
తమిళ దిగ్గజ దర్శకుడు శంకర్ ఇటీవల రెండు వరుస ఫ్లాప్ లతో వెనుకబడ్డారు. అదే సమయంలో బాహుబలి మూవీలతో టాలీవుడ్ దర్శకుడు రాజమౌళి ఒక్క దెబ్బకు ప్యాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయాడు. అయితే ఐ, రోబో2 సినిమాలతో శంకర్ వెనుకబడిపోయాడు.
అందుకే ఈసారి ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. తన ఆల్ టైం హిట్ ‘అపరిచితుడు’ మూవీని హిందీలో లాంచ్ చేయబోతున్నాడు. అయితే 2005లో నాటి అవినీతి నిర్లక్ష్యంపై తీసిన ‘అపరిచితుడు’ మూవీ ఇప్పటికీ వర్కవుట్ అవుతుందా? అనేది డౌట్. అందుకే నేటి కాలానికి అనుగుణంగా దాన్ని మార్పులు చేయనున్నట్టు శంకర్ ప్రకటించాడు.అపరిచితుడును యాజ్ టీజ్ గా తీయనని తెలిపారు.
ఇక శంకర్-రణ్ వీర్ సింగ్ ‘అపరిచితుడు’ మూవీని పెన్ స్టూడియోస్ నిర్మించనుంది. ఇటీవల ‘ఆర్ఆర్ఆర్’ మూవీ హక్కులన్నింటిని హిందీలో కొనేసిన ఈ సంస్థ ఇప్పుడు ఈ సినిమాను నిర్మిస్తుండడం విశేషంగా మారింది.
అయితే ఇప్పటికే ‘ఇండియన్2’ సినిమాను శంకర్ తీస్తున్నాడు. తమిళనాట ఎన్నికల కారణంగా కమల్ హాసన్ బిజీగా ఉండడంతో సినిమా ఆగిపోయింది. కరోనా ఎఫెక్ట్ కూడా పడింది.
ఇప్పుడా మూవీ పూర్తయ్యాక రాంచరణ్ తో మూవీని శంకర్ పూర్తి చేస్తాడా? లేక హిందీలో రణ్ వీర్ సింగ్ తో మూవీ చేస్తాడా? అన్నది డౌట్ గా మారింది. ఎందుకంటే రాంచరణ్ మూవీ ప్రకటించి పూర్తి చేయకముందే శంకర్ హిందీ మూవీని ప్రకటించడంతో చరణ్ మూవీ సందిగ్ధంలో పడింది.