Ravi Teja Mass Jathara: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాస్ మహారాజా గా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు రవితేజ (Raviteja)…ఆయన చేస్తున్న సినిమాలన్నీ అతనికి గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టినవే కావడం విశేషం… చిరంజీవి తర్వాత ఆ రేంజ్ లో ఇండస్ట్రీకి సోలోగా వచ్చి సక్స్ ను సాధించిన హీరో కూడా తనే కావడం విశేషం… ప్రస్తుతం ఆయన ‘మాస్ జాతర’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఈనెల 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరి ఈ సినిమాతో మరోసారి మంచి సక్సెస్ ని సాధిస్తాడనే దృఢ సంకల్పంతో రవితేజ ఉండడం విశేషం…ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమాలో భారీ మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ కూడా ఉన్నట్టుగా తెలుస్తున్నాయి…ఇక ఈ సినిమా కథ ఏంటి అంటే ఒక ఏరియాలో కొంతమంది జనాల్ని పీడిస్తూ ఒక వ్యక్తి ఉంటాడు. మరి వాళ్ళ నుంచి ఆ జనానికి విముక్తిని కలిగించడానికి రవితేజ ఏం చేశాడు అసలు ఆ ఏరియా కి రవితేజ కి సంబంధం ఏంటి అనే పాయింట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది.
Also Read: రెమ్యూనరేషన్ విషయంలో యాంకర్ సుమ ని దాటేసిన సుడిగాలి సుధీర్!
ఇందులో కామెడీ యాక్షన్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండబోతున్నట్టుగా తెలుస్తున్నాయి. మరి ఏది ఏమైనా కూడా ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో రవితేజ చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు. ముఖ్యంగా ఈ మాస్ జాతర సినిమాతో భారీ సక్సెస్ సాధిస్తానని ఆయన కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.
ఇప్పటికే ఈ సినిమా ఇప్పుడు చాలా అద్భుతంగా వచ్చింది అంట. మరి ఆ కథకు తగ్గట్టుగానే ఈ సినిమా అవుట్ పుట్ కూడా చాలా బాగా రావడంతో సినిమా యూనిట్ మొత్తం చాలా భరోసాగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి మొత్తానికైతే రవితేజ ఈ సినిమాతో పక్కగా సక్సెస్ ని సాధిస్తానని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు.
మరి ఈ మధ్యకాలం రవితేజకు సరైన సక్సెస్ అయితే రావడం లేదు. గత కొన్ని రోజులుగా ఆయన చేస్తున్న సినిమాలన్నీ వరుసగా డిజాస్టర్ల బాటపడుతుంటే ఈసారి వచ్చే సినిమా సూపర్ సక్సెస్ ను సాధించాలి అనే ఒక నమ్మకంతో ఆయన సినిమా చేస్తున్నాడు. మరి ఈ సినిమా తేడా కొడితే మాస్ మహా రాజా రవితేజ యొక్క మార్కెట్ అనేది పూర్తిగా పడిపోయే అవకాశాలైతే ఉన్నాయి…