Telugu Bigg Boss winners: బిగ్ బాస్ టైటిల్ గెలవగానే సినిమా అవకాశాలు వచ్చేస్తాయి, పెద్ద రేంజ్ కి వెళ్ళిపోతాము, మేము తోపులం, తురుములం అని అంతా అనుకుంటూ ఉంటారు. కానీ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కి గుర్తింపు కేవలం రెండు మూడు నెలలు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ఆడియన్స్ ఆ టైటిల్ విన్నర్ పేరు ని కూడా మర్చిపోతూ ఉంటారు. ఇప్పటి వరకు 9 సీజన్స్ జరిగాయి, ఈ 9 సీజన్స్ లో టైటిల్ విన్నర్స్ గా నిల్చిన వారు ఇప్పుడు ఏమి చేస్తున్నారో ఒకసారి చూద్దాం.
శివ బాలాజీ (బిగ్ బాస్ 1):
ఈయన బిగ్ బాస్ హౌస్ లోకి రాకముందు నుండే మంచి పాపులర్ నటుడు. వరుసగా సినిమాలు చేస్తూ ఉండేవాడు. కానీ బిగ్ బాస్ టైటిల్ గెలిచి బయటకు వచ్చిన తర్వాత ఇతనికి అవకాశాలు ఊహించిన రేంజ్ లో రాలేదు. ఇంకా గట్టిగా చెప్పాలంటే బిగ్ బాస్ లోకి రాకముందే ఇతనికి సినిమాల్లో మంచి డిమాండ్ ఉండేది.
కౌశల్ (బిగ్ బాస్ 2):
ఇప్పటి వరకు జరిగిన అన్ని బిగ్ బాస్ సీజన్స్ లో సీజన్ 2 టైటిల్ విన్నర్ కౌశల్ క్రియేట్ చేసినంత సునామీ ఏ కంటెస్టెంట్ కూడా చేయలేకపోయారు. ఈ సీజన్ నడుస్తున్నన్ని రోజులు కౌశల్ కి ఒక స్టార్ హీరోకి ఉన్నంత ఫ్యాన్ బేస్ ఉండేది. ఆయన కోసం ర్యాలీలు, పూజలు కూడా చేసిన అభిమానులు ఉన్నారు. కౌశల్ ఆర్మీ అంటూ అప్పట్లో ఒక ట్యాగ్ వేరే లెవెల్ లో సోషల్ మీడియా లో ట్రెండ్ అయ్యేది. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఇతని సినీ కెరీర్ పూర్తిగా మారిపోతుందని అంతా అనుకున్నారు. కానీ ఆ సీజన్ ముగిసిన తర్వాత ఇతన్ని ఆడియన్స్ పూర్తిగా మర్చిపోయారు.
రాహుల్ సిప్లిగంజ్ (బిగ్ బాస్ 3 ):
సింగర్ క్యాటగిరీ లో బిగ్ బాస్ సీజన్ 3 లోకి అడుగుపెట్టిన రాహుల్ సిప్లిగంజ్, బిగ్ బాస్ టైటిల్ గెలుచుకొని బయటకు వచ్చిన తర్వాత బాగానే సక్సెస్ చూసాడు. వరుసగా సినిమాల్లో పాటలు పాడుతూ ఫుల్ బిజీ అయ్యాడు. #RRR లో నాటు నాటు పాట పాడి ఏకంగా ఆస్కార్ వరకు వెళ్ళొచ్చాడు. ఇతనొక్కడే బిగ్ బాస్ విన్నర్ గా నిలిచి కెరీర్ పరంగా కూడా పీక్ రేంజ్ ని ఎంజాయ్ చేస్తున్నది.
అభిజిత్ (బిగ్ బాస్ 4):
కౌశల్ తర్వాత బిగ్ బాస్ రియాలిటీ షో లో బలమైన పాదముద్ర వేసిన కంటెస్టెంట్ అభిజిత్. ఇతన్ని మించిన తోపు కంటెస్టెంట్ ఇప్పటి వరకు బిగ్ బాస్ హిస్టరీ లో ఎవ్వరూ రాలేదని అంటుంటారు. చాలా కూల్ యాటిట్యూడ్ తో ఉండే అభిజిత్, మాస్టర్ మైండ్ గేమ్ ప్లానింగ్ తో టైటిల్ విన్నర్ గా నిలిచి చరిత్ర సృష్టించాడు.
సన్నీ (బిగ్ బాస్ 5 ):
బిగ్ బాస్ సీజన్ 5 టైటిల్ విన్నర్ గా నిల్చిన సన్నీ, ఇప్పుడు అటు సినిమాల్లో, ఇటు సీరియల్స్ లో లేక కెరీర్ పరంగా గడ్డు పరిస్థితి ని ఎదురుకుంటున్నాడు. రీసెంట్ గానే ఒక కుకింగ్ షో లో దర్శనమిచ్చిన సన్నీ, ఆ తర్వాత ఎటు పోయాడో ఎవరికీ తెలియదు. రెండు మూడు సినిమాల్లో హీరో గా నటించి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు కానీ, అవి వర్కౌట్ అవ్వలేదు.
రేవంత్ (బిగ్ బాస్ 6):
పాపులర్ సింగర్ గా పేరు తెచ్చుకున్న రేవంత్, బిగ్ బాస్ సీజన్ 6 టైటిల్ విన్నర్ గా నిలిచాడు. బయటకు వచ్చిన తర్వాత ఈయన ఎక్కువగా టీవీ షోస్ లో కనిపించడానికి ఆసక్తి చూపించలేదు. కానీ సినిమాల్లో పాటలు ఇప్పటికీ పాడుతూనే ఉన్నాడు. అలా అని బిగ్ బాస్ కారణంగా ఇతని కెరీర్ లో ఊహించని మార్పులు ఏమి జరగలేదు.
పల్లవి ప్రశాంత్ (బిగ్ బాస్ 7):
రైతు బిడ్డ అంటూ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్, టైటిల్ విన్నర్ గా నిల్చిన రోజు జరిగిన సంఘటనలు అంత తేలికగా మరచిపోలేము. ఆ సీజన్ రన్నర్ గా నిల్చిన అమర్ దీప్ కారు పై పల్లవి ప్రశాంత్ మనుషులు దాడి చేశారు. ఆ ఘటన కి పల్లవి ప్రశాంత్ ని పోలీసులు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అంతే ఆ ఘటన తర్వాత ఇతను ఏ టీవీ షో లోనూ కనిపించలేదు, ఎలాంటి సినిమాలు చేయలేదు. కానీ రన్నర్ గా నిల్చిన అమర్ డీప్ మాత్రం వరుసగా టీవీ షోస్ చేస్తున్నాడు , మరోపక్క వరుసగా సినిమాలు కూడా చేస్తున్నాడు.
నిఖిల్ (బిగ్ బాస్ 8):
గత సీజన్ టైటిల్ విన్నర్ గా నిల్చిన నిఖిల్, బిగ్ బాస్ హౌస్ లోకి రాకముందు రెండు మూడు సీరియల్స్ చేస్తుండేవాడు. కానీ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఇతనికి ఎలాంటి పెద్ద ప్రాజెక్ట్స్ రాలేదు. ఒకపక్క సినిమాల్లోనూ లేడు, మరోపక్క సీరియల్స్ లో కూడా కనిపించలేదు.
పవన్ కళ్యాణ్ (బిగ్ బాస్ 9):
ఈ సీజన్ టైటిల్ విన్నర్ గా నిల్చిన పవన్ కళ్యాణ్ పడాల పరిస్థితి కూడా ఇలాగే ఉండబోతుందా?. సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నవాళ్లకే బిగ్ బాస్ తర్వాత అవకాశాలు రావడం లేదు, ఇక ఈ జవాన్ కి ఏమి అవకాశాలు వస్తాయి చెప్పండి. పైగా ఇతను బిగ్ బాస్ హౌస్ లో ఉన్నన్ని రోజులు ఎంటర్టైన్మెంట్ పంచింది కూడా లేదు. దర్శక నిర్మాతలు ఇతనిలో ఏ టాలెంట్ చూసి ఇవ్వగలరు?, బహుశా మళ్లీ ఆయన ఆర్మీ కి తిరిగి వెళ్లిపోవచ్చేమో. కొన్ని రోజులు అయ్యాక ఇతని పేరు కూడా ఆడియన్స్ కి గుర్తు ఉండదు, అలాంటి పరిస్థితి వస్తుంది.