Salaar Radharama: ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో ప్రభాస్ నటించి మెప్పించడమే కాకుండా ఈ సినిమా మీద ప్రతి ప్రేక్షకుడికి కూడా తమదైన రీతిలో అంచనాలను పెంచి ఆ అంచనాలను సక్సెస్ ఫుల్ గా రీచ్ అయ్యారు. అయితే ఈ సినిమాతో ప్రభాస్ మరొక రేంజ్ లో కనిపించాడు. తన యాక్షన్ ఎపిసోడ్స్ ని భారీ లెవెల్ లో చూపించడమే కాకుండా ఆయన తలుచుకుంటే ఏదైనా సాధ్యమవుతుందని సలార్ సినిమాతో సక్సెస్ ని కొట్టి చూపించారు. ఇక ఈ సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా రేంజ్ లో మంచి గుర్తింపు సంపాదించుకోగా, ఇక ఆయన తర్వాత పృధ్విరాజ్ సుకుమారన్ కూడా తనదైన రీతిలో నటించిన మెప్పించాడు. దాంతో అతనికి కూడా మంచి పేరు వచ్చింది.
ఇక వీరిద్దరి తర్వాత రాధా రామగా నటించిన శ్రేయా రెడ్డికి కూడా మంచి పేరు వచ్చింది. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో రాధా రామ క్యారెక్టర్ చేసిన శ్రేయ రెడ్డి ఎవరు అనే దానిమీద చాలా చర్చలు నడుస్తున్నాయి. ఈమె తమిళం లో వచ్చిన పొగరు సినిమాతో కోలీవుడ్ మంచి పేరు తెచ్చుకుంది.ఇక అంతకు ముందే తెలుగులో అప్పుడప్పుడు, అమ్మ చెప్పింది లాంటి సినిమాల్లో నటించింది. అయినప్పటికీ తనకి తెలుగులో సక్సెస్ రాకపోవడంతో కోలీవుడ్ లో విశాల్ తో చేసిన పొగరు సినిమాలో ఒక పవర్ ఫుల్ క్యారెక్టర్ లో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది.అయితే ఈమె విశాల్ వాళ్ళ అన్నయ్య అయిన విక్రమ్ రెడ్డిని పెళ్లి చేసుకుంది. విక్రమ్ రెడ్డి ఇండస్ట్రీకి వచ్చే ముందు ఆర్జే గా పనిచేశాడు తను కూడా అప్పుడు ఆర్జె గా పనిచేయడంతో వీళ్ళ మధ్య అప్పటినుంచి మంచి సన్నిహిత్యం ఏర్పడింది.ఇక అధికాస్త ప్రేమగా మారి ఇద్దరు పెళ్లి చేసుకున్నారు.
అయితే ఈమె పెళ్లి చేసుకున్న తర్వాత కొద్ది రోజులపాటు అమెరికాలో బిజినెస్ కి సంబంధించిన పనులు చూసుకుంటూ అక్కడే బిజీగా ఉంది. ఇక ఆమె సెకండ్ ఇన్నింగ్స్ గా సుడల్ ఒక వెబ్ సిరీస్ చేసింది. ఇక అందులో ఆమె ఒక పవర్ ఫుల్ పాత్రలో నటించడంతో ఆమెకి సలార్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అలాగే పవన్ కళ్యాణ్ తో వచ్చే ఓజి సినిమాలో కూడా నటించే అవకాశం వచ్చింది. ఇక ఇప్పుడు సలార్ సినిమాతో ఆమె క్యారెక్టర్ చాలా ఎలివేట్ అవ్వడంతో ఇక ఆమె కి పాన్ ఇండియా రేంజ్ లో మంచి అవకాశాలు వచ్చే ఛాన్సులు కూడా ఉన్నాయి…
ఇక శ్రేయ రెడ్డి వాళ్ల నాన్న భరత్ రెడ్డి ఇండియన్ టీం తరఫున కొన్ని ఇంటర్నేషనల్ మ్యాచ్ లను కూడా ఆడాడు.1978-81మధ్య పాకిస్తాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ టీం లతో జరిగిన వన్డే మ్యాచ్ లకు తను ప్రాతినిధ్యం వహించాడు. 1982-83 నుంచి 85-86 సంవత్సరాల్లో తమిళ్ నాడు టీమ్ కి కెప్టెన్ గా కూడా వ్యవహరించాడు…