Gurram Papireddy Teaser Review: ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లో డిఫరెంట్ కాన్సెప్ట్ లతో సినిమాలు వస్తున్నాయి. మరి దానికి తోడుగా కామెడీ సినిమాలు మాత్రం ఎప్పుడు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. కామెడీకి సస్పెన్స్ తోడైతే బొమ్మ బ్లాక్ బస్టర్ అవుతుంది అని ఇప్పటికే చాలా సినిమాలు ప్రూవ్ చేశాయి. ఇక ఇప్పుడు నరేష్ అగస్త్య, ఫైరా అబ్దుల్లా మెయిన్ లీడ్ గా నటిస్తున్న ‘ గుర్రం పాపి రెడ్డి’ అనే మూవీ ట్రైలర్ గత కొద్దిసేపటి క్రితమే రిలీజ్ అయింది…ఇక మొదటి నుంచి కూడా ఈ టీజర్ ని కామెడీ యాంగిల్ లో కట్ చేశారు. ఇందులో థ్రిల్లర్ అంశాలు ఉన్నాయి అలాగే కామెడీని కూడా బాగా డీల్ చేసినట్టుగా తెలుస్తోంది…ఒక మర్డర్ మిస్టరీని బేస్ చేసుకొని ఈ స్టోరీ మొత్తాన్ని అల్లుకున్నట్టుగా టీజర్ లో మనకు క్లియర్ కట్ గా తెలిసిపోతోంది…ఇక యోగి బాబు, బ్రహ్మానందం లాంటి కమెడియన్లు ఈ సినిమాలో ఉన్నారన్న విషయాన్ని టీజర్ లో మనకు క్లియర్ గా తెలియజేశారు…
Also Read: ‘కాంతారా 3’ లో జూనియర్ ఎన్టీఆర్..ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నాడంటే!
ఇక సినిమా ఆద్యంతం కామెడీగా సాగుతున్నప్పటికి ఈ సినిమాలో థ్రిల్లింగ్ అంశాలు కూడా ఉండబోతున్నాయి అనేది స్పెషల్ గా తెలియజేశారు. అయితే కొన్నిసార్లు కామెడీ అనేది జెన్యూన్ గా అనిపించినప్పటికి, మరికొన్నిసార్లు అది రొటీన్ రొట్టా కామెడీల కనిపిస్తుంది. మరి ఈ సినిమాలో చెప్పాలనుకున్న పాయింట్ ను స్ట్రైయిట్ గా చెప్పే ప్రయత్నంలో భాగంగానే కామెడీని వాడుకున్నట్టుగా తెలుస్తోంది. ఇది ఒక వేళా సిచువేషనల్ కామెడీ అయితే బాగుంటుంది. కానీ ఫోర్సెడ్ కామెడీ అయితే మాత్రం సినిమా చూసే ప్రేక్షకుడికి కొంతవరకు ఇబ్బంది కలగవచ్చు… టీజర్ ని బట్టి చూస్తే ఈ సినిమాని ఈజీగా అంచనా వేయొచ్చు ఇలాంటి సినిమాలు మినిమం గ్యారెంటీ సినిమాలుగా వచ్చి ప్రేక్షకులను అలరిస్తూ ఉంటాయి. ఒకవేళ తేడా కొడితే మాత్రం ప్రేక్షకులు ఈ సినిమా నుంచి పూర్తిగా డివియెట్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. కామెడీని నమ్ముకున్న ప్రతిసారి ప్రతి సినిమా సక్సెస్ ఫుట్ గా నడుస్తోంది అనేది ఒకప్పుడు చాలా సినిమాలు ప్రూవ్ చేశాయి.
కానీ ఇప్పుడు వస్తున్నా ప్రేక్షకుడి టేస్ట్ ను బట్టి సినిమాలో దాదాపు వాళ్ళను థ్రిల్ చేసే అంశాలు పుష్కలంగా ఉండి కామెడీతో వాడు కడుపుబ్బ నవ్వగలిగితే మాత్రమే సినిమా అనేది సక్సెస్ ని సాధిస్తోంది. ఈ సినిమాలో కామెడీ, సస్పెన్స్ పుష్కలంగా ఉన్నట్టుగా తెలుస్తోంది…
ఇక ఈ సినిమాలో కొన్నిచోట్ల సీన్లు కొన్ని మైనస్ గా కనిపించినట్టుగా అనిపిస్తున్నప్పటికి అది సినిమా ఫ్లోలో కొట్టుకుపోతే పర్లేదు లేకపోతే మాత్రం సినిమా ఫ్లో కి ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయి…ఇక మ్యూజిక్ కూడా ఈ సినిమాకి బాగా సెట్ అయినట్టుగా టీజర్ ను చూస్తే తెలుస్తోంది.మరి విజువల్స్ కూడా చాలా అద్భుతంగా ఉండడంతో ఈ టీజర్ అయితే ప్రేక్షకుల్లో ఒక హ్యూమర్ ను టచ్ చేసింది.
చాలా రోజుల తర్వాత ఒక కామెడీ సినిమాని చూడబోతున్నాం అనే ఫీల్ అయితే టీజర్ లో మనకు కనిపించింది…ఇక ఈ టీజర్ ఈవెంట్ లో బ్రహ్మానందం మాట్లాడుతూ ఈ జనరేషన్ కమెడియన్స్ అయిన కసిరెడ్డి రాజ్ కుమార్, జీవన్ లాంటి వాళ్ళు చాలా బాగా నటిస్తున్నారు అని చెప్పాడు. అలాగే యోగిబాబు లాంటి నటుడిని నేను చూడలేదని తన కామెడీ చాలా బాగుంటుందని చెప్పాడు…ఇలా యంగ్ జనరేషన్ తో సినిమాలు చేయడం ఆనందంగా ఉన్నాడని చెప్పారు…