Dil Raju vs Warangal Srinu: ‘తాడిని తన్నే వాడుంటే.. వాడి తలను తన్నే వాడు మరొకడుంటాడు’ అనే సామెత ప్రస్తుతం టాలీవుడ్ లో వరంగల్ శ్రీనుకి బాగా సూట్ అయ్యేలా ఉంది. అనామకుడిగా ఇండస్ట్రీకి వచ్చి.. పెద్ద సినిమాల దగ్గర నుంచి చిన్నాచితకా సినిమాల వరకూ ఏ సినిమాని వదలడం లేదు. ముఖ్యంగా నైజాం అంటే.. వరంగల్ శ్రీను అడ్డా అంటున్నాడు.
నిజానికి నైజాంలో దిల్ రాజే కింగ్. ఏ సినిమా ఎప్పుడు రిలీజ్ అవ్వాలి ?, ఏ సినిమాకి ఎన్ని థియేటర్స్ ఇవ్వాలి ? లాంటి లెక్కల్లో ఆరితేరిపోయిన ఈ బడా నిర్మాత తలను తన్నడానికే నేను వచ్చాను అన్నట్టు ఉంది ‘వరంగల్ శ్రీను’ వ్యవహారం. దిల్ రాజు ఏ సినిమా కొనాలని ప్లాన్ చేసినా.. ఆ సినిమాని శ్రీను ముందుగానే కొనేస్తున్నాడు.
సహజంగా పెద్ద సినిమాలను దిల్ రాజు అసలు వదులుకోడు. నైజాంలో రాజుకి ఫుల్ పట్టు ఉంది కాబట్టి.. మేకర్స్ కూడా పక్క చూపులు చూడరు. కానీ, ‘ఆచార్య’ నైజాం హక్కుల కోసం దిల్ రాజు.. వరంగల్ శ్రీనుతో పోటీ పడలేకపోయాడు. ఇప్పుడు పూరి జగన్నాథ్ – విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న ‘లైగర్’ సినిమా నైజాం రైట్స్ విషయంలో కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యింది.
లైగర్ సినిమా నైజాం హక్కులను కొనాలని దిల్ రాజు చాలా ముందుగా ప్లాన్ చేసుకున్నాడు. ఐతే, ఈ విషయం తెలుసుకున్న వరంగల్ శ్రీను నిన్న రాత్రి పూరి జగన్నాథ్ ని కలుసుకుని నైజాంలో అత్యధిక ధరకు లైగర్ సినిమాని కొనుగోలు చేశాడ. ఆచార్య దెబ్బకు వరంగల్ శ్రీను ప్రస్తుతం నష్టాల్లో ఉన్నాడు. అయినా.. దిల్ రాజుతో పోటీ విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు.
ఇప్పటికే దిల్ రాజుదక్కకుండా ‘పుష్ప 2’, ‘సర్కారు వారి పాట’ సినిమాల నైజాం రైట్స్ ను కూడా వరంగల్ శీను కొనేశాడు. ఇప్పుడు చాలామంది చిన్న నిర్మాతలు వరంగల్ శీను భుజం మీద నుంచి దిల్ రాజు పై బాణం ఎక్కు పెట్టడానికి రెడీ అవుతున్నారు. ముఖ్యంగా నైజాంలో దిల్ రాజు ప్రభను వెలగకుండా అడ్డు నిలబడుతున్నారు. మరి దిల్ రాజు ఏమి చేస్తాడో చూడాలి.
Also Read:Second Day Highest Grossing Movie: రెండవ రోజు అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఏమిటో తెలుసా..?