాటలు ఇవి. పూర్తిగా ఆయన ఏమి మాట్లాడాడో మీరే చూడండి.
ఆయన మాట్లాడుతూ ‘ఈ సినిమాలో ఫన్ పార్ట్ ని పక్కన పెడితే. ఈ సినిమాలో చిన్న పిల్లలతో నాకున్న ఎమోషనల్ సన్నివేశాలు కానీ, అదే విధంగా నా తల్లి పాత్ర పోషించిన జరీనా వాహెబ్ తో నయనతార కి ఉన్న సన్నివేశాల గురించి ప్రతీ ఒక్కరు మెచ్చుకుంటున్నారు. దీని ప్రభావం ఎంత ఉందో మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మూడు నెలల నుండి ఒక జంట విడాకులు తీసుకోవాలని అనుకుంటూ ఉన్నింది. కానీ ఈ సినిమా చూసిన తర్వాత విడివిడిగా వాళ్ళు తిరిగి ఫోన్ చేసుకొని, కలిసిపోయి విడాకులు వద్దని నిర్ణయం తీసుకున్నారు. దీనికి కారణం నా తల్లి పాత్ర నయనతార తో పలికిన డైలాగ్స్ అని నాకు తర్వాత తెలిసింది. భార్య, భర్తల మధ్య ఏదైనా గొడవలు ఉంటే వాళ్లిద్దరూ మాట్లాడుకొని తేల్చుకోవాలి కానీ, మూడవ వ్యక్తి ప్రమేయం ఉండకూడదు అని అంటుంది. అలాంటి డైలాగ్ రాసినందుకు నీకు నిజామా సెల్యూట్’ అంటూ చిరంజీవి అనిల్ రావిపూడి తో అంటాడు.
ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ముఖ్యంగా ఆ సన్నివేశాన్ని నువ్వు తీర్చిదిద్దిన విధానం అద్భుతంగా ఉంది. అంత పెద్ద బిజినెస్ ఉమెన్ గా ఉండే తన కోడలితో, ఎదో క్యాజువల్ కాఫీ తాగుతూ మాట్లాడిన సంభాషణ అత్యధిక శాతం మంది జనాలకు బాగా కనెక్ట్ అయ్యింది’ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ సన్నివేశానికి నిజంగానే థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది. అత్తా కోడళ్ళు అంటే ఎంతసేపు వాదనలు చేసుకుంటూ, తిట్టుకుంటూ ఉంటారనే ఇన్నేళ్లు సినిమాల్లో చూపిస్తూ వచ్చారు. కానీ అత్తా కోడళ్ళు ఇలా కూడా మాట్లాడుకుంటారా?, వాళ్ళ మధ్య ఇంత ప్రేమ ఉంటుందా అనే విధంగా ఈ చిత్రం లో డైరెక్టర్ అనిల్ రావిపూడి చూపించిన విధానం అద్భుతం అనే చెప్పాలి. కచ్చితంగా విడిపోయే జంట ఈ సన్నివేశాన్ని చూసినప్పుడు ఒక క్షణం ఆలోచించుకునే అవకాశం ఉంటుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
అనిల్ రావిపూడి హ్యాట్సాఫ్..
ఈ సినిమా చూసి భార్యాభర్తలు తిరిగి కలిసిపోయారు
– చిరంజీవి pic.twitter.com/Lzj2zFTaa3
— Telugu360 (@Telugu360) January 15, 2026