This Week Movie Releases: సినిమా ఇండస్ట్రీ అనగానే ప్రతి ఒక్కరికి స్టార్ హీరోలు మాత్రమే గుర్తుకొస్తారు. కారణం ఏంటంటే వాళ్ళ సినిమాలను చూడడానికే ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. కాబట్టి వాళ్ల కూడా తమ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తుంటారు…ఇక ఇలాంటి క్రమంలోనే ఈ వారం రాజు వెడ్స్ రాంబాయి, ప్రేమంటే, 12 ఏ రైల్వే కాలనీ, పాంచ్ మినార్ అనే 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో ఏ సినిమా సూపర్ హిట్ టాక్ ను సంపాదించుకుంది. ఏ మూవీ మీడియం రేంజ్ మూవీగా నిలిచిపోయింది, ఏ సినిమా డిజాస్టర్ బాట పట్టింది అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకుందాం…
రాజు వెడ్స్ రాంబాయి
యూత్ ఫుల్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రీమియర్ తోనే పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఇక మొత్తానికైతే ఈ సినిమాకి ఈరోజు ప్రేక్షకులు బ్రాహ్మ రథం పట్టారనే చెప్పాలి. మొదటి షో తోనే పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమాని పెద్ద వాళ్లదాక ప్రతి ఒక్కరు చూడడానికి ఆసక్తి చూపిస్తూ ఉండడం విశేషం… ఇప్పటివరకు ఇలాంటి కంటెంట్ రాలేదంటూ చాలామంది ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. ప్రేమలోనే ఒక డిఫరెంట్ కోణాన్ని చూపించిన ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చింది…
ప్రేమంటే
ప్రియదర్శి హీరోగా, ఆనంది హీరోయిన్ గా వచ్చిన ‘ప్రేమంటే’ సినిమా డిఫరెంట్ అటెంప్ట్ గా వచ్చినప్పటికి సగటు ప్రేక్షకులను మెప్పించడంలో మాత్రం వెనుకబడిపోయింది. ప్రియదర్శి గత సినిమాల మాదిరిగానే ఈ సినిమా ఉండడంతో ప్రేక్షకులు ఈ సినిమాని చూడడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదు…
12 ఏ రైల్వే కాలనీ
అల్లరి నరేష్ హీరోగా వచ్చిన ఈ హర్రర్ థ్రిల్లర్ మూవీ ప్రేక్షకుడిని ఏమాత్రం భయపెట్టలేకపోయింది. అక్కడక్కడ కొద్దిగా థ్రిల్లింగ్ అంశాలను జోడించి భయపెట్టి ప్రయత్నం చేసిన కూడా అది వర్కౌట్ కాలేదు. దాంతో ఈ సినిమాకి కూడా ఆవరేజ్ టాక్ వచ్చింది…
పాంచ్ మినార్
ఒకప్పుడు యూత్ ఫుల్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున్న రాజ్ తరుణ్ గత కొన్ని రోజుల నుంచి ఒక సక్సెస్ ని సాధించడానికి తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నాడు. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికి సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. దాంతో ఆయన చాలా వరకు డీలా పడిపోయాడు. ఇక మొత్తానికైతే ఈ సినిమాకి అనుకున్న రేంజ్ లో రెస్పాన్స్ రాకపోవడంతో మొదటి షో తోనే డిజాస్టర్ టాక్ ను మూట గట్టుకోవడం విశేషం…
మొత్తానికైతే ఈ నాలుగు సినిమాల్లో రాజు వెడ్స్ రాంబాయి సినిమా సక్సెస్ ఫుల్ సినిమా నిలిచింది. ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందనను చూస్తే నిజంగా ఆశ్చర్య పోవాల్సిందే. చిన్న సినిమాగా వచ్చిన ఈ సినిమా చాలామంది హృదయాలను దోచుకొని మొత్తానికైతే సక్సెస్ ఫుల్ టాక్ ను సంపాదించుకొని ముందుకు సాగుతోంది…