Allu Arjun and Bunny Vasu: సినిమా ఇండస్ట్రీలో రాణించడం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు… హీరోలు సైతం విపరీతంగా కష్టపడి సినిమాలు చేస్తుంటారు. వాళ్లు చేసిన సినిమాలతో మంచి గుర్తింపును సంపాదించుకోవడానికి అహర్నిశలు కష్టపడుతూ ఉంటారు. ఇక కాసేపు హీరోల టాపిక్ పక్కన పెడితే ఇండస్ట్రీ లో ప్రొడ్యూసర్ గా రాణించడం అనేది కత్తి మీద సాము లాంటింది. ఒక సినిమాను నిర్మించి సక్సెస్ సాధించాలి అంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం బన్నీ వాసు చిన్న సినిమాలను చేస్తూ భారీ విజయాలను అందుకుంటున్నాడు. ఇక అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో కొన్ని రోజులు పని చేసిన బన్నీ వాసు…ఆ తర్వాత గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ ను స్థాపించారు. దీని మీద చిన్న సినిమాలను నిర్మిస్తున్నాడు… బన్ని వాసు మొదటి నుంచి కూడా అల్లు అర్జున్ అంటే చాలా ఇష్టాన్ని చూపించేవాడు. కారణం ఏంటి అనేది పక్కన పెడితే ఒక సామాన్య వ్యక్తిగా ఉన్న బన్నీ వాసు ఇప్పుడు ప్రొడ్యూసర్ గా ఎదగడం నిజంగా చాలా గ్రేట్ అనే చెప్పాలి…
మొదట యానిమేషన్ ఎంప్లాయ్ గా తన కెరియర్ ని స్టార్ట్ చేసిన బన్నీ వాసు ఆ తర్వాత అల్లు అర్జున్ సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరిస్తూ ఆ తర్వాత ప్రొడ్యూసర్ గా మారి సినిమాలను నిర్మిస్తున్నాడు… అల్లు అర్జున్ తో తనకు ఎలాంటి రిలేషన్ లేకపోయిన కూడా కేవలం అతని మీద ఉన్న ఇష్టంతోనే ఆయన సినిమా ఇండస్ట్రీకి వచ్చి అతనికి సన్నిహితుడిగా మారాడు.
ఇక దాంతో అల్లు అర్జున్ సైతం బన్ని వాసు ను ఎంకరేజ్ చేస్తూ వచ్చాడు. మొత్తానికైతే అల్లు అర్జున్ కి ఏ ఇబ్బంది లేకుండా బన్ని వాసు మొత్తం అంతా క్లియర్ చేస్తూ ఉంటాడు.అతనికి సినిమాల పరంగా అయిన, పర్సనల్ గా అయిన ఏ చిన్న ప్రాబ్లం వచ్చిన కూడా దాన్ని ఆ మొత్తాన్ని బన్నివాసి చూసుకుంటాడు. అందుకే అల్లు అర్జున్ సైతం బన్ని వాసుకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటాడు…
ప్రస్తుతం బన్ని వాసు అల్లు అర్జున్ ఫ్యామిలీ మెంబర్ గా మారిపోయాడు. మొత్తానికైతే వీళ్ళ బాండింగ్ చాలా బాగుంటుందని అల్లు అరవింద్ సైతం చాలా సందర్భాల్లో తెలియజేశాడు… మరి బన్నీ వాసు ఇప్పటివరకు చిన్న సినిమాలు నిర్మిస్తూ వస్తున్నాడు. ఇక మీదట పెద్ద సినిమాలను కూడా నిర్మించి భారీ సక్సెస్ లను సాధిస్తాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…