Devara Movie: దేవర తర్వాత కొరటాల పరిస్థితి ఏంటి..?

ఈ సినిమా తర్వాత ఆయన ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనే విషయం మీద సరైన క్లారిటీ అయితే లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలు అందరూ చాలా బిజీగా ఉన్నారు.

Written By: Gopi, Updated On : April 18, 2024 10:26 am

What is the situation of Koratala Siva after Devara

Follow us on

Devara Movie: సినిమా ఇండస్ట్రీకి మొదట రైటర్ గా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ సాధించిన తర్వాత డైరెక్టర్ గా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ఉద్దేశ్యంతో చాలామంది రైటర్స్, డైరెక్టర్స్ గా మారుతున్నారు. ఇక అందులో భాగంగానే కొరటాల శివ కూడా మొదట ఇండస్ట్రీకి రైటర్ గా ఎంట్రీ ఇచ్చినప్పటికి ఆ తర్వాత డైరెక్టర్ గా మారి తనదైన రీతిలో మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఇప్పుడు కొరటాల శివ ప్రస్తుతం దేవర అనే సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమా తర్వాత ఆయన ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనే విషయం మీద సరైన క్లారిటీ అయితే లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలు అందరూ చాలా బిజీగా ఉన్నారు. ఇక ఇప్పుడు స్టార్ హీరోలతో సినిమా చేసే అవకాశం దొరికే ఛాన్స్ అయితే లేదు. కాబట్టి తను మళ్లీ మీడియం రేంజ్ హీరోతో సినిమా చేయాల్సి వస్తుందా.? అనే ఉద్దేశ్యంలో ఉన్నాడట… ఇక ఇప్పటికే సోషల్ మీడియాలో అయితే ఇలాంటి కామెంట్స్ విపరీతంగా వస్తున్నాయి.

ఇక ఇదిలా ఉంటే ఒకవేళ స్టార్ హీరోలతో సినిమా చేసే ఛాన్స్ రాకపోతే కొరటాల శివ రవితేజ తో సినిమా చేసే అవకాశాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఇంతకు ముందు ఒక సినిమా రావాల్సింది. కానీ ఆ సినిమా అనుకోకుండా పట్టా లెక్కలేదు. ఇక దాంతో కొరటాల శివ బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోస్ తో సినిమాలు చేస్తూ వస్తున్నాడు. కాబట్టి ఆయనకి రవితేజతో సినిమా చేసే తీరిక అయితే లేకుండా పోయింది.

కాబట్టి ఇప్పుడు మళ్ళీ రవితేజ తో సినిమా చేసే అవకాశాలు అయితే ఉన్నాయంటూ చాలా వార్తలైతే వస్తున్నాయి. ఇక రవితేజకి కొరటాల శివకి మధ్య మంచి బాండింగ్ ఉందనే విషయం మనకు తెలిసిందే. ఎందుకంటే రవితేజ చేసిన భద్ర సినిమాకి కొరటాల శివ కథ, మాటలు అందించాడు. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య మంచి ర్యాపో ఉందన్న విషయం చాలా స్పష్టం గా తెలుస్తుంది…