History of Film: సినిమా అనేది మానవ జీవితంలో ఓ భాగం అయిపోయింది. మరి ప్రపంచంలోని మొట్టమొదటి చిత్రం ఏమిటి ? అసలు సినిమాని ఎలా కనిపెట్టారు ? మొదటి సినిమాగా ఏది వచ్చింది ? ఇలాంటి అనేక విషయాల పై ఆసక్తి ఉంటుంది. మీకు తెలుసా ? రౌండ్ హౌస్ గార్డెన్ సీన్స్ అనేది మొదటి సినిమా. 1888 లో ఫ్రెంచ్ లూయిస్ లే ప్రిన్స్ అనే వ్యక్తి ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు.

ఈ సినిమాని ఇంగ్లాండ్ లో షూట్ చేశారు. ఈ మొదటి చిత్రం 1.66 సెకన్ల పాటు సాగింది. అయితే, ప్రసిద్ధి చెందిన మొదటి చిత్రం లూమియర్ సోదరులు తీసిన “లా సియోటాట్ స్టేషన్’. ఇది ఒక చిన్న డాక్యుమెంటరీ లాంటిది. దీన్ని 1895 లో చిత్రీకరించారు. ప్రపంచంలోని మొట్టమొదటి చిత్రం చూసిన ప్రేక్షకులు అద్భుతంగా ఫీల్ అయ్యారట.
Also Read: : 500 ఏళ్ల క్రితం ఇండియాలో కారం బదులు ఏమి వాడే వారో తెలుసా ?
ప్రేక్షకులు తమ సీట్ల నుండి దూకి పారిపోయాట. అందుకే.. ప్రపంచంలోని మొట్టమొదటి చిత్రం యొక్క ప్రభావం నిజంగా అద్భుతమైనది. ప్రేక్షకులు తమ సీట్ల నుంచి దూకించింది మొదటి సినిమా. ఆ తర్వాత లూమియర్ సోదరుల “ది వాటర్డ్ వాటరర్” అనే మరొక చిత్రం తీశారు. మొదటి చిత్రాల స్వల్ప వ్యవధి సినిమాలగానే వచ్చాయి.

అయితే, 1900 ల ప్రారంభంలో, చిత్రాల పొడవు క్రమంగా 20 నిమిషాలకు పెరిగింది. అయితే, సౌడ్ తో వచ్చిన మొట్టమొదటి చిత్రం “జాజ్ సింగర్”, ఈ మోషన్ పిక్చర్ నిశ్శబ్ద చిత్రాలకు ముగింపు పలికింది కూడా.
ఇక మొదటి కలర్ ఫుల్ చిత్రాలు విషయానికి వస్తే..
మొట్టమొదటి పూర్తి-నిడివి గల కలర్ సినిమా “బెక్కి షార్ప్”. ఇది 1925 లో విడుదలైంది. మొత్తానికి కొంతమందికి మాత్రమే పరిమితం అయిన సినిమా.. నేడు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందికి చేరింది. ఈ ఆధునిక ప్రపంచంలో సినిమా పాత్ర అద్భుతం. ప్రతి వ్యక్తి వారానికి కనీసం ఒక సినిమా అయినా చూస్తాడు. అంతగా సినిమా మనలో భాగం అయిపోయింది.
Also Read: విషాదం : ప్రముఖ సంగీత దర్శకుడు మృతి
[…] DGP CMO Secretary: పీఆర్సీపై ఏపీలో ఉద్యోగులు చేసిన ఆందోళన చివరకు ఉన్నతాధికారుల సీటుకు ఎసరు తెచ్చింది. ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆందోళనను కట్టడి చేయడంలో ఇద్దరు అధికారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశారని సీఎం జగన్ వారిపై చర్యలు తీసుకున్నట్టు భోగట్టా.. వారిలో ఒకరు రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ కాగా.. మరొకరు సీఎంవో కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్ ప్రకాశ్ . అయితే వీరు మొదటి నుంచి ప్రభుత్వానికి అనుకూలంగానే పనిచేస్తున్నా.. అనూహ్యంగా వీరిని బదిలీ చేయడం చర్చనీయాంశమయ్యాయి. ఈ వ్యవహారంపై ప్రతిపక్ష రాజకీయ పార్టీలు స్పందించాయి. ఈ బదిలీలపై టీడీపీ నాయకులు మాట్లాడుతూ జగన్ ఏదో కొత్త ప్లాన్ వేస్తున్నాడని, ఇందులో భాగంగానే వారి స్థానాలను మార్చారన్నారు. అలాగే జనసేన అధినేత పవన్ మాట్లాడుతూ డీజీపీని మార్చి మిగతా పోలీసులకు హెచ్చరికలు పంపారా..? అని విమర్శించారు. […]
[…] Bappi Lahiri songs for Megastar : ప్రముఖ బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ బప్పిలహరి కొద్ది సేపటి కిందట ఈ లోకాన్ని విడిచి వెళ్లాడు. ఆయన మనమధ్య లేరన్న విషయం సంగీత లోకం జీర్ణించుకోలేకపోతుంది. అయితే ఆయన మ్యూజిక్ చేసిన పాటలు మాత్రం ఆయయ గుర్తులుగా మనమధ్యే ఉండిపోయాయి. బాలీవుడ్ తో పాటు తెలుగులోనూ బప్పిలహరి మంచి హిట్ సాంగ్స్ అందించారు. తెలుగులో సింహాసనం సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత స్టేట్ రౌడీ, సామ్రాట్, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, రౌడీ ఇన్ స్పెక్టర్, చిత్రాలకు సంగీతం అందించారు. ఆయన ఆలపించిన చల్తే చల్తే, డిస్కో డ్యాన్సర్ గీతాలు బాగా పాపులర్ అయ్యాయి. అయితే మిగతా హీరోల కంటే మెగాస్టార్ చిరంజీవితో బప్పిలహరి ఎక్కువగా సినిమాలకు మ్యూజిక్ ను అందించారు. […]
[…] Praveen Prakash: ఒకే దెబ్బకు రెండు పిట్టలు.. ఒక ఉన్నతాధికారి పోతే పండుగ చేసుకుంటున్న పరిస్థితి ప్రస్తుతం ఏపీలో నెలకొందట… ఆయన ఏం చేశాడు? ఎలా చేశాడన్న దానిపై ఇప్పుడు కథలు కథలుగా చెబుతున్నారు. ఏపీ సీఎం జగన్ నిన్న రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో ఉన్నత స్థానంలో ఉన్న ఇద్దరు అధికారులను అనూహ్యంగా బదిలీ చేశారు. వీరిలో ఒకరు డీజీపీ గౌతమ్ సావాంగ్ కాగా.. మరొకరు సీఎంవో కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్. ‘చలో విజయవాడ’ కార్యక్రమ విజయవంతానికి కారణం డీజీపీనేనని, అందుకే బదిలీ చేశారని అనుకుంటున్నారు. అయితే అసలు కారణం వేరే ఉన్నా.. ఆయన బదిలీ చర్చనీయాంశంగా మారింది. ఇక పరిపాలనకు కేంద్ర బిందువైన సీఎంవో కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ను కూడా బదిలీ చేశారు. అయితే ప్రవీణ్ ప్రకాశ్ పై అధికారులు, ప్రజాప్రతినిధుల్లో ఇప్పుడు చర్చ సాగుతోంది. ఆయన బదిలీ కావడంతో వీరంతా ఊపిరి పీల్చుకున్నంత పనైందని అంటున్నారు. ఇంతకీ ప్రవీణ్ చేసిన చేసిన పనులేంటి? ఆయన బదిలీతో వాళ్లంతా ఎందుకు సంతోషంగా ఉన్నారన్న దానిపై స్పెషల్ ఫోకస్.. […]