https://oktelugu.com/

Mahesh-Rajamouli movie : మహేష్- రాజమౌళి సినిమాకు వారణాసికి సంబంధం ఏంటి?

ప్రభాస్‌ కల్కి మూవీకి, సూపర్‌స్టార్‌ మహేష్ బాబు రాజమౌళి సినిమాక ఏమైనా స్పెషల్ లింక్ ఉందంటారా? రెండు సినిమాల సబ్జెక్టులకూ ఓ పట్టణంతో పెద్ద బంధం, అనుబంధం ఉందా? అనే టాపిక్ ఇప్పుడు పెద్ద ట్రెండింగ్. కల్కి సీక్వెల్‌కీ, ఎస్ఎస్ఎంబీ29కీ మధ్య ఉన్న సంబంధం ఎలాంటిది? అనే విషయాలు చూసేద్దాం.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : November 17, 2024 / 03:35 PM IST

    Mahesh-Rajamouli movie

    Follow us on

    Mahesh-Rajamouli movie : దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా పాన్ వరల్డ్ సినిమా రాబోతుందనే విషయం తెలిసిన దగ్గర నుంచి అభిమానులు తెగ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభం అయ్యాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి షూటింగ్ సురు కూడా కాబోతుంది. ఇదిలా ఉంటే సినిమా బడ్జెట్ దాదాపు రూ.1200 కోట్ల నుంచి రూ.1500 కోట్లు అవుతుందని సమాచారం. అందుకు తగ్గట్లుగానే సినిమాను భారతదేశంలోని పలు భాషల్లో తెరకెక్కిస్తున్నారు. అంతేకాదు వివిధ విదేశాలకు చెందిన ఇతర భాషల్లో కూడా విడుదల కాబోతుంది సినిమా. షూటింగ్ ప్రారంభం కానప్పటికీ ఈ చిత్రం బిజినెస్ పై ఇప్పటినుంచే అంచనాలు విపరీతంగా ఉన్నాయి.

    ప్రభాస్‌ కల్కి మూవీకి, సూపర్‌స్టార్‌ మహేష్ బాబు రాజమౌళి సినిమాక ఏమైనా స్పెషల్ లింక్ ఉందంటారా? రెండు సినిమాల సబ్జెక్టులకూ ఓ పట్టణంతో పెద్ద బంధం, అనుబంధం ఉందా? అనే టాపిక్ ఇప్పుడు పెద్ద ట్రెండింగ్. కల్కి సీక్వెల్‌కీ, ఎస్ఎస్ఎంబీ29కీ మధ్య ఉన్న సంబంధం ఎలాంటిది? అనే విషయాలు చూసేద్దాం.

    కల్కి సినిమా చూశారా? అయితే చూసిన వారికీ, వారణాసితో ఆ సినిమాకున్న అనుబంధం గురించి తెలిసే ఉంటుంది కదా. ఫ్యూచరిస్టిక్‌ కథకు, వారణాసితో లింకు పెట్టారు డైరెక్టర్ నాగ్‌ అశ్విన్‌. ఇప్పుడు సెకండ్‌ పార్టులోనూ వారణాసి ప్రస్తావన కచ్చితంగా ఉంటుందని తెలిసిందే. వారణాసి అంటే చాలా మందికి క్యూరియాసిటీ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. ఇదిలా ఉంటే జక్కన్న తెరకెక్కిస్తున్న సినిమా గురించి కూడా చెప్పాల్సిన అవసరం లేదు. మహేష్ బాబు సినిమా కోసం కూడా వారణాసి సెట్‌ని వేస్తున్నారు ఈ గ్రేట్ డైరెక్టర్. హైదరాబాద్‌ శివార్లలో ఈ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయట. మహేష్‌బాబు ఓ పౌరాణిక పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. మరి ఆ క్యారెక్టర్ ఏంటో క్లారిటీ రావాలంటే వెయిట్ చేయాల్సిందే.

    ఎస్ఎస్ఎంబీ29లో హనుమాన్‌ పాత్ర కూడా ఉంటుందని ఆ మధ్య జోరుగా వినిపించాయి వార్తలు. ఆ మాటలకు వత్తాసు పలికేలా మహేష్‌.. రాముడి గెటప్‌లో ఉన్న ఫోటోలు కూడా దర్శనం ఇస్తున్నాయి. ఇక వారణాసికి భవిష్యత్తును ముడిపెట్టి నాగీ.. కల్కి మూవీ తీస్తే, జక్కన్న మాత్రం వారణాసికి పురాణాలను ముడిపెట్టి అరణ్యాలలో కథలను సెలెక్ట్ చేసుకున్నారు అని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఎస్ఎస్ఎంబీ29 జోనర్‌ ఏంటి? అనే చర్చ నెట్టింట్లో జోరందుకుంది.

    కథకు, రామాయణానికి లింక్..అటవీ నేపథ్యంలో ఫారెస్ట్ యాక్షన్ అడ్వెంచర్ గా ఈ సినిమా రాబోతోందంటున్నారు. తాజాగా మరో వార్త ప్రాచుర్యంలోకి వచ్చింది. సినిమా కథ కాశీ బ్యాక్ డ్రాప్ లో ప్రారంభమవుతుందని, మహేష్ బాబు శ్రీరాముడిగా నటించబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. దీనిపై చిత్ర యూనిట్ అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. సినిమా కథకు, రామాయణానికి లింకు ఉంటుందంటున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తున్నారు అనే విషయంపై చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. దీపికా పదుకొనే పేరుతో పాటు ఇండోనేషియాకు చెందిన చెల్సియా ఇస్లాన్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే అవేవీ ఖరారు కాలేదు. తాజాగా హాలీవుడ్ హీరోయిన్ ఖరారైనట్లు తెలుస్తోంది.