Chiranjeevi upcoming movies: మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని ఇండస్ట్రీలో ఉన్న ప్రతి దర్శకుడు కోరుకుంటాడు. కానీ చిరంజీవి మాత్రం మంచి కథను రెడీ చేసుకుని తన క్రేజ్ ని బ్యాలెన్స్ చేయగలిగే దర్శకులకు మాత్రమే అవకాశాలను ఇస్తాడు. గత కొన్ని రోజుల నుంచి చిరంజీవితో సినిమా చేయడానికి చాలామంది దర్శకులు ఆసక్తి చూపిస్తున్నారు. అయినప్పటికి వాళ్లెవరికి అవకాశాలైతే రావడం లేదు… ముఖ్యంగా ‘సోగ్గాడే చిన్నినాయన’ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఆ తర్వాత చేసిన సినిమాలతో సైతం మంచి విజయాలను సాధించాడు. ఈ మధ్యకాలంలో ఆయన నుంచి సినిమాలైతే తే రావడం లేదు. గతంలో చిరంజీవితో సినిమాని చేయబోతున్నాడు అంటూ వార్తలు వచ్చినప్పటికి అది కార్యరూపం దాల్చలేదు. కారణం ఏదైనా కూడా మెగాస్టార్ చిరంజీవిని డైరెక్షన్ చేయడం అనేది నిజంగా చాలా అదృష్టమనే చెప్పాలి. అది అందరికి వర్తించదు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ అభిమానులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. కాబట్టి తమ అభిమాన హీరోను డిఫరెంట్ యాంగిల్ లో చూపించాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు.
కానీ చిరంజీవి మాత్రం దానికి కొంతవరకు భిన్నంగా వ్యవహరిస్తాడు. కమర్షియల్ సినిమాల్లోనే ప్రేక్షకుడికి నచ్చే విధంగా సినిమాలు ఉండాలని ఆయన ముందుగా కండిషన్స్ పెడతాడు. కాబట్టి ఆ కండిషన్స్ ని అంగీకరించిన వాళ్ళు మాత్రమే అతనితో సినిమాలు చేయడానికి ముందుకు వస్తారు. లేకపోతే మాత్రం ఆయన సినిమాలను చేయలేడు.
ఇక ముఖ్యంగా కమర్షియల్ సినిమాలైతేనే ప్రేక్షకులు ఆదరిస్తారు. కాబట్టి వాళ్ల కోసం చిరంజీవి అలాంటి సినిమాలనే చేయడానికి సిద్ధమవుతున్నాడు… ఇక హరీష్ శంకర్ లాంటి దర్శకుడు సైతం చిరంజీవి తో ‘దొంగ మొగుడు’ లాంటి సినిమాని చేస్తానని గతంలో అనౌన్స్ చేసినప్పటికి చిరంజీవి అతన్ని నమ్మడం లేదు. రవితేజ చేసిన ‘మిస్టర్ బచ్చన్’ సినిమా విజయాన్ని సాధించలేదు.
దాంతో ఆయన మరోసారి డీలా పడిపోయాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో చేస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నాడు… ఒకవేళ ఆ సినిమాతో సక్సెస్ ని సాధిస్తే చిరంజీవి నుంచి అవకాశం వచ్చే ఛాన్సులైతే ఉన్నాయి…