https://oktelugu.com/

Pushpa 2: పుష్ప 2 విషయం లో కంగారు పడుతున్న సుకుమార్ కారణం ఏంటి..?

సినిమా ఇండస్ట్రీ అనేది ప్రతి ఒక్కరికి చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. బయటి నుంచి చేసే జనాలకు అయితే సినిమా ఇండస్ట్రీలో నటించే హీరోలు గానీ, సినిమాలను చేసే దర్శకులు గానీ దైవాంశ సంభూతులుగా కనిపిస్తూ ఉంటారు. కారణం ఏంటి అంటే ఆడియన్స్ వాళ్లను స్క్రీన్ మీద చూస్తూ ఉంటారు. కాబట్టి వాళ్లను కలవడానికి వాళ్లతో ఫోటోలు దిగడానికి సగటు ప్రేక్షకులు ఎప్పుడు ఆసక్తి చూపిస్తూ ఉంటారు...

Written By:
  • Gopi
  • , Updated On : October 6, 2024 / 01:50 PM IST

    Pushpa 2

    Follow us on

    Pushpa 2: ఇంటెలిజెంట్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు సుకుమార్…ఆయన చేసిన ఆర్య సినిమా నుంచి ఇప్పుడు చేస్తున్న పుష్ప 2 సినిమా వరకు ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం ఉంటుంది. అలా సినిమా సినిమాకి వేరియేషన్ ని చూపిస్తూనే తన ఇంటలిజెన్స్ మొత్తాన్ని తన సినిమా మీద చూపిస్తూ ఉంటాడు. అందుకే ఆయన చేసే సినిమాలు చాలా ప్రత్యేకంగా నిలుస్తూ ఉంటాయి. ఒకసారి ఆయన నుంచి ఒక సినిమా వచ్చింది అంటే చాలు ఆ సినిమా ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల పాటు గుర్తుండిపోతుంది. అందుకే ఆయన నుంచి సినిమాలు ఎక్కువగా రావాలని తన అభిమానులు ఎక్కువగా కోరుకుంటూ ఉంటారు. ఇక స్టార్ హీరోలు సైతం ఆయన సినిమాలో నటించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇంతకు ముందు పుష్ప సినిమాతో భారీ సక్సెస్ ని అందుకున్న ఆయన ప్రస్తుతం పుష్ప 2 సినిమాతో మరొకసారి ప్రేక్షకులను పలకరించే ప్రయత్నం చేస్తున్నారు. డిసెంబర్ 6 వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, గ్లింప్స్ ప్రేక్షకుల్లో విపరీతమైన హైప్ ని క్రియేట్ చేస్తున్నాయి.

    ఇక అల్లు అర్జున్ ఈ సినిమాతో మరోసారి పాన్ ఇండియాలో తన సత్తా చాటుకోవాలనే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. పుష్ప సినిమాతో మొదటిసారి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరికి దక్కని ఒక అరుదైన గౌరవం కూడా అల్లు అర్జున్ కి దక్కింది. అది ఏంటి అంటే ఆయనకు ఆ సినిమాతో ఉత్తమ నటుడిగా ‘నేషనల్ అవార్డు’ కూడా వచ్చింది.

    కాబట్టి పుష్ప 2 సినిమాని కూడా చాలా ప్రెస్టేజ్ గా తీసుకొని ఇద్దరు కలిసి భారీ ప్రణాళికలతో రూపొందిస్తున్నట్టుగా తెలుస్తుంది… ఇక ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ సుకుమార్ పుష్ప 2 సినిమా విషయంలో కొంతవరకు అసంతృప్తిగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటివరకు ఆయన చేసిన షూట్ మొత్తాన్ని గనక చూసినట్టయితే అందులో చాలా సీన్స్ ఆయనకు సంతృప్తిని కలిగించడం లేదట.

    దాంతో ప్యాచ్ వర్క్ ల మీద ప్యాచ్ వర్క్ లు చేస్తూ సినిమాను చాలా గ్రిప్పింగ్గా తీసుకొచ్చే ప్రయత్నాలైతే చేస్తున్నాడు. మరి ఇప్పటికీ ఆయన ఈ సినిమా మీద అంత కాన్ఫిడెంట్ గా ఉన్నట్టుగా అయితే కనిపించడం లేదు. దానివల్లే సుకుమార్ ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో అని కొంచెం కంగారులో ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. i ఈ సినిమా రిలీజ్ అయితే కానీ దాని ఫలితం ఏంటి అనేది ఎవరికీ తెలియదు…