Prabhas: బాహుబలి తరువాత ప్రభాస్ వరుసబెట్టి సినిమాలకు సైన్ చేస్తున్నాడు. అయితే ఆ సినిమాలు రిలీజ్ కావడంలో మాత్రం చాలా టైం తీసుకుంటున్నాయి. ఒక్కో సినిమా దాదాపు సంవత్సరం పాటు కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ మూతులు తిప్పుకుంటున్నారు. రెబల్ స్టార్ లేటెస్టుగా నటించిన ‘ఆదిపురుష్’ గతేడాదే పూర్తయింది. కానీ ఆ మూవీ రిలీజ్ కు అనేక అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు ఆయన నటిస్తున్న ‘సాలార్’ అప్డేట్ రాకపోవడంతో మరింత నిరీక్షించాల్సి వస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నట్లు సమాచారం. అయితే వాటి సంగతి తేల్చకముందే ఈయన మరో సినిమాకు ఓకే చెప్పాడట. ఆ సినిమా స్ట్రాట్ కావడానికి 2024 సంవత్సరం రావాలట. అయితే ఇంత ముందుగా ప్రభాస్ సినిమాలను ఒప్పుకోవడంపై ఫ్యాన్ష్ కాస్త ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే..?

‘సాహో’, ‘రాధేశ్యామ్’ డిజాస్టర్ తో సంబంధం లేకుండా ప్రభాస్ వరుస సినిమాల్లో నటిస్తున్నాడు. ఆయన నటించిన ‘ఆదిపురుష్’ రిలీజ్ కు సిద్ధంగా ఉంది. ఇప్పుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వస్తున్న ‘సాలార్’ తో బిజీగా మారాడు. ఇది చేస్తూనే గ్యాప్ లో ‘ప్రాజెక్ట్- కే’ కంటిన్యూ చేస్తున్నారు. అయితే అంతకుముందే మారుతి సినిమాకు ఓకే చెప్పాడు. ఇవి ఉండగానే ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడు సందీప్ రెడ్డి ‘స్పిరిట్‘సినిమాకు సైన్ చేసిన విషయం తెలిసింది. తాజాగా బాలీవుడ్ డైరెక్టర్ సిద్దార్థ్ ఆనంద్ తో మరో మూవీకి కమిట్ అయినట్లు సమాచారం.
సిద్దార్థ్ ఆనంద్ ప్రస్తుతం షారుఖ్ తో ‘పఠాన్’ అనే సినిమా తీస్తున్నాడు. అంతకుముందు ‘వార్’ సినిమాతో బీ టౌన్లో సిద్దార్థకు స్పెషల్ ఇమేజ్ వచ్చింది. దీంతో అదే ఊపుతో ఇప్పుడు ‘పఠాన్’ తీస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన తరువాత ప్రభాస్ తో సినిమా తీయాలని అనుకున్నాడట. వెంటనే రెబల్ స్టార్ ను కలవడంతో ఓకే చెప్పినట్లు సమాచారం.ఇప్పటికే ‘ఆదిపురుష్’తో ప్రభాస్ ఇన్ డైరెక్ట్ గా బాలీవుడ్ హీరో అయిపోయాడు. దీంతో ఆయనతో సినిమా చేయడానికి హిందీ దర్శకులు వెంటబడుతున్నారు.

ఇంతవరకు బాగానే ఉంది. కానీ ప్రభాస్ ఈ సినిమాలన్నీ ఎప్పుడు పూర్తి చేస్తారని ఫ్యాన్స్ అడుగుతున్నారు. బాహుబలి తరువాత సాహో రావడానికి కనీసం రెండు సంవత్సరాలు పట్టింది. ఆ తరువాత రాధేశ్యామ్ రావడానికి కరోనా గ్యాప్ తో కలుపుకొని నాలుగేళ్లయింది. ఇప్పుడు ఆదిపురుష్ వచ్చే నెల జూన్ కు వాయిదా వేశారు. ‘సాలార్’ అప్డేట్ ఇన్ఫర్మేషన్ లేనేలేదు. దీంతో ఈ సినిమాలన్నీ ప్రభాస్ ఎప్పుడు కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నారు. అంతేకాకుండా ప్రభాస్ సినిమాల కోసం ఎదురు చూసే వారికి నిరీక్షణే ఎదురవుతుందని చర్చించుకుంటున్నారు.