RRR Movie : త్రిబుల్ ఆర్ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీయార్ కాకుండా ఈ ఇద్దరు హీరోలు చేసి ఉంటే ఎలా ఉండేది..?

రాజమౌళి లాంటి దిగ్గజ దర్శకుడి తో సినిమా చేయాలనే కోరిక అందరికీ ఉంటుంది. ఇక త్రిబుల్ ఆర్ సినిమా వచ్చిన తర్వాత ఇది ఇంకాస్త ఎక్కువైందనే చెప్పాలి...

Written By: Gopi, Updated On : July 31, 2024 10:51 am
Follow us on

RRR Movie : సినిమా ఇండస్ట్రీలో ఒక హీరో సూపర్ సక్సెస్ ఫుల్ సినిమాలను తీసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటాడు…ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో యంగ్ హీరోలు మంచి కథలను ఎంచుకొని సినిమాలు చేసి సక్సెస్ ఫుల్ హీరోలుగా నిలబడుతున్నారు. ఇక మరి కొంతమంది మాత్రం ఇండస్ట్రీకి ఎంత తొందరగా వస్తున్నారో అంతే తొందరగా ఫేడ్ అవుట్ అయిపోతున్నారు. ఇక ఇదిలా ఉంటే కొంతమంది దర్శకులు మాత్రం అవకాశాల కోసం చాలా సంవత్సరాలుగా ఎదురు చూసి ఒక మంచి కథతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు… ఇక ఎవరి పరిస్థితి ఎలా ఉన్నా కూడా దర్శక ధీరుడి గా పేరుపొందిన రాజమౌళి మాత్రం ఎవరి అంచనాలకు అందని రీతిలో ముందుకు దూసుకెళ్తున్నాడు. ఒక్కొక్క స్టెప్ పైకెక్కుతూ ప్రస్తుతం తన సినిమాల ద్వారా ప్రపంచ స్థాయికి ఎదిగాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక మొత్తానికైతే ఆయన చేసిన ప్రతి సినిమాతో ఒక పెద్ద విజయాన్ని సాధిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే రాజమౌళి ఎన్టీయార్ – రామ్ చరణ్ లను హీరోలుగా పెట్టి చేసిన ‘త్రిబుల్ ఆర్’ సినిమా ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించిందనే విషయం మనకు తెలిసిందే… ఇక వరల్డ్ వైడ్ గా ఈ సినిమాకి చాలా మంది అభిమానులు కూడా ఉన్నారు. హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఆయన ‘జేమ్స్ కామెరూన్’ సైతం ఈ సినిమా గురించి మాట్లాడాడు అంటే ఇది ఎంతటి విజయాన్ని నమోదు చేసుకుందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక న్యూస్ అయితే తెగ వైరల్ అవుతుంది. అది ఏంటి అంటే ‘త్రిబుల్ ఆర్’ సినిమాని రామ్ చరణ్ – ఎన్టీఆర్ లు కాకుండా తమిళ్ స్టార్ హీరోలు అయిన సూర్య – విక్రమ్ లతో చేసి ఉంటే ఎలా ఉండేది అనే కొన్ని ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. ఇక దీనికి సమాధానం గా కొంతమంది సూర్య – విక్రమ్ కూడా ఈ సినిమాకు బెస్ట్ ఆప్షన్ అంటూ వాళ్ల అభిప్రాయాల్ని చెబుతున్నారు.

ఇక మరికొందరు మాత్రం ఎన్టీఆర్ – రామ్ చరణ్ లు మాత్రమే ఈ సినిమాకి బాగా సెట్ అయ్యారు. సూర్య – విక్రమ్ లు చేస్తే అంతటి మ్యాజిక్ ను తీసుకొచ్చేవారు కాదు అంటూ వాళ్ళు తమ అభిప్రాయాల్ని కామెంట్ల రూపం లో తెలియజేస్తున్నారు. ఇక మరికొంతమంది మాత్రం సినిమా ఎప్పుడో వచ్చింది. సక్సెస్ కూడా అయింది. అలాగే అందరికీ చాలా మంచి గుర్తింపును కూడా తీసుకు వచ్చింది. ఇక అదంతా వదిలిపెట్టి ఇప్పుడు ఈ సినిమాని ఆ హీరోలు చేసుంటే ఎలా ఉండేది? ఆ రెడీ రీ సినిమాను చేసిన హీరోలు చేయకుండా ఉంటే బాగుండేదా?అనే క్వశ్చన్ ను వేయడం కరెక్ట్ కాదు అంటూ మర్రి కొంతమంది కొంచెం వైల్డ్ గా రియాక్ట్ అవుతున్నారు.

ఇక మొత్తానికైతే ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ ఇద్దరూ కూడా పాన్ ఇండియాలో సక్సెస్ అవ్వడమే కాకుండా వరల్డ్ లెవెల్లో కూడా మంచి గుర్తింపును సంపాదించుకోవడం విశేషం…ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం రాజమౌళి మహేష్ బాబు తో పాన్ వరల్డ్ సినిమా చేస్తుంటే ఎన్టీయార్ – రామ్ చరణ్ లు మాత్రం పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు…