Jr. NTR : తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ఎనలేని గుర్తింపు అయితే ఉంది. ఈ ఫ్యామిలీ నుంచి వచ్చిన నందమూరి తారక రామారావు గారు తనదైన రీతిలో సేవలను అందిస్తూ సినిమా ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్లిన విషయం మనకు తెలిసిందే. మరి ఇప్పటికి కూడా నందమూరి ఫ్యామిలీ నుంచి చాలామంది హీరోలు వాళ్లను వాళ్ళు స్టార్ హీరోలుగా నిలబెట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయినప్పటికి అందులో కొంతమందికి మాత్రం మంచి విజయాలు సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు. ఇక ఇలాంటి సందర్భంలో వాళ్ళకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవాలని ధోరణిలో ఆలోచిస్తూ ముందుకు సాగుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా విషయంలో ఎలాంటి నిర్ణయాలను తీసుకుంటున్నారనేది కూడా ఇక్కడ చర్చనియాంశంగా మారింది. ఇక ఈ ఫ్యామిలీ నుంచి మూడోతరం హీరోగా వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ సైతం తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్లడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి.
ఇక ప్రస్తుతం ఆయన తనలోని నట విశ్వరూపాన్ని బయటకి చూపిస్తూ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేస్తున్నాడనే చెప్పాలి. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న ఈ స్టార్ హీరోలు అందరూ సినిమా స్థాయిని పెంచుతున్నారు. నిజానికి జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 అనే సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాతో పాటుగా ప్రశాంత్ నీల్ తో మరొక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
అయితే ఈ సినిమా విషయంలో ప్రశాంత్ నీల్ చాలా స్పష్టంగా ఉన్నాడు. 2025 సంక్రాంతికి ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ గ్లింప్స్ ను రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాని 2025 ఎండింగ్ కల్లా రిలీజ్ చేయాలనే ఉద్దేశ్యంలో ప్రణాళికలు రూపొందించుకుంటున్నట్టుగా తెలుస్తోంది. మరి ప్రశాంత్ నీల్ లాంటి స్టార్ డైరెక్టర్ చేస్తున్న ఈ ప్రయోగం సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుందా లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
ఇక ప్రస్తుతానికైతే ప్రశాంత్ నీల్ ను నమ్ముకొని ముందుకు సాగుతున్న ఎన్టీఆర్ తను ఏది చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమాతో భారీ సక్సెస్ ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని వీళ్లిద్దరూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది…