Sankranthi Race: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సంక్రాంతి సినిమా సందడి మొదలైంది. ఇక ముందుగా జనవరి 12వ తేదీన మహేష్ బాబు గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాడు. అలాగే వెంకటేష్ హీరో గా వస్తున్న సైంధవ్ సినిమా కూడా ప్రేక్షకులను అలరించడానికి 13వ తేదీన రిలీజ్ కి రెఢీ అయింది. ఇక 14 వ తేదీన నా సామిరంగా సినిమాతో నాగార్జున రంగం లోకి దిగుతున్నాడు. ఇక ఈ నాలుగు సినిమాల్లో ఏ సినిమాకి భారీ హైప్ క్రియేట్ అయింది. ఏ సినిమా సక్సెస్ అయ్యే దిశగా ముందుకు దూసుకెళ్తుంది అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకుందాం…
ఇక ముందుగా గుంటూరు కారం సినిమా విషయానికి వస్తే ఈ సినిమా త్రివిక్రమ్ డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా వస్తున్న మూవీ కావడం వల్ల దీని మీద మొదటి నుంచి కూడా మంచి హైప్ అయితే క్రియేట్ అయింది. ఎందుకంటే స్టార్ హీరో స్టార్ డైరెక్టర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడం వల్ల ఈ సినిమాకి అంచనాలనేవి తారస్థాయిలో ఉండడం సహజం. అయితే దానికి తగ్గట్టుగానే ఈ సినిమా ట్రైలర్ ని కొద్ది గంటల క్రితమే రిలీజ్ చేశారు దానికి కూడా మంచి రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా పైన అంచనాలు భారీగా పెరిగిపోయాయి.ఇక ఈ సంక్రాంతికి ఈ సినిమా భారీ సక్సెస్ కొట్టబోతుందనేది మాత్రం పక్క గా అర్థమవుతుంది…
ఇక నెక్స్ట్ మనం చెప్పుకునే సినిమా తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న హనుమాన్…ఈ సినిమాకి ప్రేక్షకుల్లో మంచి బజ్ అయితే ఉంది. ఈ సినిమా టీజర్ రిలీజ్ అయినప్పటి నుంచే దీనిమీద ప్రేక్షకుల్లో మంచి హైప్ క్రియేట్ అయింది.ఇక ఆ హైప్ ఈ సినిమాకి చాలా వరకు ప్లేస్ అవ్వబోతుంది.ఇక స్టార్ హీరోలు పోటీలో ఉన్నప్పటికి ఏ మాత్రం భయపడకుండా సంక్రాంతి బరిలో ఈ సినిమాని రంగంలోకి దిగడం నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. అయితే దర్శకుడు ప్రశాంత్ వర్మ ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కించాడు అనే విషయం అయితే చాలా స్పష్టం గా తెలుస్తుంది. మరి ఈ సినిమా రిలీజ్ అయితే గాని ఈ సినిమా సక్సెస్ అవుతుందా ఫెయిల్యూర్ అవుతుందా అనే విషయం క్లారిటీ గా తెలియదు…
ఇక సంక్రాంతి కి వస్తున్న మరొక సినిమా వెంకటేష్ హీరోగా వచ్చిన సైంధవ్ సినిమా ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఎందుకంటే వెంకటేష్ ఫ్యామిలీ సబ్జెక్టులతో వచ్చిన ప్రతిసారి మంచి విజయాన్ని అందుకున్నాడు. ముఖ్యంగా ఈ సినిమాలో ఫ్యామిలీ సెంటిమెంట్ తో పాటు కూతురు ఎమోషన్ ని కూడా జోడించి దర్శకుడు చాలా అద్భుతంగా తెరకెక్కించినట్టు గా మనకు ట్రైలర్ చూస్తే తెలుస్తుంది…కాబట్టి ఈ సినిమా కూడా ప్రేక్షకుల్లో మంచి అంచనాలను పెంచింది…
ఇక నాగార్జున హీరోగా వస్తున్న నా సామి రంగ సినిమా కూడా సంక్రాంతి బరిలో ఉంది. అయితే ఈ సినిమాకి నాగార్జున పెద్దగా పబ్లిసిటీ చేయనట్టుగా కనిపిస్తుంది. అందుకే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో అంచనాలు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయనే చెప్పాలి. ఇక ఈ సినిమా సంక్రాంతి కి వచ్చి మంచి సక్సెస్ సాధించాలని చూస్తుంది. ఈ సినిమా నుంచి వచ్చిన ఒక సాంగ్ మాత్రం ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసింది…
ఇక సంక్రాంతికి విన్నర్ ఎవరో తెలియాలంటే అన్ని సినిమాలు రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే…