Homeఎంటర్టైన్మెంట్Ustaad Bhagat Singh: హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పరిస్థితి ఏంటి..? రిలీజ్...

Ustaad Bhagat Singh: హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పరిస్థితి ఏంటి..? రిలీజ్ ఎప్పుడు..?

Ustaad Bhagat Singh: తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తంలో అత్యంత ఎక్కువ క్రేజ్ ను కలిగి ఉన్న హీరోల్లో పవన్ కళ్యాణ్ ఒకరు. ఇండస్ట్రీ లో ఉన్న ప్రతి డైరెక్టర్ వాళ్ల ఎంటైర్ కెరియర్ లో ఒక్కసరైన పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని కోరుకుంటారు. ఎందుకంటే ఆయనతో సినిమా చేస్తే ఉండే కిక్కే వేరని అందరికీ తెలుసు.. ఆర్డినరీగా ఉన్న సినిమా కూడా ఎక్స్ ట్రా ఆర్డినరీ కలెక్షన్స్ ని వసూలు చేస్తుంది. అందుకే ఆయన సినిమా హిట్టు కొట్టినట్టు అయితే అది ఇండస్ట్రీ హిట్టుగా మారే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.

అయితే ఒక డైరెక్టర్ స్టార్ డైరెక్టర్ ఆవ్వాలంటే మాత్రం పవన్ కళ్యాణ్ తో సినిమా తప్పకుండా చేయాల్సిందే. అలా పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేసి స్టార్ డైరక్టర్లు గా గుర్తింపు పొందిన వాళ్ళలో హరీష్ శంకర్ ఒకరు. ప్రస్తుతం ఈయన రవితేజతో మిస్టర్ బచ్చన్ అనే సినిమా చేస్తున్నాడు. కానీ దానికంటే ముందే పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమాని స్టార్ట్ చేసి 50% షూట్ ని కూడా కంప్లీట్ చేశారు. ఇక ఇప్పుడు ఆ సినిమా సగంలో ఆగిపోయింది. కాబట్టి రవితేజతో ఒక కొత్త సినిమా స్టార్ట్ చేశారు.

అయితే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రిలీజ్ అయ్యే డేటు ఎప్పుడు అనేది ప్రస్తుతం ప్రేక్షకులందరిలో విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఇలాంటి క్రమంలోనే హరీష్ శంకర్ గాని, పవన్ కళ్యాణ్ గాని, ప్రొడ్యూసర్స్ అయిన మైత్రి మూవీ మేకర్స్ గాని ఈ సినిమా మీద ఎలాంటి అప్డేట్ ను ఇవ్వడం లేదు. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది థియేటర్లోకి వస్తుందా? లేదంటే ఈ సంవత్సరమే థియేటర్లోకి రానుందా? అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది.

ఎలక్షన్స్ ముగిస్తే గాని పవన్ కళ్యాణ్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనడు. ఆయన పాల్గొంటే గాని ఏ సినిమా ముందు రిలీజ్ అవుతుంది అనే విషయాల మీద క్లారిటీ అయితే రాదు. ఇక చూడాలి మరి ఈ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ బలప్రదర్శన బలమా వాపా?

ఢిల్లీ వేదికగా జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ బలప్రదర్శన దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రారంభమైన ఈ ఉద్యమం, 23 రోజుల నిరాహార దీక్ష...
Oktelugu Epaper
Exit mobile version